సాయి దేవాలయం!
శ్రీసాయినాథాయనమః!పాఠక సాయిభక్తులెల్లరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు! సాయి సర్వదేవతా స్వరూపుడని భక్తులయనుభవము. భద్రాచల రాముడు, కాశీపుర హరుడు, కలకత్తా కాళీమాత, బృందావన మురళీధరుడు, అందరి రూపుడు సాయిదేవుడె! రామాలయం ప్రేమాలయం ; దేవాలయం.... సకలదేవాలయం సాయిదేవాలయం ! శ్రవణాలయం శరణాలయం ; శమనాలయం.... ఉపశమనాలయం సాయి దేవాలయం ! మాతాలయం మంత్రాలయం ; మహిమాలయం.... మహిమహిమాలయం మహిమ... హిమాలయం సాయి దేవాలయం ! ప్రణయాలయం ప్రణవాలయం ; ప్రాణాలయం .... భక్త ప్రాణాలయం సాయి దేవాలయం! బాలాలయం బోళాలయం ; బాబాలయం .... శిరిడీ బాబాలయం సాయి దేవాలయం! జ్ఞానాలయం జ్ఞేయాలయం; జ్వాలాలయం .... నిత్యజ్వాలాలయం సాయి దేవాలయం ! ప్రణమామ్యహం ప్రణమామ్యహం; ప్రణమామ్యహం.... దేవ ప్రణమామ్యహం సాయి ప్రణమామ్యహం! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! 🌸 Melodious Devotional Translation. Śrī Sāyināthāya Namah Blessed greetings of Śrī Rāma Navamī to all dear Sai devotees! To devotees, Sai is the very embodiment of all deities— The Rama of Bhadrachalam, The Hara of Kashi, Th...