Posts

Showing posts from November, 2020

నాటకదీపము.

Image
 శ్రీసాయినాథాయనమః  " తమసోమా జ్యోతిర్గమయా "  నేడు కార్తీకపౌర్ణమి, వెలుగువైపు ప్రయాణానికి సంకేతం !  ( దీపాన్నిగూర్చి ఆధ్యాత్మ పరంగా  " పంచదశి "  యను వేదాంతగ్రంధంలో చెప్పబడిన కొన్ని ఆసక్తికర విషయముల నిచట  చర్చించడమైనది. ) " జీవితం ఓ రంగస్థలం, మనుషులంతా పాత్రధారులే ! "  విలియం  షేక్స్పియర్  శిరిడీసాయిబాబా సద్గ్రంథపఠనమును మిగుల ప్రోత్సహించేవారు. తమ తమ విరామసమయంలో వివిధభక్తులు భావార్ధరామాయణము, జ్ఞానేశ్వరి, ఎకనాథభాగవతము, భగవద్గీతాది సద్గ్రంధాలను చదువుచూ తోటివారికి వినిపించెడివారు. దాదాసాహెబ్ ఖాపర్డే  అమరావతికి చెందిన ప్రఖ్యాత లాయరు, విద్యావేత్త, స్వాతంత్ర్యోద్యమకారుడు, తిలక్ కు కుడిభుజంలాంటివాడు. అతడు శిరిడీలో నాలుగుమాసములుండి బాబాను మిగులసేవించిన ధన్యాత్ముడు. ఖాపర్డే విద్యారణ్యస్వామిచే  14వ  శతాబ్దంలో వ్రాయబడిన పంచదశి యనెడి ఆధ్యాత్మగ్రంధము చదువుచూ యితరులకు వివరించెడివారు. పంచదశి 15 అధ్యాయములతోకూడిన అద్వైతవేదాంతగ్రంధము సంస్కృతభాషలో వ్రాయబడినది.  అందు 10వ అధ్యాయముపేరు నాటకదీపము, పాఠకులకులకు మిగులప్రియమైనది. ఈఅధ్యాయంలో ని...

దీపావళి.

Image
 శ్రీసాయినాథాయనమః  పాఠకభక్తులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు, సాయిబాబా దివ్యాశీసులు !  దీపావళి కర్ధం వెలిగే దివ్వెల వరుసని. సాయిబాబాకు నిత్యం ద్వారకామాయిలో దీపాలువెలిగించడమంటే యెంతో ప్రియం, ఎంత ఇష్టమన  శిరిడీలో రోజువారీ నూనెనిచ్చే వర్తకులు ఓరోజు నూనెలేదన నీళ్లతో దివ్వెల వెలిగించి ద్వారకామాయినంత తేజోమయం జేశారు. తప్పు నెరిగిన వ్యాపారులను కరుణామయి  సాయి క్షమించారు. బాలసాయి వివరములు తెలియగోరిన  శిరిడీ వాసులు ఖండోబా ఆవేశించిన ఓ వ్యక్తిని ప్రశ్నింప, వేపచెట్టుకింద తవ్వమన్నాడు. తవ్విచూడగా ఓ పెద్దబండరాయి దానికింద భూగృహము అందు వెలుగుచున్నదీపాలు యితర పూజాపరికరాలు కనిపించాయి. సాయి అది తమగురుస్థానమని అందు తాము పన్నెండేళ్ళు గురుసేవ జేసామని, కావున దానిని రక్షించాలని చెప్పినమీదట గ్రామస్తులలానే జేసి మునుపటిలా మూసివేశారు. వేరొక సందర్భంలో ఓక  భక్తుడు  చెక్కబల్ల సమర్పింప  సాయి దానిని గుడ్డపీలికల సాయంతో మజీదుకప్పుకేలాడవేసి, దానికి నాలుగువైపులా దీపాలనుంచి నిదురించే సాయిని జూసి భక్తులు మిగుల విస్తుపోయేవారు. భక్తుల తాకిడి పెరుగగా  బాబా దానిని విరచి ధునిలోవేసా...