అనుభవ మందారాలు (Experiences of devotees with Shirdi Saibaba)!

శ్రీసాయినాథాయనమః 



సద్గురువు కోరికలదీర్చే కల్పవృక్షము, భక్తివిశ్వాసాలు, శ్రద్ధాసహనాలు కల్పవృక్షాన్ని  పెనవేసుకొన్న పూలతీవెలైతే, వికసించే కుసుమాలే లీలల మల్లెలు, వెన్నెల జల్లులు అనుభవమందారాలు. 
ఇంకా సరళభాషలొ చెప్పాలంటే కల్పవృక్షంలాంటి సద్గురుని భక్తిశ్రద్ధలతో సేవిస్తే భక్తులకు అనుభవాలు సహజంగానే కలుగుతాయి. 
సాయి తమయునికిని, కొనసాగే తమ అవతారకార్యమును భక్తులకు తెలియబరచుటకు అసంఖ్య లీలాప్రదర్శనలు జేస్తున్నారు. ప్రస్తుతం క్రిందవ్రాయబడిన భక్తుల అనుభవాలు వేరొక బ్లాగ్ SaileelaTelugu.Blogspot.Com నందు  విస్తారముగా చర్చింపబడ్డాయి. ఆ అనుభవాలను సంషిప్తంగా నిచట కూర్చడమైనది. ఈలీలల చదువుటవలన సద్గురు సాయి పై భక్తిశ్రద్ధలు  యినుమడించి   మరింత  దృఢపడతాయనేది రచయిత  ప్రగాఢవిశ్వాసము.  
శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహిమ. అమెరికాలో ఓభక్తురాలి అనుభవము.
"శ్రీసాయిలీలలను అలవోకగా విన్నను ఆధ్యాత్మజీవితమందు శ్రద్ధ కలుగును. పాపములు నశించును. సాయిలీలలను ఇతరులకు చెప్పినచో నందు కొత్తవిషయములు గ్రహించగలరు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తిప్రేమలతోను,పూర్తి నమ్మకముతోను పారాయణముచేసి వారమురోజులలో ముగింతురో, వారియాపదలన్నియు నశించగలవు. ధనమును కోరిన పొందవచ్చును,వర్తకుల వ్యాపారము వృద్ధినొందును. శ్రీసాయి ప్రీతిచెంది యజ్ఞానమును పేదరికమును నిర్ములించి జ్ఞానము ఐశ్వర్యముల నొసంగును. రోగులు ఆరోగ్యవంతులగుదురు. వారిమనసులందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. భక్తుడు సాయిని శరణాగతి వేడినచో నతడు 'తాను' అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును."   శ్రీసాయిసచ్చరిత్రము
హ్యూస్టన్ (టెక్సాస్ రాష్ట్రము)  లోని నాకు తెలిసిన  ఓ భక్తురాలి ( గోప్యం కోసం  పేరు చెప్పుటలేదు) శ్రీసాయిసచ్చరిత్రము పారాయణ అనుభవము. ఆమెకు సాయిబాబానుగూర్చి పెద్దగా తెలియదు. ఓ సందర్భంలో కలిసినప్పుడు బాబాను గూర్చివిని, తన సమస్యల నివారణకై శ్రీసాయిసచ్చరిత్ర చదవాలనుకొంది. ఆమెవద్ద  సచ్చరిత్ర పుస్తకము లేకుండుటచె నానుండి ఇంగ్లీషు కాపి  తీసికెళ్ళింది. సాధారణంగా పారాయణ గురువారం మొదలుపెట్టి 7 రోజులలో పూర్తి  చేయాలని చెప్పాను. ఆమె శనివారం పుస్తకం తీసికెళ్ళి , గురువారం వరకు వేచియుండలేక ఆరోజే పారాయణ మొదలుపెట్టింది. పారాయణలో అభిరుచి, ఉత్సాహం పెరగటంతో మూడురోజులలోనే  పారాయణ పూర్తిచేసినది.  ఆఖరిరోజున చివరి పేజీలు  చదువుచున్నపుడు ఇంట్లోని ఫోను మ్రోగనారంభించింది. కాని పుస్తకం పూర్తికానిదె ఫోన్ వద్దకు వెళ్ళగూడదని చదవడం కొనసాగించింది. ఫోన్ రింగింగ్  కూడా అలానే కొనసాగింది.

చివరకు చదవడం పూర్తయ్యాక ఫోన్ కాల్ తీసుకొంది. విషయం తెలిసాక ఆశ్చర్యానికి హద్దులేదు. ఎప్పటినుండో జాబ్ లేకుండ నిరాశతో  యున్న ఆమెకు జాబ్ ఆఫర్ ఆ ఫోన్ కాల్ లోని విషయం. పారాయణ ఫలితమే నని ఆమె నమ్ముతోంది. 

ఆపై బాబా భక్తురాలిగ మారి వారింట్లో బాబా పూజాసత్సంగాలు చేయడం ప్రారంభించింది. ఈ సంఘటన షుమారు 16 యేండ్ల పూర్వం జరిగింది. పారాయణ మహిమకు దేశ కాలాలతో పనిలేదు. భక్తిశ్రద్ధలతో, పట్టుదలతొ , బాబాపై నమ్మకంతో చేసేవారికి తప్పక బాబా అనుగ్రహం లభిస్తుందనడానికి పై అనుభవం ఓ నిదర్శనం.  
మరిన్ని వివరములకు; పారాయణమహిమ SaiLeelaTelugu.Blogspot.Com dated 10-17-2018 చూడండి. 

రెండవలీల 

శ్రీసాయినాథాయనమః 


కోరినదిచ్చే దైవం! (అమెరికాలో నివసించే ఓ భక్తుని అనుభవాలు.) 

" నాముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రీపగలూ మీ చెంత నేనుండెదను. నాదేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరుచేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీహృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజన హృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు  ధన్యులు; పావనులు; అదృష్టవంతులు." శ్రీసాయిసచ్చరిత్రము, అధ్యాయము 15.     

బాబా మహాసమాధియై కేలండర్ ప్రకారం ఈరోజుకు 100 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, వారి నిత్యసత్య లీలలు విశ్వంలో వ్యాపిస్తూనే యున్నాయి. సాయిమహరాజుకు శతకోటి వందనాలు! 

సూరీ కాకాజీ , హ్యూస్టన్ లో నాకు ఇరువది సంవత్సరములుగా తెలిసిన సాయి భక్తులు. ఆయన తమ అనుభవాలనిలా పంచుకొన్నారు. 
నేను గుజరాతునుండి 1977 లో హ్యూస్టన్ వచ్చాను. ఇచట iskcon టెంపుల్ కు వెళుతుండేవాడను. అచట పరిచయమైన ఓ స్నేహితుడు తమ ఇంట్లో పూజ, సత్సంగము చేస్తున్నామని నన్ను రమ్మని ఆహ్వానించారు. అది 1978 సంవత్సరంగా గురుతు. పూజలో  అనేకదేవుళ్ళతోపాటు సాయిబాబా ఫోటోలు  కూడా  పెట్టారు. ఆరోజుల్లో బాబాగురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు. నాకుకూడా ఓ బాబా ఫోటో కావాలని మిత్రునితో అన్నాను. తనవద్ద వేరే ఫోటోలు లేవు, కాని  మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పక దొరుకుతుందని చెప్పాడు. ఆ తర్వాత బాబాఫొటో కొనాలని ఇచట హ్యూస్టన్ లోని అన్ని ఇండియన్ దుకాణాలకు తిరిగాను. ఎక్కడా ఒక్కఫోటోకూడా దొరకలేదు. కొద్దిపాటి నిరాశతో ఇంటికెళ్ళాను. 

ఇదిజరిగిన కొన్నిరోజులకు ఉదయం  ఓ  వ్యక్తి  మా ఇంటికొచ్చాడు.తనకు కొద్దిగా డబ్బు అవసరమని, తాను తనదగ్గరనున్న లాకెట్/పెండెంట్  బదులుగా ఇస్తానని  నాచేతిలో పెట్టాడు . పెండెంట్ పరిశీలించిచూస్తే మధ్యలో షిర్డిసాయిబాబా ఫోటో ఉంది. కొద్దిసేపు నేను నమ్మలేకపోయాను. 

డబ్బులెంతని అడిగితే ఓ ఇరవై డాలర్లు ఇవ్వండని గుజరాతీలోనే చెప్పాడు.అలానే చెప్పినంత ఇచ్చాక ఆ మనిషి వెళ్ళిపోయాడు. తరువాత ఆలోచిస్తే ఆ వ్యక్తిని అంతకుమున్నెప్పుడూ చూసిన దాఖలాలు  లేవు. ఇదిజరిగాక గడచిన నలుబది సంవత్సరములలో కూడ ఆతని ఆచూకి లేదు. ఇప్పటికి ఆశ్చర్య మనిపిస్తుంది.
మరో సందర్భం, దుర్గా పూజల సమయం. అమ్మవారిపూజ మా ఇంట్లో చేసుకొంటున్నాము. చాలామంది స్నేహితులను పిలిచాము. పూజావేదిక చక్కగా అలంకరించాము. మనసులో బాబాను కూడా ఆహ్వానించాలని తోచింది. ఓ చిన్న స్లిప్ మీద బాబా, పూజకు  మా ఇంటికి తప్పక రావలసినదని వేడికోలుగా వ్రాసి పూజా మందిరంలో ఆ కాగితముంచాను. పూజ బాగుగా జరిగినది. అందరు సంతోషపడ్డారు. భోజనాలయిన  పిమ్మట క్రమంగా అతిధులందరు ముందు ద్వారంగుండా  వెళ్లిపోయారు. 

నేను వెనుదిరిగి లోపలి కెళ్తుండగా, వెనుకవైపు గదినుండి బాబా మెరుపులా పూజాగదిలోకి వచ్చారు. పూజా స్థలం వద్ద చాలాకొద్దిసమయం నిలబడ్డారు. బాబా, బాబా వచ్చారు  అంటూ పెద్దగా అరుస్తూ ఇంట్లో వారికి చెప్పడానికి లోని కెళ్ళాను. అందరం పూజాగదిలోకి పరుగెత్తేసరికి అక్కడెవరూ లేరు. 

బాబాకోసం అన్నిగదులు వెదికాము. కాని ఏమాత్రం ఆచూకీ లభించలా ! మాకందరికి అంతుపట్టని విషయమేమంటే ఇంట్లోని వెనుకవైపు గదులన్నీమూసియున్నాయి,మా ఇంట్లోని మిగతావారుగూడ బాబారావడం  చూడలేదు, మరి బాబా యింట్లోకి యెట్లా ప్రవేశించారు,అంతత్వరగా ఎలా మాయమయ్యారు?  నా ప్రార్ధన మన్నించి నాకు రెప్పపాటు దర్శనమిచ్చి  మా పూజాగృహమును  పావనము జేశారు, ఇదియంతయు సాయికరుణ గాదా ! అదే బాబా మహిమగా తోస్తుంది.     

మరిన్ని వివరములకు; ఖండాంతరాలీల-2  SaiLeelaTelugu.Blogspot.Com dated 10-15-2018 చూడండి. 

మూడవలీల 

శ్రీసాయినాథాయనమః 

నా వాడిని ఎంతదూరమున యున్నప్పటికి  పిచ్చుకకు తాడుకట్టి లాగినటుల నా చెంతకు నీడ్చెదను.  (సాయిబాబాతో రచయిత తొలియనుభవము )

" అనుభవం ప్రసాదించడము ద్వారా సదా బాబా మన వెంట వున్నాను అనే గుర్తింపును ప్రసాదిస్తున్నారు. అట్టి అనుభవం పొంది కూడా సద్గురుని నిజస్థితిని గురించి తర్కించడము, తీపి రుచిని జూస్తూ , తీపి ఎలావుంటుందని అడగటములాగా  వుంటుంది. అలాగాక ఆ అనుభవాన్నే అంటిపెట్టుకొని ఆయనను శరణు పొందగలిగితే, బాబాయే సర్వసృష్టికి ఆధారభూతుడు అనే సత్యం అవగత మవుతుంది. "

ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ

సాయిబాబా గురించి 1993 వ సంవత్సరానికి ముందు నాకు పెద్దగా తెలియదు. అదే సంవత్సరంలో హైదరాబాద్ వెంగళరావు నగర్లో సాయిమాస్టర్ అపార్ట్మెంట్స్ నిర్మాణం జరిగింది. అందులో మేమొక యూనిట్ తీసికొనుటచే  బిల్డర్లులో ఒకరైన శ్రీవేంకటస్వామి గారితో పరిచయ మేర్పడినది. వారు మిత్రులు,సౌమ్యులు,మంచి సాయిభక్తులు. వారు బాబా సత్సంగాలకు వెళుతూ రెండు మూడు సార్లు నన్నుకూడ తీసికెళ్లారు. సాయిమాస్టర్ అపార్ట్మెంట్స్ పూర్తియైన పిమ్మట అక్టోబర్ 31 న గృహప్రవేశాలు జరిగాయి. వెంకటస్వామిగారు కూడా ఓ యూనిట్ తీసుకొన్నారు. ఆ సందర్భాంగా శ్రీ శిరిడీసాయి  సచ్చరిత్ర జ్ఞానయజ్ఞ కార్యక్రమము, సెల్లార్లో 7 రోజులు పాటు జరిగినది. 8 వరోజు పూర్ణాహుతి కార్యక్రమము. శ్రీ కృష్ణావర్జుల రాజేంద్రప్రసాద్ గారు, తమ 14 వ జ్ఞానయజ్ఞంగా మా పూజాకార్యక్రమాన్ని చాల చక్కగ జరిపారు. ప్రతిరోజూ సాయంకాలం 5 గంటలనుండి బాబా పాటలు, పూజ, చరిత్రపారాయణ విశ్లేషణ, ఆరతి  జరిగేవి. నవంబర్ 7 న పూర్ణాహుతి కార్యక్రమం బహువేడుకగా జరిగినది. విశేష పూజ, బాబా నాలుగు ఆరతులు, అన్నదానాలు జరపడమైనది.

అదేరోజు, రోజూ జరగని ఓ ప్రత్యేకత జరిగినది. ఉదయం షుమారు 11 గంటల ప్రాంతంలో ఓ వింత ఫకీరు సెల్లారులోని బాబాపూజా స్థలానికి ఎదురుగా వచ్చి కూర్చొన్నారు. కూర్చునేముందు ఆ వ్యక్తి  3వ అంతస్తులోని వెంకటస్వామిగారి యూనిట్ లోనికి ఎవరి ప్రమేయం లేకుండా ప్రవేశించి  అచట ఉంచిన పూజాబట్టల నుండి ఓ టవల్ తీసి, తమ మొలచుట్టూ కట్టుకొని కిందికొచ్చారు. బాబాకెదురుగా కూర్చున్నవారికి  బాబాప్రసాదంగా కొన్నిఫలాల వారిదోసిలిలో ఉంచాను. ఆయన వాలకం చాల వింతగా ఉంది. మాట్లాడుతుంటే కనులవైపు జూడక ఎటో గాల్లోకి పరాకుగా  పిచ్చిచూపులు చూస్తున్నారు. ఎలాంటి స్పందన లేదు.  షుమారు పది నిముషాల తరువాత ఆ ఫకీరు యెటో  వెళ్లిపోయారు. అంతకు ముందుగాని, ఆ తరువాతగాని ఆయన్ని ఎవరూ చూచుట జరుగలేదు. నిలకడగా ఆపై కొన్నిరోజులకు కొద్దిమంది భక్తులకో అనుమానమొచ్చింది. ఆ వచ్చిన ఫకీరు సాయికాదుగదా యని!  ఏమోమరి ఇప్పటివరకు ఆ వివరం తెలియరాని గుహ్యం. కాని పూజాకార్యక్రమం అందరికి తృప్తినిచ్చినది. ఆ పై ఎందరి మనసులలోనో బాబా ప్రవేశించారు. వారికి బాబాపై భక్తిశ్రద్ధలు పెరిగాయి. నాకు కూడ  అందరిలాంటి అనుభూతి, తృప్తి కలిగాయి. కొన్నిరోజుల వరకు  ప్రత్యేకంగా మరి ఎలాంటి అనుభవం కలుగలా. కాని సుమారు 40 రోజుల తరువాత నా మనసులో  తెలియరాని జాగరణలాంటి ఓ   సంచలనం. బాబా పై ఎన్నో భావాలు, మనసునిండా బాబా ఆలోచనలు. క్రమంగా ఆ భావాలకు స్తోత్ర, గేయ రూపాలు. ఏ దైవ ప్రార్ధన విన్నా అదే వరుసలో బాబా పై స్తోత్రాలు. ఈ జాగరణ సుమారు  ఓ సంవత్సరం 1994 చివరి వరకు, చాల ఉధృతంగా ఉండేది. కనీసం ఓ వందకుపైనే బాబాపై పాటలు, గేయాలు వగైరా రాయడం జరిగింది. ఈక్రమంలోనే జనవరి 5, 1994 న శ్రీసాయి అష్టకము, లింగాష్టక బాణీలో వ్రాయడం జరిగింది. మనసులోని ఆ సంచలన వేగం తగ్గినప్పటికి, ఇప్పటికి కొనసాగుతుంది. జూన్ 19, 1994 న  అమ్మ నాన్నలతో సకుటుంబముగా శిరిడీ  వెళ్లి శ్రీ సాయిబాబాను దర్శించుకొన్నాను. నా జీవన యాత్రలో బాబా అలా ప్రవేశించి కొనసాగుతున్నారు! ఆ అనుభవాలన్నింటిని ఇచట అందరితో పంచుకోవడంలో ఎంతో ఆనందం, మరెంతో తృప్తి మిగులుతున్నాయి.

మరిన్ని వివరములకు, తొలియనుభవము SaiLeelaTelugu.Blogspot.Com dated 10-17-2018 చూడండి. 

నాల్గవలీల 
ఓం శ్రీసాయినాథాయనమః 

పాలకొల్లు దేవాలయములోని బాబా మూర్తి 

సందేహము, సమాధానము. (రచయిత వేరొక యనుభవము)

భక్తులు  ఎన్నో అనుభవాల చవిజూస్తూ కూడాబాబా పై పూర్తివిశ్వాసముంచుటకు ఎంతో సంకోచిస్తుంటారు. ఇది ఇప్పటి విషయం కాదు. బాబా దేహరూపంలో ఉన్నపుడు వారిని ఎంతో భక్తిశ్రద్ధలు పూజించిన  భక్తులుకూడ ఇలాంటి సంశయాలకు దూరులు కాలేక పోయారు. 

ఇలాంటి అనుభవమే  నాకు 1996, సెప్టెంబరు 23 న  పశ్చిమగోదావరి జిల్లాపాలకొల్లు బాబా దేవాలయానికి దగ్గరగా జరిగినది.అప్పుడు నేను ONGC లో పనిజేస్తున్నాను. నేను పనిజేస్తున్న బ్రాన్హాం రిగ్గు పాలకొల్లు కు సమీపంలో ఉండుటచే అపుడపుడు పాలకొల్లు బాబాగుడికి తోటి సహచరులతొ వెళుతుండేవాడిని. అప్పటికి కొన్నినెలల మునుపే బాబా విగ్రహ ప్రతిష్ట జరిగినదని తెలిసినది. ఈ క్రమంలో దేవాలయ అధ్యక్షులు శ్రీ అల్లం సత్యనారాయణగారితో పరిచయమేర్పడినది. ఆయన యువకులు , బాబాపై పరిపూర్ణ  భక్తి, విశ్వాసములున్న వ్యక్తి.  నిర్వాహకులందరు యువకులే. మాటల్లో ఆ దేవాలయమేర్పడటానికి ముందు జరిగిన ఎన్నో ఆసక్తి కర  విషయాలు చెప్పారు. 
అలాగే ఓరోజు సాయంత్రం  నేనొక్కడనే బాబాగుడివైపు కాలువప్రక్కన రోడ్డుపై  నడచుకొంటూ వెళు తున్నాను. కొద్దిదూరం  వెళ్ళాక ఏవో వింత ఆలోచనలుఎన్నో సందేహాలుఅనుమానాలునిజంగా బాబా ఉన్నారానేను సమయం వృధాచేసికొంటున్నానాఇలా ఎన్నో ప్రశ్నలు.  ఈ ఆలోచనలతో నడకగూడ కొద్దిగ మందగించింది. ఆలా రెండు నిముషాలు నడచానో లేదోఎదురుగా సత్యనారాయణగారు ఒక్కరే నడచుకొంటూ వస్తున్నారు. చాల రోజుల పిమ్మట కలియుటచే ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఎందరెందరో భక్తులు వారికి కలిగిన అనుభవాల మూలాన విరాళాలిస్తున్నారనిసంతానం లేనివారికి బిడ్డలు కలుగుతున్నారని, ఎందరో ఆరోగ్యులవుచున్నారని  మరెన్నో విషయాలు ఎంతో ఉత్సాహంతో షుమారు 15 నిముషాలు పైన మాట్లాడారు.
నాలో క్రమంగా సందేహం పలచబడిమరలా విశ్వాసం దృఢపడినది.  దూరమునుండి, ఎందరో బాబాగుడికి ప్రదక్షిణం చేయడం చూసాను. ఇలా నాలో అపుడపుడు అనుమానం తొంగిచూసినపుడుబాబా ఎదో రూపేణ సమాధానమిస్తున్నారు. మన అనుభవాల నమ్ముకొంటే బాబాకు తక్కువ సమయంలో మరింత సన్నిహితులం కాగలమని దృఢంగా నమ్ముతున్నాను. 

అడిగిన తక్షణమే నీకు నా సహాయ సలహాలు ప్రాప్తిస్తాయి! ( సాయి వచనము). 
మరిన్ని వివరములకు, సందేహము, సమాధానము SaiLeelaTelugu.Blogspot.Com dated 09-20-2018 చూడండి. 


ఐదవలీల 
ఓంశ్రీసాయినాథాయనమః 
హైదరాబాద్ పంజాగుట్ట సాయిదేవాలయంలోని బాబా మూర్తి. 

మనసెరిగిన సాయి (పంజాగుట్టదేవాలయంలో సాయి జూపిన లీల) 

సాయిబాబా సర్వాంతర్యామి,సర్వహృదయవాసి. మన ఆశలు, ఆశయాలు,కోరికలు,భయాలు,బాధలు,ప్రాణాంతకాలు అన్నీ ఆయనకెరుకే ! దగ్గర దూరాలతో పనిలేదు. ఉన్నవారు,లేనివారనే తారతమ్యం లేదు. ఆయనకు వాడాలోని హేమాద్రిపంతు వాదన తెలుసు,పండరీపురంలో తనను గూర్చి లాయర్ జేసిన నిందారోపణ తెలుసు,చోల్కర్ షిరిడీ ప్రయాణానికి  డబ్బులు మిగుల్చుటకై చక్కెరలేని తేనీరు త్రాగిన విషయం తెలుసు,వణిలోని పూజారి కాకాజీవైద్య షిరిడి వెళ్లదలచు తపన తెలుసు,ఇంతేకాదు నోరులేని కుక్క ఆకలి తెలుసు,గోడపైనున్న బల్లి కిచ కిచ కూత తెలుసు. అలాగే భక్తుల అంతరంగాలన్ని ఆయనకు తెరచిన పుస్తకాలే. ఇది గత చరిత్ర కాదు, నడుస్తున్న వాస్తవం. సాయి మనవిన్నపాలకు స్పందిస్తారు, సరైనవాటిని సమకూరుస్తారు. ఏదిమంచిదైతే అదే చేస్తారనే విశ్వాసం కలిగియుండటం భక్తులకెంతో శ్రేయస్కరం.
పైవిషయానికి దగ్గర సంబంధం కలిగిన ఓ చిన్న అనుభవాన్ని ప్రస్తావిస్తాను. ఆరోజు సెప్టెంబర్ మాసం ఒకటో తారీఖు గురువారం, 1994. అపుడు హైదరాబాద్ శ్రీనగర్ కాలనిలో ఉండేవాళ్ళం. ఇంటికి దగ్గరున్న పంజాగుట్ట లోని ప్రసిద్ధ షిరిడీసాయి గుడికి వీలైన ప్రతి గురువారం వెళ్ళేవాడిని. యధావిధిగా ఆరోజుకూడ గుడికి వెళ్ళాను. సాయంకాలం ఆరతి సమయమగుటచే ఎంతో రద్దీగా ఉంది. భక్తులు హాలు బయటి ప్రాంగణంలో కూడా దర్శనానికి నిలబడి ఎదురు జూస్తున్నారు. కొద్దిసేపటికి క్యూ కదిలి హాలులోకి ప్రవేశించాను. రద్దీవలన వాలంటీర్లు దర్శనానికి తగిన సమయమీయక తొందరపెట్టి భక్తుల నెట్టేస్తున్నారు. కాసేపటికి  బాబా మూర్తికి దగ్గరకు వచ్చాను. ఇంకా నాముందు నలుగురైదుగురు వేచి ఉన్నారు.

ఇంతలో నాలో ఓచిన్న వింత ఆలోచన వచ్చింది. బాబా పాదనమస్కారం తర్వాత ఆయన ముఖాన్నొకసారి స్పృశించాలని. అంత రద్దీలో నా ఆలోచనకు అర్ధం లేదేమో యనిపించింది. కోరిక ఆలోచనగానే మిగిలిపోతుందేమో ననుకొన్నాను. క్యూలో నావంతు వచ్చినపుడు బాబావిగ్రహానికి పాదాభివందనం జేసి ముందుకు సాగబోతున్నాను. ఇంతలో ఓచిన్న విశేషం, విషయం చిన్నదైనా అది నాకు విశేషంగా తోచింది. అచటనిలబడ్డ వాలంటీర్ నాకు ఓపెద్ద తెల్లపూలమాలిచ్చి, బాబామెడలో వేయమన్నాడు. మరెందుకాలస్యం? వెంటనే పూలమాలవేసి, బాబాముఖాన్ని ప్రేమతొ స్పృశించి , వాలంటీరుకు కనులతోనె కృతజ్ఞతలు తెలిపిముందుకు కదిలాను. అది  మల్లెమాలో మరే పూలమాలో గుర్తులేదు.  ఆ ఘటన యాదృచ్చిక మనిపించలేదు. మెరుపు వేగంతో బాబానుండి వచ్చిన ఆసిసుగా తలుస్తాను. వేరొకగురువారం ఇంట్లో చిన్నదత్తస్వామి ఫోటో పెట్టుకోవాలనే ఆలోచన కల్గింది, ఆరోజు సాయంకాల ఆరతికై పంజాగుట్టకెళ్ళగా, బాబాగుడికెదురు షాపులో దత్తాత్రేయుని చిన్నఫొటో, కేవలం ఒక్కటుంది. వెంటనేకొని యింటికితెచ్చాను. 

మరిన్ని వివరములకు, మనసెరిగిన సాయి   SaiLeelaTelugu.Blogspot.Com dated 09-27-2018 చూడండి. 



ఆరవలీల   

శ్రీసాయినాథాయనమః      
హూస్టన్  మందిరంలోని సాయిబాబా విగ్రహము 

అమెరికా టెక్సాస్ రాష్ట్రం  హూస్టన్ నగరంలోనివసించే రచయిత మరియు ఓ మిత్రునికి కలిగిన యనుభవము.  

Here is a global miracle where Saibaba connected Houston TX (USA), Bangalore India, and Shirdi.


శ్రీసాయిబాబా విశ్వవ్యాపకులు. వారిది అఖండస్వరూపము, వారిలీలలు ఖండాంతరములు. భక్తరక్షణ కొరకు సప్తసముద్రముల దాటెదనని సాయే సెలవిచ్చారు. ఇదేవిషయం శ్రీసాయిసత్చరిత్రలొ పెక్కుచోట్ల నొక్కి వక్కాణింపబడినది. అలాగే సాయి సర్వాంతర్యామి, సర్వ హృదయవాసి. అందరి మనసులలోని ఆలోచనలు కోరికలు ఆయనకు తెలుసు. వివిధభక్తులను భిన్నరీతుల చైతన్యపరిచి సాయి తమ కార్యముల నిర్వహించెదరు. అందులకు పెక్కు నిదర్శనలు  గలవు. శ్రీమన్ గోపాలరావు బూటీని ప్రేరేపించి సమాధిమందిర  నిర్మాణం గావించారు, దాసగణునితో తమ మహిమ వ్యాపింపజేశారు, నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా  తమ ఖ్యాతి లోకానికి తెలియబరచారు. రాధాకృష్ణ మాయి నిమిత్తముగ శ్రీసాయి సంస్థానమునకు పునాది వేశారు. ప్రస్తుతవిషయానికొస్తే సాయి తమ చాతుర్యంతో ఖండాంతర లీల నెలా చూపారో అందరిని  ఆశ్చర్య పరుస్తుంది. 
ఈ విషయం 2002 వ సంవత్సరంలో జరిగినది. హ్యూస్టన్ నగరంలోని హిల్ క్రాఫ్ట్ రోడ్డు పై సాయిబాబా దేవాలయముంది, ఇప్పటికి కొనసాగుతుంది. అపుడు దేవాలయ వెబ్ సైట్ నిర్మిస్తున్నారు. ఆ సైట్ లో షిరిడీలోని బాబా సమాధి మందిరంతోపాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల ఫోటోలు ఉంచాలని సంకల్పం. అదేసమయంలో ఓ  స్నేహితుడు, బాబా భక్తుడు, మందిర కార్యకర్త బెంగళూరు వెళ్లడం జరిగింది. షిరిడీకూడ వెళ్లడం ఆతని ప్రోగ్రాంలో ఉంది.   అపుడు ఈ విషయం ప్రస్తావిస్తూ అతనికి హ్యూస్టన్ నుండి  ఓ ఇమెయిల్  పంపాను. షిరిడీ వెళ్ళినపుడు బాబా దర్శనానంతరం, బాబాకు సంబంధించిన ముఖ్య ప్రదేశాలకెళ్లి వాటి ఫోటోలను వెబ్ కొరకు తీయమని. ఆ మెయిల్ అందిన పిమ్మట ఆతడోరోజు ఓ పుస్తకాల షాపుకి వెళ్లడం జరిగింది. ఎదురుగా  "షిరిడీదర్శనం"  అనే పుస్తకం కంటబడింది. తనకు ఉపయోగంగా ఉంటుందని వెంటనే ఆ పుస్తకం కొని, ఆ తర్వాత తన కుటుంబంతో షిరిడీ వెళ్ళారు  ప్రయాణం సుఖంగా జరిగింది. వారందరు తమ సేద దీర్చుకొని బాబా సమాధిమందిరానికి ఆరతి కెళ్లారు. ఆరతి పిమ్మట షిరిడీలోని వివిధ ప్రదేశాలు చూడాలని ఆలోచన. ఆరతి సమాప్త మైనది. వెలుపలికి వెళ్ళుటకు వారంతా వెను దిరిగారు. 

వారికోపెద్దాయన కనిపించారు. రండి రండి వెళదామంటూ వారిని సంభోదించాడు. ఎక్కడికని ఆయన నడగాలని  వీరి కనిపించలేదు. వారెక్కడకు వెళ్లాలనే  తమ ఆలోచనా  ఆయనకు  చెప్ప లేదు. అలా ఆయన ముందు, వీరు వెనుక షిరిడీ లోని అన్నిప్రదేశాలకు వెళ్లారు. ఆ ప్రదేశాల వివరాలు పెద్దాయన చాల ఓపిగ్గా వివరించి చెప్పాడు. తన దగ్గరి కెమెరాతో మిత్రుడు ఆయాప్రదేశాల ఫోటోలు చక్కగా తీసాడు. ఇదంతా పూర్తవడానికి షుమారు ఓ గంట పైనే సమయం పట్టింది. తమ వెంట వచ్చింది  షిరిడీలోని టూరిస్ట్ గైడ్ అని తలచి   ధన్యవాదాలు చెప్పి కొంత డబ్బులివ్వటానికి ఆతనికై వెనక్కు తిరిగాడు. కాని ఆశ్చర్యకరంగా ఆ పెద్దాయన కనిపించలేదు. ఆ వెంటవచ్చింది సాయి కాదుగదా అనే పెద్ద అనుమానమొచ్చి ఆ ప్రదేశమంతా ఎంతోసేపు వెదికాడు. కాని ఏమాత్రం మనిషి ఆచూకీ తెలియలేదు. 

ఆ పెద్దాయన టూరిస్ట్ గైడ్ ఐతేనేగదా కనిపించడానికి. ఇలా  బాబా ఎన్నో సందర్భాలలో ఏదో రూపంలో దర్శన మిచ్చినా, అనుభవమిచ్చినా, వారిని గుర్తించే అవకాశం మాత్రం ఆ సమయానికివ్వరు. ఆలస్యంగా ఆ విషయం బోధపడుతుంది. మితృనికి మంచి ఫోటోలు తీశాననే పెద్ద తృప్తి కలిగినా, బాబాను గుర్తించలేకపోయాననే చింత ఎక్కువయినది. ఆపై ఫోటోలను వెబ్ సైటులో ఉంచారు. మరో ముఖ్య విషయం ఈ ఘటన జరిగిన అతికొంత కాలానికే షిరిడీ మందిర పరిసరాలలొ ఫోటోగ్రఫీ నిషేదించారు.          
మరిన్ని వివరములకు, సాయిఖండాంతరాలీల   SaiLeelaTelugu.Blogspot.Com dated 10-17-2018 చూడండి. 

ఏడవలీల 

     శ్రీసాయినాథాయనమః 

శిరిడీ  గురుస్థానం  వద్ద సాయి జూపిన లీల 

సాయిబాబా భక్తులకు, అనుభవ ప్రదాత. అలాంటి అనుభవాల ప్రసాదించి వారి భక్తి విశ్వాసాల పెంపొందిస్తారు. ఓ..  క్షణం సందేహం, మరుక్షణం సమాధానం, ఇదే సాయిలీల! 

సమయం ఓరోజు  ఉదయం నవంబర్ 2011 గా గుర్తు. కాకడ ఆరతి అనంతరం, సమాధిమందిరం నుండి గురుస్థానం వైపుగా బయటకు వచ్చాను. కొద్దిగా మసక   చీకటి. ఇంకా అభిషేక పూజకు ఓగంట సమయముంది. ఈలోపు గురుస్థానం  చుట్టూ   108 సార్లు  ప్రదక్షిణం చేయాలని సంకల్పం కలిగింది. అంతలోనే మనసులో ఓ.. సందేహం, బాబా అందరికి అడిగినవిస్తారని విన్నాను, మరి నాకేమీ యివ్వలేదే? అలాంటి  అనుమానం తోనే వేపచెట్టు చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టాను. షుమారు పది పన్నెండు పరిక్రమణల అనంతరం  జరిగిన వింత వింటే మీరందరు చాల అబ్బురపడతారు. కావున సాయిబంధువులతో నా ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని పంచుకొంటాను. ప్రక్కనకూడ 10,15 మంది భక్తులు   ప్రదక్షణల చేస్తున్నారు. అంతలోనే దూరం నుండి ఓవ్యక్తి నావైపు నడవటం గమనించాను. దగ్గరకు రాగానే చూస్తే, యూనిఫామ్ లో ఉన్న గురుస్థానం సెక్యూరిటీ గార్డ్. చేతిలో పీచుతో కూడిన కొబ్బరికాయ. చాల ప్రేమతో నాచేతిలో పెట్టాడు. ప్రక్కవారి వంకకూడ చూడలేదు. హృదయపూర్వకంగా అతనికి  కృతజ్ఞతల తెలుపుచూ ఆకొబ్బరికాయను సాయిప్రసాదంగా స్వీకరించాను. 

నాకు కలిగిన సందేహానికి, అనుభవానికి మధ్య షుమారు 10,15 నిముషాల వ్యవధికి మించదు. గురుస్థానం సెక్యురిటి గార్డుకి నా అనుమానం,అనుభవం రెండూ తెలియక పోవచ్చు! కాని నేనిప్పటికీ ఆ క్షణాల మరువలేదు.  మరి మీరేమంటారు? సాయిలీల కాదంటారా? ఆ ఎండిన నారికేళం యిప్పటికీ  నావద్దే ఉంది. మంచి హృదయంతో అడుగు, తక్షణమే సమాధానమిస్తానన్న సాయిమాట ఎంత సత్యవంతమోకదా! ఆలీల  ప్రేరణాగీతాన్ని చదివిగాని, పాటగా పాడిగాని ఆనందించగలరు! 

   నింబవృక్షమా
 నింబవృక్షమా  నీదేను పున్నెము
నీ ఛాయసీమలో వెలసేను దైవము

భూగర్భమందున బాబ తపము సేసెను
ఆతపపు తావిలొ నీమొలక నిలిచెను
నీ చివురు నీడనే గో..సాయి కూడెను
ఆకుపసరులా  రోగా.. మాన్పెను                      ||  నింబవృక్షమా! ||

నిలువెల్ల గరళము  అది నీకె  సహజము
హరియించె దైవము  నినునింపె మధురము
కురుపింతు వమృతం అది మాకె సుకృతం
దరిశింప  క్షణం ధ్యానింప ... క్షణం                 ||  నింబవృక్షమా|| 

వెలిగింప దీపము గురుపాద  స్థానము
తొలగింతు భారము కలిగింతు భోగము
మముగావు రాజమా గురుసాయి పీఠమా
మా కల్పవృక్షమా ...నీకే ప్రదక్షిణం                      ||   నింబవృక్షమా||

సాయిలీలా ప్రసాదము 


మరిన్ని వివరములకు, గురుపాదవందనం  SaiLeelaTelugu.Blogspot.Com dated 08-24-2018 చూడండి. 



సాయిలీలలను చదవండి, చదివించండి పదుగురితో పంచుకోండి, సాయి కృపకు పాత్రులుకండి! 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

ఓం మంగళం సాయినాథాయ మహనీయగుణాత్మనే సర్వలోక శరణ్యాయ శ్యామరక్షాయ మంగళం!
లోకస్తమస్తా సుఖినో భవంతు!
ఓం శాంతి శాంతి శాంతిః !


The expseriences of devotees with Shirdi Saibaba:
Anubhava Mandarams — Blossoms of Divine Experiences May 28, 2020 Om Shri Sainathaya Namah A Sadguru is like a celestial Kalpavriksha, the wish-fulfilling divine tree. Devotion, faith, earnestness, and patience are like fragrant flower-strings entwined lovingly around that Kalpavriksha. The blossoming flowers upon those branches are the playful divine leelas; and the cool moonlit showers that descend from them are nothing but the Anubhava Mandarams – the divine experiences granted to devotees. To put it simply — when one serves the Kalpavriksha-like Sadguru with steadfast devotion, divine experiences naturally arise in the heart. Sai, for the sake of His devotees and to reveal His ever-living avataric mission, continues to manifest countless, unbounded leelas even today. The following sacred experiences were originally described in detail in another blog (SaileelaTelugu.Blogspot.com). They are gathered here briefly to inspire devotion. The author firmly believes that reading such leelas deepens our faith and brings us closer to Baba’s grace.
THE FIRST LEELA ( Miracle 1.): The Power of Sai Satcharitra – A Devotee’s Experience in America Sai Satcharitra itself proclaims: “Hearing Sai’s divine leelas kindles devotion and purifies the mind. Sins are washed away. Narrating Sai’s leelas to others awakens new insights. Whoever performs the Satcharitra Parayan with devotion and complete faith, completing it in seven days, all their calamities vanish. Wealth comes to those who seek it; business prospers; poverty dissolves; diseases disappear. The wavering mind gains steadiness. One who surrenders fully merges into the Supreme, just as a river loses its identity in the ocean.” A devotee known to the author in Houston (Texas) once shared her profound experience. She barely knew about Shirdi Sai Baba. Upon hearing of Him during a casual meeting, and yearning to overcome her difficulties, she borrowed an English copy of Sai Satcharitra. Although advised to begin the parayan on a Thursday, she was unable to wait. She began on Saturday and, filled with eagerness, completed the entire reading in three days instead of seven. As she read the final pages, the home phone began ringing. She refused to get up until the last word was completed. When she finally answered the call — the miracle unfolded: It was a job offer. After months of unemployment and despair, this sudden blessing arrived exactly at the moment she completed the sacred parayan. She joyously declared it was due entirely to Baba’s grace. Thereafter she became a steadfast devotee and began worship and satsangs in her home. This incident occurred 16 years ago, yet remains a shining example of how time, place, and distance hold no power over Baba’s grace. Where there is faith and surrender, Baba’s blessings surely follow.
THE SECOND LEELA (Miracle 2.): The God Who Gives What One Sincerely Asks — A Devotee’s Experiences in America Sai Satcharitra, Chapter 15 says: “If you stretch your hands towards Me in devotion, I am ever near you. Though My body appears at one place, I know all your actions across the oceans. My true dwelling is in your heart. Worship Me within. Blessed indeed are those who recognize this truth.” Although Baba attained Mahasamadhi a century ago, His eternal leelas still vibrate throughout the universe. A devotee, Shri Suri Kakaji of Houston, narrates: In 1977 he moved from Gujarat to Houston and regularly visited the ISKCON temple. A friend once invited him to his home for a satsang. Along with various deities, there was also a small photo of Shirdi Sai Baba. Kakaji asked his friend if he could obtain a Baba photo. His friend replied, “I have none left, but if you truly desire it, Baba Himself will give it to you.” Kakaji searched every Indian store in Houston — not a single Baba photo was available. He returned home slightly disappointed. A few days later, a stranger knocked on his door. The man said he urgently needed some money and offered a pendant in exchange. When Kakaji looked closely — it was a locket with Shirdi Sai Baba’s picture. He was astonished. The man asked for exactly twenty dollars in Gujarati, received it, and disappeared. Kakaji never saw him again — not before, not after — for over forty years. He now believes firmly that the visitor was no ordinary man — but Baba Himself come to fulfill his longing. Another miracle occurred during a Durga Puja held at his home. Before the puja, Kakaji placed a small slip of paper in the shrine politely inviting Baba to attend. After the puja, as guests were leaving, Kakaji suddenly saw Baba appear like a flash of light entering the puja room. Thrilled, he shouted for everyone. But by the time others arrived, there was no one there. All the rooms were closed. No one else had seen Him. How did Baba enter? How did He vanish? Such mysteries belong only to Sai — the merciful One who comes uninvited to bless His devotees.
THE THIRD LEELA (Miracle 3): “Like Pulling a Bird With a String” — The Author’s First Experience With Baba. Acharya Ekkirala Bharadwaja says: “Through divine experiences, Baba reveals His constant presence beside the devotee. To question the reality of the Sadguru after receiving His grace is like tasting sweetness and then asking what sweetness is.” Before 1993, the author himself knew little about Sai Baba. That year, at the construction site of the “Sai Master Apartments” in Vengalrao Nagar, Hyderabad, he befriended Shri Venkataswamy — a gentle and devoted Sai bhakta. During the seven-day Jnana Yajna held at the apartment cellar, daily satsangs, parayans, bhajans, and aratis occurred. On the eighth day, during the Purnahuti, an extraordinary incident happened. A mysterious fakir entered the premises. He had earlier walked into the third-floor apartment, taken a towel from the puja room without anyone noticing, tied it around his waist, and then sat facing Baba in the cellar. We reverentially put fruits as prasadam into his open hands. He was unmindful and motionless: gazing into the vaccum with vacant yet powerful eyes. After ten minutes, he vanished. No one saw him enter or leave. No one knew who he was. Was he Baba Himself? Many wondered — and still do! Forty days after the yajna, the author began experiencing an intense inner awakening — waves of unprompted devotion, thoughts of Baba filling the heart, spontaneous compositions of hymns and songs. Over a hundred devotional pieces emerged naturally, culminating in the famous Sri Sai Ashtakam written on January 5, 1994. Thus Baba entered his life permanently, steering his spiritual journey ever since.
THE FOURTH LEELA (Miracle 4.): Doubt and the Divine Answer — The Palakollu Temple Experience Even in Baba’s physical lifetime, many devotees who worshipped Him with love still struggled with doubt. Such is human nature. In 1996, while working near Palakollu (West Godavari), the author often visited the newly consecrated Sai temple there and became acquainted with Shri Allam Satyanarayana, a young man overflowing with faith and devotion. One evening, walking alone towards the temple, the author was suddenly overwhelmed by doubt: “Is Baba truly there? Am I simply wasting time?” Just then — Satyanarayana unexpectedly appeared, walking toward him. After greeting warmly, he enthusiastically shared several miraculous experiences of devotees, contributions made after blessings, healings, childless couples receiving children, and many wonders of the temple. His heartfelt words melted the author’s doubts. Faith blossomed anew. Whenever doubt arose, Baba sent an answer — through a person, an event, or a sudden inner clarity. Baba’s promise stands eternal: “Ask, and My help shall reach you instantly.”
THE FIFTH LEELA (Miracle 5.): Om Shri Sainathaya Namah **The Sai Who Knows the Heart (The Leela of Panjagutta Sai Temple in Hyderabad)** Sai Baba is the indwelling Spirit in every being — the One who resides in all hearts. Our hopes and aspirations, fears and sorrows, dangers and deliverance — everything is known to Him. He is untouched by nearness or distance, by ideas of “rich” or “poor,” “high” or “low.” He knew Hemadpant’s doubts even before they were spoken. He knew the false accusations made by the lawyer in Pandharpur. He knew Cholkar’s sacrifice of drinking sugarless tea to save money for His darshan. He knew Kakaji Vaidya’s burning desire to come to Shirdi. He even knew the hunger of a voiceless dog and the chirping of a tiny lizard upon a wall. The inner hearts of devotees are open books before Him. This is not just history — this is a living reality. Sai listens to our prayers, responds, and gives what is truly good for us. To trust this fully is the greatest blessing for a devotee. Let me share a small experience closely connected to this truth. It was Thursday, September 1st, 1994. I was then living in Srinagar Colony, Hyderabad. Every Thursday, I would visit the famous Shirdi Sai Temple at Panjagutta. That day too, I reached the temple. It was evening aarati time, and the crowd was overflowing. Devotees were waiting even outside the hall. The queue slowly moved and I entered inside. Due to the rush, volunteers were urging devotees to keep moving. I was nearing Baba’s idol. Just four or five people were ahead of me. Suddenly, a strange thought arose in me: “After bowing to Baba’s feet, how wonderful it would be if I could touch His holy face once!” I immediately felt this was impossible in such a crowd. The thought would remain only a desire — or so I felt. My turn came. I bowed at Baba’s feet and was about to move forward. At that very moment, something unexpected happened. A volunteer standing there placed a large white flower garland into my hands and told me to place it around Baba’s neck. What more did I need? With a heart overflowing with gratitude, I offered the garland and gently touched Baba’s beloved face — exactly as my heart had wished moments before. I silently thanked the volunteer with my eyes and moved ahead. I do not remember whether it was a jasmine garland or another flower. But that moment was unmistakably a blessing. Not coincidence — a lightning-flash of Baba’s grace. Another Thursday, I felt a sudden urge at home to bring a picture of Lord Dattatreya. That very evening, when I went for aarati at Panjagutta, right opposite the temple there was one single small photo of Dattatreya left in a shop. I bought it immediately and brought it home. Such are Baba’s intimate ways of showing His presence.
THE SIXTH LEELA (Miracle 6.):Om Shri Sainathaya Namah **The Sai Who Connects Continents (A Miracle Linking Houston, Bangalore, and Shirdi)** Here is a Leela that shows Baba’s universal presence — how He effortlessly connects people across oceans. This happened in 2002. In Houston, Texas, there is a beautiful Shirdi Sai Temple on Hillcroft Road. At that time, the temple website was being developed. They wished to include photographs of Shirdi — the Samadhi Mandir and other sacred places. A close friend of mine, a Sai devotee and temple volunteer, was travelling to Bangalore and then planned to visit Shirdi. So I emailed him from Houston requesting him to take photographs for the website when he visited Shirdi. After receiving the email, he happened to visit a bookshop in Bangalore. There he saw a book titled “Shirdi Darshanam.” Feeling it would be helpful, he bought it. Soon after, he travelled to Shirdi with his family. The journey was smooth. They attended the Samadhi Mandir aarati. After the aarati, they thought of visiting all the important places in Shirdi. Aarati had just ended, and they were walking out when an elderly gentleman appeared before them. “Come, come… let us go,” he said kindly. He did not ask where they wanted to go, nor did they tell him. He simply walked ahead. They followed behind. He took them — without missing a single place — to every holy spot in Shirdi. With great patience, he explained the significance of each location. My friend took excellent photos with his camera. This guided tour lasted about an hour. Thinking the gentleman was a tourist guide, my friend turned to thank him and offer some money. But the gentleman was nowhere to be seen. He searched everywhere in confusion and awe — but no trace. Only one thought struck him: “Was that Baba Himself?” Deep satisfaction remained for having taken such beautiful pictures, but even deeper regret for not recognizing Baba in that form. Those photos were later uploaded to the Houston temple website. Another astonishing fact: Shortly after this event, photography around the Samadhi Mandir premises was completely prohibited. The Leela had occurred exactly at the last possible moment.
THE SEVENTH LEELA (Miracle 7.):Om Shri Sainathaya Namah **Sai’s Answer That Comes in Moments (At Gurusthan in Shirdi)** Sai Baba grants experiences to strengthen a devotee’s faith. A moment of doubt is followed by a moment of reassurance — such are Sai’s Leelas. This incident took place around November 2011, early morning. After Kakad Aarati at the Samadhi Mandir, I walked toward Gurusthan. It was still semi-dark. There was an hour left for the Abhishekam. I felt inspired to complete 108 pradakshinas around the Gurusthan Neem tree. As I began, a small doubt arose: “I have heard that Baba gives everyone what they ask… But He has not given me anything yet!” With this mild disappointment, I continued the circumambulations. After about ten or twelve rounds, a surprising incident occurred. A man in uniform — the Gurusthan security guard — walked directly toward me. In his hand was a fresh coconut with a tuft. With great affection, he placed it in my hands. He did not look at anyone else around — only at me. I thanked him sincerely and received it as Sai Prasad. The time gap between my doubt and Baba’s response was no more than 10–15 minutes. The guard surely did not know my thoughts. But Baba knew. Even today that dried coconut remains with me — a symbol of Sai’s immediate grace. “Ask with a pure heart, and I shall answer at once.” Baba’s words were proved true that day.
MAY SAI’S GRACE SHINE UPON ALL! Read Sai’s Leelas, share them with others, and become worthy of His boundless compassion. May Sri Sai’s rays of grace fall upon everyone! May all be blessed! Om Sai, Shri Sai, Jai Jai Sai! Om Mangalam Sainathaya Mahanīya–Guṇātmane Sarva-Loka–Sharanyaya Shyama-Rakshaya Mangalam! May all beings everywhere be happy. Om Shanti Shanti Shantih!

Comments

  1. సాయిలీలలు భక్తిమార్గ ప్రదీపికలు, దైవసన్నిధి జేర్చు సోపానాలు !

    ReplyDelete
  2. The miracles of Sadguru Saibaba are like light posts on the path of devotion to reach Him!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)