Posts

Showing posts from October, 2020

'' మాటకై ప్రాణమిస్తాను '' సాయిబాబా !

Image
 ఓంశ్రీసాయిమాత్రేనమః  పాఠకభక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు!  ( శిరిడీలో ఓభక్తునికి సాయి ' బాల ' గా దర్శనమిచ్చారు.) నేడు సాయిబాబా మహాసమాధి పుణ్యతిధి.  " శరీరమే తామను భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యువుపై విజయం సాధించినవారే మహాత్ములు. సాయి సశరీరులుగా వున్నప్పుడే మనలా శరీర పరిమితులుగా లేరు, అన్నిరూపాలలో వున్న పరమాత్మగా జీవించారు. అలాంటివారికి మరణమెలా సంభవం? ". ఆచార్యవాణి  '' మాటనిలుపుటకై,  నాప్రాణమిస్తాను '' సాయిబాబా ! ద్వారకామాయిలో తమను సందర్శింపవచ్చిన భక్తులతో సాయిబాబా తరచుగా , " నేను మజీదులో కూర్చుని సత్యమునే పలికెదను, నా భక్తులరక్షించుటకై వేలమైళ్ళు వెళ్లెదను, సప్తసముద్రముల దాటెదను, చివరికి నావాణ్ణి కాపాడుటకై ప్రాణములసయిత మిచ్చెదను." యని పలుకుచుండెడివారు. సాయి మాటలు నూటికి నూరుపాళ్లు సత్యమని ధ్రువపరచుటకు  శ్రీసాయి సచ్చరిత్ర లో పెక్కు ఉదాహరణలున్నాయి  ఆయా విషయాలను క్లుప్తంగా స్మరించుకొందాము, ఏలయన స్మరణముకూడ నవవిధభక్తులలో ఓ భక్తిమార్గంగా చెప్పబడినదికదా!  ముందుగా శ్రీసాయి సచ్చరిత్రములోని 40వ అధ్యాయములొ చెప్పబడిన ఓ అద్భుత సంఘటన చూచెదము....

ఉపవాసం అంటే?

Image
  శ్రీసాయినాథాయనమః  ఉపవాసనియమాన్నిగూర్చి సాయిబాబా సందేశం!   సాయిబాబా తమభక్తులకు ఉపవాసాన్ని నిరసించారు, అలాఅని రుచులకుపోతూ అతిగాతినవద్దనికూడా చెప్పారు. భగవద్గితయందునా,  ఆహారవిషయంలో మితంగాను, హితంగాను ఉండాలని    చెప్పబడినది. సాయిభక్తి సాధనారహస్యం లో  శ్రీసాయినాథుని శరత్ బాబూజీగారిలా అంటారు, " ఉపవాసమంటే మనసును వ్యర్ధమైన విషయాలతో నింపక ఖాళీగా వుంచుకొని అందులో ఉపాసనా దైవాన్ని ప్రతిష్ఠించుకొని ఆయనకు అంతరంగంలో దగ్గరవడమన్నమాట, సమీపంగా వసించడమన్నమాట " !  అనగా బాహ్య ఆహారనియమాలకంటే అంతరంగ భావాలను నియంత్రించుకోవాలనేది సాయి సూచన. ఈవిషయమై శ్రీసాయి సచ్చరిత్రలోను, యితర  సాయిగ్రంధాలలోను యెన్నో ఉదాహరణలను చూడవచ్చును. వాటిలోకొన్నింటినిపుడు స్మరించుకొందాము.  సంగమనేరు గ్రామంలో నివసించే రాధాబాయి యను ముసలమ్మ బాబా పేరుప్రతిష్ఠలువిని వారినిదర్శించి మిగుల సంతోషపడినది. మనసులో సాయిబాబాను తనగురువుగా నిర్ణయించుకొని వారు ఏదేని మంత్రోపదేశమిచ్చువరకు  ఉపవసించాలని ఆహారం తినుట మానినది.  అలా మూడురోజులు గడిచాక భక్తుడు శ్యామా మిగులఁభయపడి బాబాకావిషయం తె...