Posts

Showing posts from October, 2025

శ్రీసాయిసందేశామృతము 2(Nectar of Sri Sai's message 2).

Image
శ్రీసాయినాథాయనమః. నేడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ 87వ జయంతి పర్వదినము. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 2. సాయిలీలలు వినోదంతోపాటు విజ్ఞానాన్ని సంతోషాన్ని కల్గిస్తాయి. ఆపారవశ్యంతోనే రచయిత అన్నాసాహెబ్ దబోల్కర్ సాయిమహిమలను గ్రంధస్తం జేశాడు. ఆత్మస్థాయి నిండి వెలువడే సాయి దైవలీలలు సాధారణ మానవుల మానసిక తర్కానికందనంత దూరంగా ఉంటాయి. మరి అలాంటి సాధారణ మనసుతో అసాధారణ గ్రందాన్నెలా రచించాడు? అదే గురుమహిమ,సద్గురుసాయి కృప. ప్రేరణ సాయిది, రచయితా సాయియే! అన్నాసాహెబ్ కేవలం ఉపకరణమాత్రమే. సాగర అలలుగా సాయిలీలలు నిత్యనూతనములు, సత్యబోధకములు. శోధించేకొలది సాధకునికి నూతనభావాలు ఆవిష్కృతమౌతాయి. సాయిపలుకులు ఆత్మలోతులనుండి వెలువడే వెలుగుకిరణాలు.రచయిత తన అహంకారాన్ని గురుచరణాల సర్వసమర్పణజేసి గ్రంథరచనకు కావలసిన శక్తిని,బుద్ధిబలాన్ని సంతరించుకొన్నాడు. రచనజేయు తన తలుపును అత్యంత భక్తుడు శ్యామా ద్వారా విన్నవించుకొని బాబా నుండి యూది, అశీసులు పొందాడు. వాని అహం సూన్యమైనపిమ...

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)

Image
శ్రీసాయినాథాయనమః.సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. పాఠక భక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు,సదా బాబా ఆశీసులు! సమర్ధసద్గురు శ్రీసాయినాథులకు శతకోటి హృదయపూర్వక నమస్కారములతో ఈ వ్యాసమును ప్రారంభిస్తున్నాను. బాబా దయవలన గత కొన్ని సంవత్సరములుగా శ్రీసాయి సచ్చరిత్ర నిత్యపారాయణము విధిగా జరుగుచున్నది. చదివిన ప్రతిసారి కొత్త కొత్త అర్ధాలు,సందేశాలు స్ఫురణకు రావడం గమనించాను. చదివిన మొదట్లో బాబా లీలలు భక్తుల బాధానివారణ కన్నట్లు తలచేవాడను. పారాయణము కొనసాగేకొలది లీలల వెనుక బాబా మనకేదో సందేశమిస్తుంన్నారనే భావన కలుగ సాగింది. లోతుగా చదివిన పిమ్మట నిగూఢసందేశాల జాడ కొద్ది కొద్దిగా అవగాహన కొచ్చెడిది. అధ్యాయ క్రమంలో ఆయా లీలాసందేశాల సమాహారమే ప్రస్తుత సాయిసందేశామృతము. పాఠక భక్తులకు పారాయణానంతరము సాయిలీలల వెనుక వేరువేరు అర్ధములు,భావములు గోచరించుట సహజము. ప్రస్తుతం నా జ్ఞానపరిధికందిన భావాలను తోటి సాయి భక్తులతో పంచుకుంటున్నాను. ఇది పూర్తిగా వ్యక్తిగత భావన. భక్తులెల్లరు తమతమ సూచనలను,స్పందనను క్రిందనున్న...