Posts

Showing posts from July, 2020

సాయి బోధనా సూక్తులు - వివిధయోగములు!

Image
శ్రీ సాయినాథాయనమః  శ్రీసాయి విశ్వభక్త పరివారానికి   గురుపూర్ణిమ శుభాకాంక్షలు, బాబా ఆశీసులు ! సాయి బోధనా సూక్తులు - వివిధయోగములు! " సాధనగూర్చి సాయిచెప్పిన ఈ సూక్తులు పరమపవిత్రమైనవి. ఒకవిధంగా భగవద్గీతా సారాంశాన్ని బాబా మనకందించారు. ఫలాపేక్షరహితమైన కర్మ, కష్టించి పనిచెయ్యి, అది కర్మయోగము. దేవునినామ ముచ్ఛరించు, స్మరణ మనన, నిధిధ్యాసములు , అవి భక్తియోగము.  సద్గ్రంథాలు చదువు. సద్గ్రంథపఠనం వల్ల సద్గురునిపై మనసు లగ్నమౌతుంది. అదే గురుభక్తి, దానివల్ల జ్ఞానం కల్గుతుంది. అదే జ్ఞానయోగం. వీటన్నిటివల్లకూడా నిశ్చలభక్తి లభించలేదో అనుభవం ప్రసాదించి మనలను ఉద్ధరిస్తారు శ్రీసాయి. అదే విశ్వరూప సందర్శన యోగం. "   సాయి సూక్తి - ఆచార్యవాణి  సాయి తమ భక్తులకు బోధించినది కేవలము వాచకము అనగా నోటిమాటల బోధకాదు. వారు చెప్పినసూక్తులను సాయి స్వయంగా ఆచరించిచూపారు  , భక్తులకు సరియగు అవగాహనగూర్చుటకు తదనుగుణ అనుభవాన్నికూడ  ప్రసాదించారు, అందులకే వారు అనుభవాన్నందించే  సద్గురువులు. భగవద్గీతలో వివిధయోగములగూర్చి  వివరణ చెప్పబడినది. అవి వరుసగా కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన...