సాయిమహిమ - జాంనేరులీలా విశ్లేషణ !
శ్రీసాయినాథాయనమః! " ఎవరైతే నా లీలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును." శ్రీసాయిబాబ. దీనినిబట్టి సాయి తమ లీలాశ్రవణమునకెంత ప్రాధాన్యమిచ్చారో ఊహింపగలము. సాయిబాబాపై భక్తిపెరుగుటకు వారి లీలాస్మరణము ఓ చక్కనైన మార్గము. ప్రస్తుతము అతిప్రాచుర్యం పొందిన సాయి లీలనొక్కటిని క్లుప్తముగా గుర్తుకు తెచ్చికొనెదము. నానాసాహెబు చాందోర్కర్ సాయికి గొప్పభక్తుడు, సాయిమహిమలను దూరదూర ప్రాంతాలకు వ్యాపింపజేయడంలో ప్రముఖ పాత్రవహించిన ఘనుడు. ఈ సంఘటన 1904-1905 ప్రాంతంలో జరిగినది, ఆసమయాన చాందోర్కర్ శిరిడీకి బహుదూరమైన జలగాం కి సమీప జాంనేరు నందు మామల్తదార్ (deputy collector) గా పనిజేస్తున్నాడు. వానికుమార్తె మైనతాయి నిండుగర్భిణి 2,3 దినములుగా మిగుల ప్రసవవేదననుభవించు చుండెను. నానా సాహెబ్ మందులనెన్నింటినో వాడినను ప్రయోజనం కలుగకుండెన, ు యింట్లో బాబావిభూతి లేకుండెను. అట్టి నిస్సహాయ స్థితిలో ఆతడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని సాయంకోసమై దీనంగా ప్రార్ధించాడు. సాయి సర్వాంతర్యామి సర్వహృదయనివాసి కరుణామయుడు, నానా ప్రార్ధన బాబా దయాహృదయాన్ని తాకింది. సాయి కుశలకర్ముడు, వారిని నమ్మినవారి పనులు విచిత్రంగా సమకూరుతాయి....