Posts

Showing posts from September, 2021

సాయిబాబా శ్రీగణేశుడు.

Image
శ్రీసాయిగణేశాయనమః! పాఠకభక్తులెల్లరకు వినాయకచవితి శుభాకాంక్షలు. శ్రీసాయిసచ్చరిత్ర గ్రంధారంభమున రచయిత హేమాద్రిపంత్ ప్రప్రధమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి గ్రంథరచన జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని స్థుతించాడు.నిత్యం శిర్డీలోని సాయిసమాధిమందిరంలో భక్త దాసగణు రచించిన శ్రీసాయినాథ స్థవన మంజరి శ్రవణం జరుగుతుంది. స్థవనమంజరి రచన 9-9-1918, సోమవారం గణేశ చతుర్థి రోజున (నేటికి సరిగా 103 సంవత్సరముులపూర్వము) నర్మదానది తీరాన మహేశ్వర క్షేత్రమువద్ద సమాప్తమైనది. దాసగణు స్వయంగా బాబాకు మూడురోజులపిమ్మట సెప్టెంబరు 12న వినిపించి వారికంకితంజేసి ఆశీసులు పొందాడు. సాయి మిగుల ప్రసన్నులై "దీనిని నిత్యపారాయణ చేసేవారి సర్వారిష్టాలు తొలగిపోతాయని" అన్నారు. చిదంబరరావు గాడ్గిల్ యనే గణపతిభక్తుడు ఓ పర్యాయము శిరిడీలో సాయిని దర్శించి, అప్పటినుండి యింటివద్ద బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు శిరిడీ వచ్చినపుడు సాయి చిరునవ్వుతో, " ఈముసలాయన చాలాటక్కరి ఎలుకే నావాహనమని కనిపెట్టాడు" అన్నారు. మరొక పర్యాయం బాంద్రానుండి ఒకామెవచ్చి బాబాకునమస్కరించి ...