Posts

Showing posts from February, 2021

" నేను నీగురువును కాను! "

Image
శ్రీసాయినాథాయనమః స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా వారి ఘనతను స్మరించుకొందాము. " నేను నీగురువును కాను! " స్వామి ఓ అమెరికన్ భక్తుని ( Mr.E.E.Dickinson) తో అన్నమాటలు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకులకు దైవనిర్ణయంచే ఓ సద్గురువు లభిస్తాడు అనెడి సత్యము చాలామందికి అనుభవ విషయము. భక్తుని మార్గంలో వేరు వేరు సమయాలలో వేరువేరు గురువులు తటష్టింప వచ్చును కాని, నిర్దేశ గురువు లభించేవరకు సాధకుని ప్రయాణం కొనసాగుతుంది. ఈ సత్యాన్ని ఓ అమెరికన్ భక్తుని ( డికిన్సన్ ) అనుభవాన్ని ఇచట పరిశీలించెదము. ఇది చాల ఆశ్చర్యకరమైన విషయము కావున పాఠకభక్తులతో పంచుకొంటున్నాను. ఈ సంఘటనలో ముఖ్యంగా ముగ్గురు పాత్రధారులు, ఓ అమెరికన్ భక్తుడు మరియు యిద్దరు జగత్విఖ్యాత మహనీయులు. వారు స్వామి వివేకానంద మరియు పరమహంస యోగానంద. ఇక ప్రస్తుత విషయానికొస్తే డికిన్సన్ మాటల్లోనే వాని అనుభవిషయాలు తెలిసికొందాము. " ఆరంభం మహా అద్భుతం. నేను 15 అడుగుల నీటిమడుగులో మునిగిపోతున్నాను. అన్నయ్య అటకాయితనంగా నన్ను నీటిలోకి తోశాడు. మాది అమెరికా నెబ్రాస్కా రాష్ట్రంలో...