Posts

Showing posts from August, 2021

శ్రీకృష్ణభగవానుడు చెప్పిన భక్తుని లక్షణములు.

Image
శ్రీసాయినాథాయనమః!శ్రీకృష్ణపరమాత్మనేనమః! పాఠకమహాశయులెల్లరకు జన్మాష్టమి శుభాకాంక్షలు! సాధారణంగా జనులు తమకు నచ్చినవిధంగా తమతృప్తికి ఆనందానికి అనుగుణంగా దేవుని పూజిస్తారు. దేవునిపై భావంకూడా ఉహాజనితమే! మనకు ఇష్టమైన విధంగాగాక భగవంతునికి ప్రీతికలుగునటుల మన నిత్యవ్యవహారములను సరిదిద్దుకొనుట ఆధ్యాత్మిక ప్రగతికెంతో ముఖ్యమైన విషయము. భగవంతుడనగా ధర్మము. ధర్మానికనుగుణంగా నడచుకోగలిగితే దైవానికి ఇష్టమైనవారలమే గదా! భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగములో శ్రీకృష్ణపరమాత్మ తమకు ప్రియమైన భక్తలక్షణాలను అర్జునకు వివరించాడు. అసందేశం సర్వులకు వర్తిస్తుందనే వుద్దేశ్యంతో శ్రీకృష్ణజన్మాష్టమి శుభసందర్భమున స్మరించుట మిగుల సమంజసముగాతలచి శ్రీకృష్ణసందేశమిచట మిగుల క్లుప్తముగా వ్రాయడమైనది. ప్రియభక్తుని లక్షణములు వరుసగా 1)సర్వభూతములను అనగా యెవరిని ద్వేషింపనివాడు. 2)మిత్రధర్మము కలవాడు. 3)కారుణ్యము కలవాడు. 4)మమకారములేనివాడు. 5)అహంకారరహితుడు. 6)సుఖదుఃఖములయందు సమభావము కలిగినవాడు.7)ఓర్పుకలవాడు.8)నిత్యసంతోషి.9)ధ్యానానుష్ఠానపరుడు. 10)మనోనిగ్రహము కలవాడు.11)దృఢమైన జ్ఞానముకలవాడు.12)భగవంతునియందర్పించిన మనసు బుద్ధికలవాడు.1...

సాయిలీలా విశ్లేషణ - రాచకురుపు నయమగుట.

Image
శ్రీసాయినాథాయనమః! శ్రీసాయిబాబా వైద్యులకు వైద్యుడు, మహావైద్యుడు, సాక్షాత్తు నారాయణుడు. 'వైద్యోనారాయణోహరి' నానుడి సాయి పట్ల పరిపూర్ణముగా సార్ధకమైనది. ప్రస్తుత విషయము శ్రీసాయిసచ్చరిత్ర 34 అధ్యాయమునుండి గ్రహించడమైనది. ఇందు శ్రీసాయినాథుల భక్తకారుణ్యము, సామర్ధ్యము, ద్వారకామాయి ప్రాశస్థ్యము, బాబా మాటలమంత్రాక్షరాలు, ఉదీమహిమ మున్నగు విషయములను పాఠకులు తెలియగలరు. ఈవిశేషములనిచట క్లుప్తముగా పరిశీలించెదము. ఓ కుఱ్ఱవాడు నయముకాని రాచకురుపువ్యాధిచే బాధపడుచున్నాడు. ఆతని మేనమామ నాసిక్ జిల్లాలోని మాలేగాంలో పెద్దవైద్యుడు. మానవప్రయత్నము కొంతవరకుమాత్రమే విజయవంతమగునటుల, ఆ డాక్టరుతో పాటు మరికొందరు వైద్యులు మిగులప్రయత్నించినప్పటికీ వాని వ్యాధి తగ్గలేదు. బంధుమిత్రుల సలహాపై తల్లిదండ్రులు కుర్రవానిని బాబాచెంతకు తెచ్చి బిడ్డనుకాపాడమని మిగులవినయవిధేయతలతో వేడుకొన్నారు. వారినోదార్చి శ్రీసాయినాథులిట్లన్నారు, " ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు వ్యాధిచేబాధపడరు, కురుపుపై ఉదినిపూయుడు. దేవునిపై నమ్మకముంచుడు. ఇది పాతమజీదుకాదు, ద్వారవతి. ఇందుకాలిడినవారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారికష్టములు గట్టెక్క...