అనుభవ మందారాలు (Experiences of devotees with Shirdi Saibaba)!
సద్గురువు కోరికలదీర్చే కల్పవృక్షము, భక్తివిశ్వాసాలు, శ్రద్ధాసహనాలు కల్పవృక్షాన్ని పెనవేసుకొన్న పూలతీవెలైతే, వికసించే కుసుమాలే లీలల మల్లెలు, వెన్నెల జల్లులు అనుభవమందారాలు.
ఇంకా సరళభాషలొ చెప్పాలంటే కల్పవృక్షంలాంటి సద్గురుని భక్తిశ్రద్ధలతో సేవిస్తే భక్తులకు అనుభవాలు సహజంగానే కలుగుతాయి.
సాయి తమయునికిని, కొనసాగే తమ అవతారకార్యమును భక్తులకు తెలియబరచుటకు అసంఖ్య లీలాప్రదర్శనలు జేస్తున్నారు. ప్రస్తుతం క్రిందవ్రాయబడిన భక్తుల అనుభవాలు వేరొక బ్లాగ్ SaileelaTelugu.Blogspot.Com నందు విస్తారముగా చర్చింపబడ్డాయి. ఆ అనుభవాలను సంషిప్తంగా నిచట కూర్చడమైనది. ఈలీలల చదువుటవలన సద్గురు సాయి పై భక్తిశ్రద్ధలు యినుమడించి మరింత దృఢపడతాయనేది రచయిత ప్రగాఢవిశ్వాసము.
శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహిమ. అమెరికాలో ఓభక్తురాలి అనుభవము.
"శ్రీసాయిలీలలను అలవోకగా విన్నను ఆధ్యాత్మజీవితమందు శ్రద్ధ కలుగును. పాపములు నశించును. సాయిలీలలను ఇతరులకు చెప్పినచో నందు కొత్తవిషయములు గ్రహించగలరు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తిప్రేమలతోను,పూర్తి నమ్మకముతోను పారాయణముచేసి వారమురోజులలో ముగింతురో, వారియాపదలన్నియు నశించగలవు. ధనమును కోరిన పొందవచ్చును,వర్తకుల వ్యాపారము వృద్ధినొందును. శ్రీసాయి ప్రీతిచెంది యజ్ఞానమును పేదరికమును నిర్ములించి జ్ఞానము ఐశ్వర్యముల నొసంగును. రోగులు ఆరోగ్యవంతులగుదురు. వారిమనసులందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. భక్తుడు సాయిని శరణాగతి వేడినచో నతడు 'తాను' అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును." శ్రీసాయిసచ్చరిత్రము
హ్యూస్టన్ (టెక్సాస్ రాష్ట్రము) లోని నాకు తెలిసిన ఓ భక్తురాలి ( గోప్యం కోసం పేరు చెప్పుటలేదు) శ్రీసాయిసచ్చరిత్రము పారాయణ అనుభవము. ఆమెకు సాయిబాబానుగూర్చి పెద్దగా తెలియదు. ఓ సందర్భంలో కలిసినప్పుడు బాబాను గూర్చివిని, తన సమస్యల నివారణకై శ్రీసాయిసచ్చరిత్ర చదవాలనుకొంది. ఆమెవద్ద సచ్చరిత్ర పుస్తకము లేకుండుటచె నానుండి ఇంగ్లీషు కాపి తీసికెళ్ళింది. సాధారణంగా పారాయణ గురువారం మొదలుపెట్టి 7 రోజులలో పూర్తి చేయాలని చెప్పాను. ఆమె శనివారం పుస్తకం తీసికెళ్ళి , గురువారం వరకు వేచియుండలేక ఆరోజే పారాయణ మొదలుపెట్టింది. పారాయణలో అభిరుచి, ఉత్సాహం పెరగటంతో మూడురోజులలోనే పారాయణ పూర్తిచేసినది. ఆఖరిరోజున చివరి పేజీలు చదువుచున్నపుడు ఇంట్లోని ఫోను మ్రోగనారంభించింది. కాని పుస్తకం పూర్తికానిదె ఫోన్ వద్దకు వెళ్ళగూడదని చదవడం కొనసాగించింది. ఫోన్ రింగింగ్ కూడా అలానే కొనసాగింది.
చివరకు చదవడం పూర్తయ్యాక ఫోన్ కాల్ తీసుకొంది. విషయం తెలిసాక ఆశ్చర్యానికి హద్దులేదు. ఎప్పటినుండో జాబ్ లేకుండ నిరాశతో యున్న ఆమెకు జాబ్ ఆఫర్ ఆ ఫోన్ కాల్ లోని విషయం. పారాయణ ఫలితమే నని ఆమె నమ్ముతోంది.
ఆపై బాబా భక్తురాలిగ మారి వారింట్లో బాబా పూజాసత్సంగాలు చేయడం ప్రారంభించింది. ఈ సంఘటన షుమారు 16 యేండ్ల పూర్వం జరిగింది. పారాయణ మహిమకు దేశ కాలాలతో పనిలేదు. భక్తిశ్రద్ధలతో, పట్టుదలతొ , బాబాపై నమ్మకంతో చేసేవారికి తప్పక బాబా అనుగ్రహం లభిస్తుందనడానికి పై అనుభవం ఓ నిదర్శనం.మరిన్ని వివరములకు; పారాయణమహిమ SaiLeelaTelugu.Blogspot.Com dated 10-17-2018 చూడండి.
రెండవలీల
శ్రీసాయినాథాయనమః
కోరినదిచ్చే దైవం! (అమెరికాలో నివసించే ఓ భక్తుని అనుభవాలు.)
" నాముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రీపగలూ మీ చెంత నేనుండెదను. నాదేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరుచేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీహృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజన హృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు; పావనులు; అదృష్టవంతులు." శ్రీసాయిసచ్చరిత్రము, అధ్యాయము 15.
బాబా మహాసమాధియై కేలండర్ ప్రకారం ఈరోజుకు 100 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, వారి నిత్యసత్య లీలలు విశ్వంలో వ్యాపిస్తూనే యున్నాయి. సాయిమహరాజుకు శతకోటి వందనాలు!
సూరీ కాకాజీ , హ్యూస్టన్ లో నాకు ఇరువది సంవత్సరములుగా తెలిసిన సాయి భక్తులు. ఆయన తమ అనుభవాలనిలా పంచుకొన్నారు.నేను గుజరాతునుండి 1977 లో హ్యూస్టన్ వచ్చాను. ఇచట iskcon టెంపుల్ కు వెళుతుండేవాడను. అచట పరిచయమైన ఓ స్నేహితుడు తమ ఇంట్లో పూజ, సత్సంగము చేస్తున్నామని నన్ను రమ్మని ఆహ్వానించారు. అది 1978 సంవత్సరంగా గురుతు. పూజలో అనేకదేవుళ్ళతోపాటు సాయిబాబా ఫోటోలు కూడా పెట్టారు. ఆరోజుల్లో బాబాగురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు. నాకుకూడా ఓ బాబా ఫోటో కావాలని మిత్రునితో అన్నాను. తనవద్ద వేరే ఫోటోలు లేవు, కాని మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పక దొరుకుతుందని చెప్పాడు. ఆ తర్వాత బాబాఫొటో కొనాలని ఇచట హ్యూస్టన్ లోని అన్ని ఇండియన్ దుకాణాలకు తిరిగాను. ఎక్కడా ఒక్కఫోటోకూడా దొరకలేదు. కొద్దిపాటి నిరాశతో ఇంటికెళ్ళాను.
ఇదిజరిగిన కొన్నిరోజులకు ఉదయం ఓ వ్యక్తి మా ఇంటికొచ్చాడు.తనకు కొద్దిగా డబ్బు అవసరమని, తాను తనదగ్గరనున్న లాకెట్/పెండెంట్ బదులుగా ఇస్తానని నాచేతిలో పెట్టాడు . పెండెంట్ పరిశీలించిచూస్తే మధ్యలో షిర్డిసాయిబాబా ఫోటో ఉంది. కొద్దిసేపు నేను నమ్మలేకపోయాను.
డబ్బులెంతని అడిగితే ఓ ఇరవై డాలర్లు ఇవ్వండని గుజరాతీలోనే చెప్పాడు.అలానే చెప్పినంత ఇచ్చాక ఆ మనిషి వెళ్ళిపోయాడు. తరువాత ఆలోచిస్తే ఆ వ్యక్తిని అంతకుమున్నెప్పుడూ చూసిన దాఖలాలు లేవు. ఇదిజరిగాక గడచిన నలుబది సంవత్సరములలో కూడ ఆతని ఆచూకి లేదు. ఇప్పటికి ఆశ్చర్య మనిపిస్తుంది.మరో సందర్భం, దుర్గా పూజల సమయం. అమ్మవారిపూజ మా ఇంట్లో చేసుకొంటున్నాము. చాలామంది స్నేహితులను పిలిచాము. పూజావేదిక చక్కగా అలంకరించాము. మనసులో బాబాను కూడా ఆహ్వానించాలని తోచింది. ఓ చిన్న స్లిప్ మీద బాబా, పూజకు మా ఇంటికి తప్పక రావలసినదని వేడికోలుగా వ్రాసి పూజా మందిరంలో ఆ కాగితముంచాను. పూజ బాగుగా జరిగినది. అందరు సంతోషపడ్డారు. భోజనాలయిన పిమ్మట క్రమంగా అతిధులందరు ముందు ద్వారంగుండా వెళ్లిపోయారు.
నేను వెనుదిరిగి లోపలి కెళ్తుండగా, వెనుకవైపు గదినుండి బాబా మెరుపులా పూజాగదిలోకి వచ్చారు. పూజా స్థలం వద్ద చాలాకొద్దిసమయం నిలబడ్డారు. బాబా, బాబా వచ్చారు అంటూ పెద్దగా అరుస్తూ ఇంట్లో వారికి చెప్పడానికి లోని కెళ్ళాను. అందరం పూజాగదిలోకి పరుగెత్తేసరికి అక్కడెవరూ లేరు.
బాబాకోసం అన్నిగదులు వెదికాము. కాని ఏమాత్రం ఆచూకీ లభించలా ! మాకందరికి అంతుపట్టని విషయమేమంటే ఇంట్లోని వెనుకవైపు గదులన్నీమూసియున్నాయి,మా ఇంట్లోని మిగతావారుగూడ బాబారావడం చూడలేదు, మరి బాబా యింట్లోకి యెట్లా ప్రవేశించారు,అంతత్వరగా ఎలా మాయమయ్యారు? నా ప్రార్ధన మన్నించి నాకు రెప్పపాటు దర్శనమిచ్చి మా పూజాగృహమును పావనము జేశారు, ఇదియంతయు సాయికరుణ గాదా ! అదే బాబా మహిమగా తోస్తుంది.మరిన్ని వివరములకు; ఖండాంతరాలీల-2 SaiLeelaTelugu.Blogspot.Com dated 10-15-2018 చూడండి.
మూడవలీల
శ్రీసాయినాథాయనమః
నా వాడిని ఎంతదూరమున యున్నప్పటికి పిచ్చుకకు తాడుకట్టి లాగినటుల నా చెంతకు నీడ్చెదను. (సాయిబాబాతో రచయిత తొలియనుభవము )
ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ
సాయిబాబా గురించి 1993 వ సంవత్సరానికి ముందు నాకు పెద్దగా తెలియదు. అదే సంవత్సరంలో హైదరాబాద్ వెంగళరావు నగర్లో సాయిమాస్టర్ అపార్ట్మెంట్స్ నిర్మాణం జరిగింది. అందులో మేమొక యూనిట్ తీసికొనుటచే బిల్డర్లులో ఒకరైన శ్రీవేంకటస్వామి గారితో పరిచయ మేర్పడినది. వారు మిత్రులు,సౌమ్యులు,మంచి సాయిభక్తులు. వారు బాబా సత్సంగాలకు వెళుతూ రెండు మూడు సార్లు నన్నుకూడ తీసికెళ్లారు. సాయిమాస్టర్ అపార్ట్మెంట్స్ పూర్తియైన పిమ్మట అక్టోబర్ 31 న గృహప్రవేశాలు జరిగాయి. వెంకటస్వామిగారు కూడా ఓ యూనిట్ తీసుకొన్నారు. ఆ సందర్భాంగా శ్రీ శిరిడీసాయి సచ్చరిత్ర జ్ఞానయజ్ఞ కార్యక్రమము, సెల్లార్లో 7 రోజులు పాటు జరిగినది. 8 వరోజు పూర్ణాహుతి కార్యక్రమము. శ్రీ కృష్ణావర్జుల రాజేంద్రప్రసాద్ గారు, తమ 14 వ జ్ఞానయజ్ఞంగా మా పూజాకార్యక్రమాన్ని చాల చక్కగ జరిపారు. ప్రతిరోజూ సాయంకాలం 5 గంటలనుండి బాబా పాటలు, పూజ, చరిత్రపారాయణ విశ్లేషణ, ఆరతి జరిగేవి. నవంబర్ 7 న పూర్ణాహుతి కార్యక్రమం బహువేడుకగా జరిగినది. విశేష పూజ, బాబా నాలుగు ఆరతులు, అన్నదానాలు జరపడమైనది.
అదేరోజు, రోజూ జరగని ఓ ప్రత్యేకత జరిగినది. ఉదయం షుమారు 11 గంటల ప్రాంతంలో ఓ వింత ఫకీరు సెల్లారులోని బాబాపూజా స్థలానికి ఎదురుగా వచ్చి కూర్చొన్నారు. కూర్చునేముందు ఆ వ్యక్తి 3వ అంతస్తులోని వెంకటస్వామిగారి యూనిట్ లోనికి ఎవరి ప్రమేయం లేకుండా ప్రవేశించి అచట ఉంచిన పూజాబట్టల నుండి ఓ టవల్ తీసి, తమ మొలచుట్టూ కట్టుకొని కిందికొచ్చారు. బాబాకెదురుగా కూర్చున్నవారికి బాబాప్రసాదంగా కొన్నిఫలాల వారిదోసిలిలో ఉంచాను. ఆయన వాలకం చాల వింతగా ఉంది. మాట్లాడుతుంటే కనులవైపు జూడక ఎటో గాల్లోకి పరాకుగా పిచ్చిచూపులు చూస్తున్నారు. ఎలాంటి స్పందన లేదు. షుమారు పది నిముషాల తరువాత ఆ ఫకీరు యెటో వెళ్లిపోయారు. అంతకు ముందుగాని, ఆ తరువాతగాని ఆయన్ని ఎవరూ చూచుట జరుగలేదు. నిలకడగా ఆపై కొన్నిరోజులకు కొద్దిమంది భక్తులకో అనుమానమొచ్చింది. ఆ వచ్చిన ఫకీరు సాయికాదుగదా యని! ఏమోమరి ఇప్పటివరకు ఆ వివరం తెలియరాని గుహ్యం. కాని పూజాకార్యక్రమం అందరికి తృప్తినిచ్చినది. ఆ పై ఎందరి మనసులలోనో బాబా ప్రవేశించారు. వారికి బాబాపై భక్తిశ్రద్ధలు పెరిగాయి. నాకు కూడ అందరిలాంటి అనుభూతి, తృప్తి కలిగాయి. కొన్నిరోజుల వరకు ప్రత్యేకంగా మరి ఎలాంటి అనుభవం కలుగలా. కాని సుమారు 40 రోజుల తరువాత నా మనసులో తెలియరాని జాగరణలాంటి ఓ సంచలనం. బాబా పై ఎన్నో భావాలు, మనసునిండా బాబా ఆలోచనలు. క్రమంగా ఆ భావాలకు స్తోత్ర, గేయ రూపాలు. ఏ దైవ ప్రార్ధన విన్నా అదే వరుసలో బాబా పై స్తోత్రాలు. ఈ జాగరణ సుమారు ఓ సంవత్సరం 1994 చివరి వరకు, చాల ఉధృతంగా ఉండేది. కనీసం ఓ వందకుపైనే బాబాపై పాటలు, గేయాలు వగైరా రాయడం జరిగింది. ఈక్రమంలోనే జనవరి 5, 1994 న శ్రీసాయి అష్టకము, లింగాష్టక బాణీలో వ్రాయడం జరిగింది. మనసులోని ఆ సంచలన వేగం తగ్గినప్పటికి, ఇప్పటికి కొనసాగుతుంది. జూన్ 19, 1994 న అమ్మ నాన్నలతో సకుటుంబముగా శిరిడీ వెళ్లి శ్రీ సాయిబాబాను దర్శించుకొన్నాను. నా జీవన యాత్రలో బాబా అలా ప్రవేశించి కొనసాగుతున్నారు! ఆ అనుభవాలన్నింటిని ఇచట అందరితో పంచుకోవడంలో ఎంతో ఆనందం, మరెంతో తృప్తి మిగులుతున్నాయి.
మరిన్ని వివరములకు, తొలియనుభవము SaiLeelaTelugu.Blogspot.Com dated 10-17-2018 చూడండి.
నాల్గవలీల
ఓం శ్రీసాయినాథాయనమః
పాలకొల్లు దేవాలయములోని బాబా మూర్తి
సందేహము, సమాధానము. (రచయిత వేరొక యనుభవము)
భక్తులు ఎన్నో అనుభవాల చవిజూస్తూ కూడా, బాబా పై పూర్తివిశ్వాసముంచుటకు ఎంతో సంకోచిస్తుంటారు. ఇది ఇప్పటి విషయం కాదు. బాబా దేహరూపంలో ఉన్నపుడు వారిని ఎంతో భక్తిశ్రద్ధలు పూజించిన భక్తులుకూడ ఇలాంటి సంశయాలకు దూరులు కాలేక పోయారు.
ఇలాంటి అనుభవమే నాకు 1996, సెప్టెంబరు 23 న పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు బాబా దేవాలయానికి దగ్గరగా జరిగినది.అప్పుడు నేను ONGC లో పనిజేస్తున్నాను. నేను పనిజేస్తున్న బ్రాన్హాం రిగ్గు పాలకొల్లు కు సమీపంలో ఉండుటచే అపుడపుడు పాలకొల్లు బాబాగుడికి తోటి సహచరులతొ వెళుతుండేవాడిని. అప్పటికి కొన్నినెలల మునుపే బాబా విగ్రహ ప్రతిష్ట జరిగినదని తెలిసినది. ఈ క్రమంలో దేవాలయ అధ్యక్షులు శ్రీ అల్లం సత్యనారాయణగారితో పరిచయమేర్పడినది. ఆయన యువకులు , బాబాపై పరిపూర్ణ భక్తి, విశ్వాసములున్న వ్యక్తి. నిర్వాహకులందరు యువకులే. మాటల్లో ఆ దేవాలయమేర్పడటానికి ముందు జరిగిన ఎన్నో ఆసక్తి కర విషయాలు చెప్పారు.
అలాగే ఓరోజు సాయంత్రం నేనొక్కడనే బాబాగుడివైపు కాలువప్రక్కన రోడ్డుపై నడచుకొంటూ వెళు తున్నాను. కొద్దిదూరం వెళ్ళాక ఏవో వింత ఆలోచనలు, ఎన్నో సందేహాలు, అనుమానాలు, నిజంగా బాబా ఉన్నారా? నేను సమయం వృధాచేసికొంటున్నానా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఈ ఆలోచనలతో నడకగూడ కొద్దిగ మందగించింది. ఆలా రెండు నిముషాలు నడచానో లేదో, ఎదురుగా సత్యనారాయణగారు ఒక్కరే నడచుకొంటూ వస్తున్నారు. చాల రోజుల పిమ్మట కలియుటచే ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఎందరెందరో భక్తులు వారికి కలిగిన అనుభవాల మూలాన విరాళాలిస్తున్నారని, సంతానం లేనివారికి బిడ్డలు కలుగుతున్నారని, ఎందరో ఆరోగ్యులవుచున్నారని మరెన్నో విషయాలు ఎంతో ఉత్సాహంతో షుమారు 15 నిముషాలు పైన మాట్లాడారు.
నాలో క్రమంగా సందేహం పలచబడి, మరలా విశ్వాసం దృఢపడినది. దూరమునుండి, ఎందరో బాబాగుడికి ప్రదక్షిణం చేయడం చూసాను. ఇలా నాలో అపుడపుడు అనుమానం తొంగిచూసినపుడు, బాబా ఎదో రూపేణ సమాధానమిస్తున్నారు. మన అనుభవాల నమ్ముకొంటే బాబాకు తక్కువ సమయంలో మరింత సన్నిహితులం కాగలమని దృఢంగా నమ్ముతున్నాను.
నాలో క్రమంగా సందేహం పలచబడి, మరలా విశ్వాసం దృఢపడినది. దూరమునుండి, ఎందరో బాబాగుడికి ప్రదక్షిణం చేయడం చూసాను. ఇలా నాలో అపుడపుడు అనుమానం తొంగిచూసినపుడు, బాబా ఎదో రూపేణ సమాధానమిస్తున్నారు. మన అనుభవాల నమ్ముకొంటే బాబాకు తక్కువ సమయంలో మరింత సన్నిహితులం కాగలమని దృఢంగా నమ్ముతున్నాను.
అడిగిన తక్షణమే నీకు నా సహాయ సలహాలు ప్రాప్తిస్తాయి! ( సాయి వచనము).
మరిన్ని వివరములకు, సందేహము, సమాధానము SaiLeelaTelugu.Blogspot.Com dated 09-20-2018 చూడండి.
ఐదవలీల
ఓంశ్రీసాయినాథాయనమః
హైదరాబాద్ పంజాగుట్ట సాయిదేవాలయంలోని బాబా మూర్తి.
మనసెరిగిన సాయి (పంజాగుట్టదేవాలయంలో సాయి జూపిన లీల)
సాయిబాబా సర్వాంతర్యామి,సర్వహృదయవాసి. మన ఆశలు, ఆశయాలు,కోరికలు,భయాలు,బాధలు,ప్రాణాంతకాలు అన్నీ ఆయనకెరుకే ! దగ్గర దూరాలతో పనిలేదు. ఉన్నవారు,లేనివారనే తారతమ్యం లేదు. ఆయనకు వాడాలోని హేమాద్రిపంతు వాదన తెలుసు,పండరీపురంలో తనను గూర్చి లాయర్ జేసిన నిందారోపణ తెలుసు,చోల్కర్ షిరిడీ ప్రయాణానికి డబ్బులు మిగుల్చుటకై చక్కెరలేని తేనీరు త్రాగిన విషయం తెలుసు,వణిలోని పూజారి కాకాజీవైద్య షిరిడి వెళ్లదలచు తపన తెలుసు,ఇంతేకాదు నోరులేని కుక్క ఆకలి తెలుసు,గోడపైనున్న బల్లి కిచ కిచ కూత తెలుసు. అలాగే భక్తుల అంతరంగాలన్ని ఆయనకు తెరచిన పుస్తకాలే. ఇది గత చరిత్ర కాదు, నడుస్తున్న వాస్తవం. సాయి మనవిన్నపాలకు స్పందిస్తారు, సరైనవాటిని సమకూరుస్తారు. ఏదిమంచిదైతే అదే చేస్తారనే విశ్వాసం కలిగియుండటం భక్తులకెంతో శ్రేయస్కరం.
ఇంతలో నాలో ఓచిన్న వింత ఆలోచన వచ్చింది. బాబా పాదనమస్కారం తర్వాత ఆయన ముఖాన్నొకసారి స్పృశించాలని. అంత రద్దీలో నా ఆలోచనకు అర్ధం లేదేమో యనిపించింది. కోరిక ఆలోచనగానే మిగిలిపోతుందేమో ననుకొన్నాను. క్యూలో నావంతు వచ్చినపుడు బాబావిగ్రహానికి పాదాభివందనం జేసి ముందుకు సాగబోతున్నాను. ఇంతలో ఓచిన్న విశేషం, విషయం చిన్నదైనా అది నాకు విశేషంగా తోచింది. అచటనిలబడ్డ వాలంటీర్ నాకు ఓపెద్ద తెల్లపూలమాలిచ్చి, బాబామెడలో వేయమన్నాడు. మరెందుకాలస్యం? వెంటనే పూలమాలవేసి, బాబాముఖాన్ని ప్రేమతొ స్పృశించి , వాలంటీరుకు కనులతోనె కృతజ్ఞతలు తెలిపిముందుకు కదిలాను. అది మల్లెమాలో మరే పూలమాలో గుర్తులేదు. ఆ ఘటన యాదృచ్చిక మనిపించలేదు. మెరుపు వేగంతో బాబానుండి వచ్చిన ఆసిసుగా తలుస్తాను. వేరొకగురువారం ఇంట్లో చిన్నదత్తస్వామి ఫోటో పెట్టుకోవాలనే ఆలోచన కల్గింది, ఆరోజు సాయంకాల ఆరతికై పంజాగుట్టకెళ్ళగా, బాబాగుడికెదురు షాపులో దత్తాత్రేయుని చిన్నఫొటో, కేవలం ఒక్కటుంది. వెంటనేకొని యింటికితెచ్చాను.
మరిన్ని వివరములకు, మనసెరిగిన సాయి SaiLeelaTelugu.Blogspot.Com dated 09-27-2018 చూడండి.
ఆరవలీల
శ్రీసాయినాథాయనమః
హూస్టన్ మందిరంలోని సాయిబాబా విగ్రహము
అమెరికా టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ నగరంలోనివసించే రచయిత మరియు ఓ మిత్రునికి కలిగిన యనుభవము.
శ్రీసాయిబాబా విశ్వవ్యాపకులు. వారిది అఖండస్వరూపము, వారిలీలలు ఖండాంతరములు. భక్తరక్షణ కొరకు సప్తసముద్రముల దాటెదనని సాయే సెలవిచ్చారు. ఇదేవిషయం శ్రీసాయిసత్చరిత్రలొ పెక్కుచోట్ల నొక్కి వక్కాణింపబడినది. అలాగే సాయి సర్వాంతర్యామి, సర్వ హృదయవాసి. అందరి మనసులలోని ఆలోచనలు కోరికలు ఆయనకు తెలుసు. వివిధభక్తులను భిన్నరీతుల చైతన్యపరిచి సాయి తమ కార్యముల నిర్వహించెదరు. అందులకు పెక్కు నిదర్శనలు గలవు. శ్రీమన్ గోపాలరావు బూటీని ప్రేరేపించి సమాధిమందిర నిర్మాణం గావించారు, దాసగణునితో తమ మహిమ వ్యాపింపజేశారు, నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా తమ ఖ్యాతి లోకానికి తెలియబరచారు. రాధాకృష్ణ మాయి నిమిత్తముగ శ్రీసాయి సంస్థానమునకు పునాది వేశారు. ప్రస్తుతవిషయానికొస్తే సాయి తమ చాతుర్యంతో ఖండాంతర లీల నెలా చూపారో అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
ఈ విషయం 2002 వ సంవత్సరంలో జరిగినది. హ్యూస్టన్ నగరంలోని హిల్ క్రాఫ్ట్ రోడ్డు పై సాయిబాబా దేవాలయముంది, ఇప్పటికి కొనసాగుతుంది. అపుడు దేవాలయ వెబ్ సైట్ నిర్మిస్తున్నారు. ఆ సైట్ లో షిరిడీలోని బాబా సమాధి మందిరంతోపాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల ఫోటోలు ఉంచాలని సంకల్పం. అదేసమయంలో ఓ స్నేహితుడు, బాబా భక్తుడు, మందిర కార్యకర్త బెంగళూరు వెళ్లడం జరిగింది. షిరిడీకూడ వెళ్లడం ఆతని ప్రోగ్రాంలో ఉంది. అపుడు ఈ విషయం ప్రస్తావిస్తూ అతనికి హ్యూస్టన్ నుండి ఓ ఇమెయిల్ పంపాను. షిరిడీ వెళ్ళినపుడు బాబా దర్శనానంతరం, బాబాకు సంబంధించిన ముఖ్య ప్రదేశాలకెళ్లి వాటి ఫోటోలను వెబ్ కొరకు తీయమని. ఆ మెయిల్ అందిన పిమ్మట ఆతడోరోజు ఓ పుస్తకాల షాపుకి వెళ్లడం జరిగింది. ఎదురుగా "షిరిడీదర్శనం" అనే పుస్తకం కంటబడింది. తనకు ఉపయోగంగా ఉంటుందని వెంటనే ఆ పుస్తకం కొని, ఆ తర్వాత తన కుటుంబంతో షిరిడీ వెళ్ళారు ప్రయాణం సుఖంగా జరిగింది. వారందరు తమ సేద దీర్చుకొని బాబా సమాధిమందిరానికి ఆరతి కెళ్లారు. ఆరతి పిమ్మట షిరిడీలోని వివిధ ప్రదేశాలు చూడాలని ఆలోచన. ఆరతి సమాప్త మైనది. వెలుపలికి వెళ్ళుటకు వారంతా వెను దిరిగారు.
ఈ విషయం 2002 వ సంవత్సరంలో జరిగినది. హ్యూస్టన్ నగరంలోని హిల్ క్రాఫ్ట్ రోడ్డు పై సాయిబాబా దేవాలయముంది, ఇప్పటికి కొనసాగుతుంది. అపుడు దేవాలయ వెబ్ సైట్ నిర్మిస్తున్నారు. ఆ సైట్ లో షిరిడీలోని బాబా సమాధి మందిరంతోపాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల ఫోటోలు ఉంచాలని సంకల్పం. అదేసమయంలో ఓ స్నేహితుడు, బాబా భక్తుడు, మందిర కార్యకర్త బెంగళూరు వెళ్లడం జరిగింది. షిరిడీకూడ వెళ్లడం ఆతని ప్రోగ్రాంలో ఉంది. అపుడు ఈ విషయం ప్రస్తావిస్తూ అతనికి హ్యూస్టన్ నుండి ఓ ఇమెయిల్ పంపాను. షిరిడీ వెళ్ళినపుడు బాబా దర్శనానంతరం, బాబాకు సంబంధించిన ముఖ్య ప్రదేశాలకెళ్లి వాటి ఫోటోలను వెబ్ కొరకు తీయమని. ఆ మెయిల్ అందిన పిమ్మట ఆతడోరోజు ఓ పుస్తకాల షాపుకి వెళ్లడం జరిగింది. ఎదురుగా "షిరిడీదర్శనం" అనే పుస్తకం కంటబడింది. తనకు ఉపయోగంగా ఉంటుందని వెంటనే ఆ పుస్తకం కొని, ఆ తర్వాత తన కుటుంబంతో షిరిడీ వెళ్ళారు ప్రయాణం సుఖంగా జరిగింది. వారందరు తమ సేద దీర్చుకొని బాబా సమాధిమందిరానికి ఆరతి కెళ్లారు. ఆరతి పిమ్మట షిరిడీలోని వివిధ ప్రదేశాలు చూడాలని ఆలోచన. ఆరతి సమాప్త మైనది. వెలుపలికి వెళ్ళుటకు వారంతా వెను దిరిగారు.
వారికోపెద్దాయన కనిపించారు. రండి రండి వెళదామంటూ వారిని సంభోదించాడు. ఎక్కడికని ఆయన నడగాలని వీరి కనిపించలేదు. వారెక్కడకు వెళ్లాలనే తమ ఆలోచనా ఆయనకు చెప్ప లేదు. అలా ఆయన ముందు, వీరు వెనుక షిరిడీ లోని అన్నిప్రదేశాలకు వెళ్లారు. ఆ ప్రదేశాల వివరాలు పెద్దాయన చాల ఓపిగ్గా వివరించి చెప్పాడు. తన దగ్గరి కెమెరాతో మిత్రుడు ఆయాప్రదేశాల ఫోటోలు చక్కగా తీసాడు. ఇదంతా పూర్తవడానికి షుమారు ఓ గంట పైనే సమయం పట్టింది. తమ వెంట వచ్చింది షిరిడీలోని టూరిస్ట్ గైడ్ అని తలచి ధన్యవాదాలు చెప్పి కొంత డబ్బులివ్వటానికి ఆతనికై వెనక్కు తిరిగాడు. కాని ఆశ్చర్యకరంగా ఆ పెద్దాయన కనిపించలేదు. ఆ వెంటవచ్చింది సాయి కాదుగదా అనే పెద్ద అనుమానమొచ్చి ఆ ప్రదేశమంతా ఎంతోసేపు వెదికాడు. కాని ఏమాత్రం మనిషి ఆచూకీ తెలియలేదు.
ఆ పెద్దాయన టూరిస్ట్ గైడ్ ఐతేనేగదా కనిపించడానికి. ఇలా బాబా ఎన్నో సందర్భాలలో ఏదో రూపంలో దర్శన మిచ్చినా, అనుభవమిచ్చినా, వారిని గుర్తించే అవకాశం మాత్రం ఆ సమయానికివ్వరు. ఆలస్యంగా ఆ విషయం బోధపడుతుంది. మితృనికి మంచి ఫోటోలు తీశాననే పెద్ద తృప్తి కలిగినా, బాబాను గుర్తించలేకపోయాననే చింత ఎక్కువయినది. ఆపై ఫోటోలను వెబ్ సైటులో ఉంచారు. మరో ముఖ్య విషయం ఈ ఘటన జరిగిన అతికొంత కాలానికే షిరిడీ మందిర పరిసరాలలొ ఫోటోగ్రఫీ నిషేదించారు.మరిన్ని వివరములకు, సాయిఖండాంతరాలీల SaiLeelaTelugu.Blogspot.Com dated 10-17-2018 చూడండి.
ఏడవలీల
శ్రీసాయినాథాయనమః
శిరిడీ గురుస్థానం వద్ద సాయి జూపిన లీల
సాయిబాబా భక్తులకు, అనుభవ ప్రదాత. అలాంటి అనుభవాల ప్రసాదించి వారి భక్తి విశ్వాసాల పెంపొందిస్తారు. ఓ.. క్షణం సందేహం, మరుక్షణం సమాధానం, ఇదే సాయిలీల!
సమయం ఓరోజు ఉదయం నవంబర్ 2011 గా గుర్తు. కాకడ ఆరతి అనంతరం, సమాధిమందిరం నుండి గురుస్థానం వైపుగా బయటకు వచ్చాను. కొద్దిగా మసక చీకటి. ఇంకా అభిషేక పూజకు ఓగంట సమయముంది. ఈలోపు గురుస్థానం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం చేయాలని సంకల్పం కలిగింది. అంతలోనే మనసులో ఓ.. సందేహం, బాబా అందరికి అడిగినవిస్తారని విన్నాను, మరి నాకేమీ యివ్వలేదే? అలాంటి అనుమానం తోనే వేపచెట్టు చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టాను. షుమారు పది పన్నెండు పరిక్రమణల అనంతరం జరిగిన వింత వింటే మీరందరు చాల అబ్బురపడతారు. కావున సాయిబంధువులతో నా ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని పంచుకొంటాను. ప్రక్కనకూడ 10,15 మంది భక్తులు ప్రదక్షణల చేస్తున్నారు. అంతలోనే దూరం నుండి ఓవ్యక్తి నావైపు నడవటం గమనించాను. దగ్గరకు రాగానే చూస్తే, యూనిఫామ్ లో ఉన్న గురుస్థానం సెక్యూరిటీ గార్డ్. చేతిలో పీచుతో కూడిన కొబ్బరికాయ. చాల ప్రేమతో నాచేతిలో పెట్టాడు. ప్రక్కవారి వంకకూడ చూడలేదు. హృదయపూర్వకంగా అతనికి కృతజ్ఞతల తెలుపుచూ ఆకొబ్బరికాయను సాయిప్రసాదంగా స్వీకరించాను.
నాకు కలిగిన సందేహానికి, అనుభవానికి మధ్య షుమారు 10,15 నిముషాల వ్యవధికి మించదు. గురుస్థానం సెక్యురిటి గార్డుకి నా అనుమానం,అనుభవం రెండూ తెలియక పోవచ్చు! కాని నేనిప్పటికీ ఆ క్షణాల మరువలేదు. మరి మీరేమంటారు? సాయిలీల కాదంటారా? ఆ ఎండిన నారికేళం యిప్పటికీ నావద్దే ఉంది. మంచి హృదయంతో అడుగు, తక్షణమే సమాధానమిస్తానన్న సాయిమాట ఎంత సత్యవంతమోకదా! ఆలీల ప్రేరణాగీతాన్ని చదివిగాని, పాటగా పాడిగాని ఆనందించగలరు! ఓ నింబవృక్షమా!
ఓ నింబవృక్షమా నీదేను పున్నెము
నీ ఛాయసీమలో వెలసేను దైవము
భూగర్భమందున బాబ తపము సేసెను
ఆతపపు తావిలొ నీమొలక నిలిచెను
నీ చివురు నీడనే గో..సాయి కూడెను
ఆకుపసరులా రోగా..ల మాన్పెను ||ఓ నింబవృక్షమా! ||
నిలువెల్ల గరళము అది నీకె సహజము
హరియించె దైవము నినునింపె మధురము
కురుపింతు వమృతం అది మాకె సుకృతం
దరిశింప ఏ క్షణం ధ్యానింప ఓ... క్షణం ||ఓ నింబవృక్షమా||
వెలిగింప దీపము గురుపాద స్థానము
తొలగింతు భారము కలిగింతు భోగము
మముగావు రాజమా గురుసాయి పీఠమా
మా కల్పవృక్షమా ...నీకే ప్రదక్షిణం || ఓ నింబవృక్షమా||
మరిన్ని వివరములకు, గురుపాదవందనం SaiLeelaTelugu.Blogspot.Com dated 08-24-2018 చూడండి.
సాయిలీలలు భక్తిమార్గ ప్రదీపికలు, దైవసన్నిధి జేర్చు సోపానాలు !
ReplyDeleteThe miracles of Sadguru Saibaba are like light posts on the path of devotion to reach Him!
ReplyDelete