Posts

Showing posts from December, 2019

సాయి కథలు : రామకృష్ణ పరమహంస - జీసస్ క్రీస్తు

Image
 శ్రీసాయినాథాయనమః  ప్రియ పాఠకమహాశయులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు !  సాయి కథలు :  రామకృష్ణ పరమహంస - జీసస్ క్రీస్తు " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము మతములను పారే  పావన జీవ  నదులుగా భావిస్తే, ఆధ్యాత్మికతపరిపూర్ణతనును  సాగర సంగమంగా తలచవచ్చును.  అవతారపురుషుల, మహాత్ముల  జీవితవిశేషాలు పవిత్రసంగమాన్ని పోలియుంటాయి. శిరిడీ సాయిబాబా, తామే సర్వ దేవీ, దేవత, యోగి, సర్వమత  ప్రవక్త,  సర్వజీవ, విశ్వమంతా వ్యాపించిన చేతనాచేతన సృష్టి రూపులుగా భక్తులకనుభవమిచ్చారు. సాయి జీవనానికి సమాంతరంగా  రామకృష్ణ పరమహంస జీవితం గోచరిస్తుంది. ఎవరు రాముడో, యెవరు కృష్ణుడో అతడే ప్రస్తుతం ఈదేహం ధరించాడని వారే చెప్పారు. అంతేగాక అన్నిమతముల మూలసత్యమొక్కటేయని తాము స్వయంగా అనుభవం పొంది యున్నారు. రామ,కృష్ణ, హనుమ, రాధ, చైతన్య,  ప్రవక్త మహమ్మద్, జీసస్ మొదలుగాగల ప్రవక్తల ఏకరూప దైవత్వాన్ని  పరమహంస స్వయంగా పొందియున్నారు. సాయిబాబా, జీసస్ క్రిస్తు ఒకరే యనెడి ఓ భక్తురాలి అనుభవమును ' సాయీ నీవే...

సాయి కథలు - కుండలిని శక్తి

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - కుండలిని శక్తి " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము భగవంతుని జేరుటకు మన శాస్రములందు వేరు వేరు మార్గములు చెప్పబడినవి. ఆయా మార్గములను  యోగములనియు యందురు, ఉదాహరణకు కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగమార్గములు మొదలగునవి. కుండలినీ యోగమార్గముగూడ భగవంతునిజేరు యొకదారియని సిద్ధయోగులు వచించినారు. . సాయిబాబా విషయమున కుండలినీ సాధన వివరములు గుహ్యమైనప్పటికీ, వారు పరిపూర్ణ యోగసిద్ధులుగ అందరికి తెలిసిన విషయమే.  వారి జీవనము కుండలినీ యోగము సిద్ధించిన యోగులజీవితమును బోలియుంటుంది.  అందరిలో నిద్రాణమైన దైవశక్తియే కుండలినీశక్తిగా చెప్పబడినది. ఆశక్తి మనిషి  వెన్నెముక క్రిందిభాగంలోని మూలాధారచక్రమందు చుట్టచుట్టుకొని  నిదురించెడి సర్పంగా యోగులు అనుభవపూర్వకంగా లోకానికి తెలియజేసారు. సాధారణ మానవుడు దైవమును జేరు మార్గములలో ఇది యొకటిగా పేర్కొనబడినది. కుండలిని తంత్రయోగమునకు సంబంధించినది. నిదురించెడి శక్తిని సద్గురుని సహాయముచేతగాని, యోగసాధనముచేగాని మేల్కొలిపి, వెన్నెముక క్రిందభాగమునయున్న మూలాధారచక్రమునుండి వెన్నెముక ...

సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము 2

Image
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - గురుస్పర్శ ప్రభావము  2 " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి  భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తిపజేయును."   దైవస్పర్శ ప్రభావము మరియు  శక్తి,   రామాయణ మహాభాగవత సద్గ్రంధములందు సోదాహరణముగా వివరింపబడినది. శ్రీరామచంద్రుని పాదస్పర్శచే శిలారూపము దాల్చిన అహల్య సుందరమూర్తిగా శాపవిమోచనం పొందినది. శ్రీకృష్ణుడు కురూపి కుబ్జను తాకి సౌందర్యరూపిణిగా మార్చారు. ఈభాగమునందు శ్రీరామకృష్ణ పరమహంస  నరేంద్రుని (స్వామి వివేకానంద) స్పృశించి తమశక్తిని చొప్పించి వానికి దివ్యదైవదర్శనం కల్గించిన  వివరములను పరిశీలించెదము. శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందుల ప్రధమ కలయిక ఎల్లప్పుడూ దైవావస్థలో విలసిల్లే రామకృష్ణులకు వారు కాంక్షించే  తమ రాబోయే మరియు కాబోయే శిష్యుల ఆగమన వివరములు బాగుగ తెలియును. కలకత్తాలోని సిమ్లా ప్రాంతానికి చెందిన సురేంద్రనాథ్ మిత్ర దక్షిణేశ్వరిలోని రామకృష్ణుల మొట్టమొదట దర్శనముతోనే  మిగుల ఆకర...