Posts

Showing posts from January, 2021

నీ గురునే నమ్ముకో!

Image
 శ్రీసాయినాథాయనమః  " " ఈ లోకములో అనేకమంది యోగులు కలరు. గాని మనగురు వసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని మనము మన గురువుయొక్క పలుకులను మరువరాదు. వేయేల! హృదయపూర్వకముగ నీగురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మొక్కుము. అట్లు చేసినచొ సూర్యునిముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు." శ్రీ సాయిబాబా. ఒకనాడు పంతు  అను ఓ భక్తుడు తనబంధుమిత్రులతో కలసి సాయిబాబా దర్శనం చేసికొన్నాడు. ( పంతు వేరొకరిని తనగురువుగా నమ్ముకొన్నాడు). బాబాను చూడవచ్చిన భక్తులతో ద్వారకామాయి ఎంతో సందడిగా, ఆనందమయంగా  వుంది. కాని బాబా దర్శనానంతరం పంతుకు హఠాత్తుగా మూర్ఛవచ్చి క్రిందపడిపోయాడు. బాబా దయచే కొంతసేపటికి యాతనికి తెలివి వచ్చినది. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి, నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు వానితో పై మాటలన్నారు. ఈ సందర్భంలో గురుశిష్యుల సంబంధాన్నిగూర్చి కొద్దిగా పరిశీలిద్దాము. భక్తుని భగవంతుని పెళ్ళిజేసే పూజారి గురువని శ్రీరామకృష్ణ పరమహంస తెలియజెప్పారు. తమ ప్రతిభకు తమగురువే మూలకారణమని సాయిబాబా భక్తులతో చెప్...