Posts

Showing posts from January, 2024

సిందేసి నర్తింతు!

Image
శ్రీసాయినాథాయనమః శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికలతో మిగుల ఉత్సాహంతో నాట్యం జేసేవాడట. అలాగే శిరిడీ వచ్చిన మొదటి రోజుల్లో మజీదు సమీపానున్న ఫకీర్లు కూర్చునే తాకియాలో శ్రీసాయిబాబా కాళ్లకు గజ్జెలుకట్టుకొని పారవశ్యంతో బహు సుందరంగా నాట్యం జేసేవారట. షుమారు పది పన్నెండేళ్ల పూర్వం శిరిడీ దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణానికి ముందుగ మరోసారి ద్వారకామాయిని దర్శించి కొద్దిసేపటికచట కూర్చున్న సమయంలో బాబా ప్రేరణచే నామదిలో మెదిలిన ఓ చిన్న భావగీతికనిచట పొందుపరుస్తున్నాను. సాయి బృందావనిలొ ద్వారకామాయిలొ సిందేసి నర్తింతు సాయి సాయీ యనుచు ఇహమిదే పరమిదే సాయి సాయీ యనుచు మహిమలా వేలుపే సాయి సాయీ యనుచు సిందేసి నర్తింతు సాయి సాయీ యనుచు. బాలగోపాలుడే సాయి సాయీ యనుచు లీల విలుకాడే సాయి దేవర యనుచు సిందేసి నర్తింతు సాయి సాయీ యనుచు. మోహనా రూపుడే సాయి సాయీ యనుచు సమ్మోహనా శ్యాముడే బాబ సాయీ యనుచు సిందేసి నర్తింతు సాయి సాయీ యనుచు. శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!