Posts

Showing posts from February, 2022

సాయిలీలా విశ్లేషణ - పదిరూపాయలు.

Image
శ్రీసాయినాథాయనమః! సాయిలీలలకు అంతులేదు. ఎవరిని ఏయే విధంగా తమమార్గంలోకి లాగెదరో ఊహకందని విషయము. ప్రస్తుతము శ్రీసాయిసచ్చరిత్రములోని బాబా చమత్కారలీలనొకటి స్మరించెదము. ఇది అప్పాసాహెబు కులకర్ణి, ఠాణా నివాసి యనుభవము, వివరములు 33 యధ్యాయమున చూడగలము. సాయిబాబాను ఎప్పటినుండో చూడదలచినను చూడలేకపోయాడు. బాలాసాహెబు భాటే నుండి బాబా ఫోటోపొంది నిత్యం మిగులభక్తితో పూజజేస్తున్నాడు. మనసులో బాబాను చూడాలనే ప్రబల ఆకాంక్ష. కులకర్ణి ఓ వారంరోజుల పనిపై భీవండి వెళ్ళవలసి వచ్చినది. మూడవరోజు మధ్యాహ్నం కులకర్ణి లేనిసమయాన వారింటికి సాయిని బోలిన ఫకీరు వచ్చాడు. ఫకీరు సాయిబాబాయా? యనెడి సందేహం కులకర్ణి భార్యాబిడ్డలకు కలుగుటచే, తాను కేవలం దేవుని సేవకుడనని, దైవజ్ఞచే వారి యోగక్షేమముల తెలిసికొనుటకై వచ్చానని ఆ ఆగంతకుడు చెప్పాడు. ఓ రూపాయి దక్షిణపొంది వారికో విభూతి పొట్లామిచ్చి ఫకీరు కనుమరుగయ్యాడు. ఇపుడో యనుకోని విషయం జరిగింది. భీవండిలో గుఱ్ఱము జబ్బుపడుటచే మూడవరోజు సాయంకాలానికే కులకర్ణి తన పర్యటన మధ్యలోనేమానుకొని యింటికి వచ్చాడు. భార్యాబిడ్డలనుండి ఆ రోజు ఫకీరు రాక వివరములు గ్రహించి తాను ఫకీరును చూడకుండుటకు మిగుల బాధ...