Posts

Showing posts from November, 2021

సాయిబాబా శివరూపుడా?

Image
శ్రీసాయినాథాయనమః! శ్రీసాయిబాబా అష్టోత్తరశతనామావళిలో మూడవనామం శ్రీరామకృష్ణశివమరుత్యాది రూపాయనమః. ఈనామభావమేమన శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, మారుతి మున్నగు దేవతా స్వరూపుడైన సాయిబాబాకు నా నమస్కారము. అనగా నిచట బాబాను శివరూపునిగా చెప్పడమైనది. "పూజ్యశ్రీ భరద్వాజ మాష్టారు రంచించిన శ్రీసాయిలీలామృతగ్రంథంలొ బాబాలో పరమశివునిఁజూపు లీలలు కొన్ని కలవు. వానినిపుడు క్లుప్తముగా స్మరించెదము. మహల్సాపతి కుమారుడు మార్తాండమాల్సాపతి ఓరోజు ఖండోబా దేవాలయంవద్ద కూర్చొన్నాడు. సాయి వానియెదుట ప్రత్యక్షమైనారు. మార్తాండ్ నిలబడగానే బాబా నవ్వుచూ ఖండోబా విగ్రహంవైపు నడచి అందులో లీనమయ్యారు. ఆశ్చర్యంతో మార్తాండ్ విగ్రహంవెనుక వైపు చూసాడు. అక్కడెవ్వరూలేరు. తిరిగి విగ్రహంనుండి సాయి వెలువడి చిరునవ్వుతో ఆతనిఁజూస్తూ బయటకువెళ్లిపోయారు. నాటినుండి యతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. ( మహారాష్ట్రలో ఖండోబాను శివుని రూపుగా పూజిస్తారు). మరియొక ఉదాహరణ జూచెదము. బాబా సన్నిహిత భక్తురాలు లక్ష్మీబాయి షిండే ఓరోజు దునిదగ్గర స్తంభానికానుకొని కూర్చొంది. ఆమెతో సాయి అక్కడకు రోజూవచ్చే పామునుజూచావా యన్నారు. ఆమె చూడలేదంది. కొద్దినిముషాలలో...

జ్ఞానదివ్వెలు.

Image
శ్రీసాయినాథాయనమః! పాఠక భక్తులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు! శ్రీసాయిజీవితచరిత్ర చదివిన భక్తులెల్లరకు ఓ సాయిలీల తప్పక గుర్తుంటుంది. అదేమన శిరిడీలో వర్తకులు సామూహికంగా నిర్ణయించుకొని బాబాకు నూనెనివ్వనివేళ సాయి నిరాశ చెందక ద్వారకామాయికి తిరిగివచ్చి ప్రమిదలను నీటితోనింపి దీపాలవెలిగించారు. రాత్రంతా దివ్వెలు ప్రకాశవంతంగా వెలుగుల నింపాయి. చాటున దాగియున్న వణిజులు తమతప్పుతెలిసికొని బాబాను క్షమార్పణ నర్ధించారు. వారితో సత్యాన్ని నమ్ముకొమ్మని చెప్పి క్షమించారసాయి. ఆధ్యాత్మిక పరంగాజూచినా సాయి అవతరించినదందులకే. అజ్ఞానపు చీకటిలో మగ్గుతున్న మానవాళికి తనబోధయనెడి జ్ఞానంతో సరైన మార్గం జూపారు.ఈ దీపావళి పర్వదిన సందర్భమున మన మనోదేహము లనెడి ప్రమిదెలలో సాయిపట్ల పరిపూర్ణవిశ్వాసమనెడి నూనెనింపి, భక్తిశ్రద్ధ వత్తులువేసెదముగాక. సాయి కరుణయే దివ్వెలవెలిగించు అగ్నిజ్వాల యగుగాక! ఆ దివ్వెల ప్రకాశంలో జీవనచర్యల చక్కదిద్దుకొంటూ సాయిచూపిన మార్గంలో గమ్యాన్నిచేరెదముగాక! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!