Posts

Showing posts from May, 2020

అనుభవ మందారాలు (Experiences of devotees with Shirdi Saibaba)!

Image
శ్రీసాయినాథాయనమః  సద్గురువు కోరికలదీర్చే కల్పవృక్షము, భక్తివిశ్వాసాలు, శ్రద్ధాసహనాలు కల్పవృక్షాన్ని  పెనవేసుకొన్న పూలతీవెలైతే, వికసించే కుసుమాలే లీలల మల్లెలు,  వెన్నెల జల్లులు  అనుభవమందారాలు.  ఇంకా సరళభాషలొ చెప్పాలంటే కల్పవృక్షంలాంటి సద్గురుని భక్తిశ్రద్ధలతో సేవిస్తే భక్తులకు అనుభవాలు సహజంగానే కలుగుతాయి.  సాయి తమయునికిని, కొనసాగే తమ అవతారకార్యమును భక్తులకు తెలియబరచుటకు అసంఖ్య లీలాప్రదర్శనలు జేస్తున్నారు.  ప్రస్తుతం క్రిందవ్రాయబడిన భక్తుల అనుభవాలు వేరొక బ్లాగ్ SaileelaTelugu.Blogspot.Com  నందు   విస్తారముగా చర్చింపబడ్డాయి. ఆ అనుభవాలను సంషిప్తంగా నిచట కూర్చడమైనది.  ఈలీలల చదువుటవలన  సద్గురు  సాయి పై భక్తిశ్రద్ధలు  యినుమడించి   మరింత  దృఢపడతాయనేది రచయిత  ప్రగాఢవిశ్వాసము.   శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహిమ.  అమెరికాలో ఓభక్తురాలి అనుభవము. "శ్రీసాయిలీలలను అలవోకగా విన్నను ఆధ్యాత్మజీవితమందు శ్రద్ధ కలుగును. పాపములు నశించును. సాయిలీలలను ఇతరులకు చెప్పినచో నందు కొత్తవిషయములు గ్రహించగలరు. స్నానము...