" నేను నీగురువును కాను! "

శ్రీసాయినాథాయనమః
స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా వారి ఘనతను స్మరించుకొందాము. " నేను నీగురువును కాను! " స్వామి ఓ అమెరికన్ భక్తుని ( Mr.E.E.Dickinson) తో అన్నమాటలు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకులకు దైవనిర్ణయంచే ఓ సద్గురువు లభిస్తాడు అనెడి సత్యము చాలామందికి అనుభవ విషయము. భక్తుని మార్గంలో వేరు వేరు సమయాలలో వేరువేరు గురువులు తటష్టింప వచ్చును కాని, నిర్దేశ గురువు లభించేవరకు సాధకుని ప్రయాణం కొనసాగుతుంది. ఈ సత్యాన్ని ఓ అమెరికన్ భక్తుని ( డికిన్సన్ ) అనుభవాన్ని ఇచట పరిశీలించెదము. ఇది చాల ఆశ్చర్యకరమైన విషయము కావున పాఠకభక్తులతో పంచుకొంటున్నాను. ఈ సంఘటనలో ముఖ్యంగా ముగ్గురు పాత్రధారులు, ఓ అమెరికన్ భక్తుడు మరియు యిద్దరు జగత్విఖ్యాత మహనీయులు. వారు స్వామి వివేకానంద మరియు పరమహంస యోగానంద. ఇక ప్రస్తుత విషయానికొస్తే డికిన్సన్ మాటల్లోనే వాని అనుభవిషయాలు తెలిసికొందాము. " ఆరంభం మహా అద్భుతం. నేను 15 అడుగుల నీటిమడుగులో మునిగిపోతున్నాను. అన్నయ్య అటకాయితనంగా నన్ను నీటిలోకి తోశాడు. మాది అమెరికా నెబ్రాస్కా రాష్ట్రంలోని ఓ చిన్న పల్లెటూరు. అప్పటినావయసు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. రెండవసారి మునక వేయబోతున్నాను. అంతలో ఓ అద్భుతం జరిగింది. ఇంద్రధనస్సు జిలుగులతో మిగుల ప్రకాశవంతమైన కాంతి ఆ ప్రాంతాన్ని నింపివేసింది. ఆ కాంతిగోళమధ్యలో ప్రశాంతవదనంతో అభయం ప్రసాదించే చిరునవ్వుతో ఓ వ్యక్తి దర్శనమిచ్చాడు. మూడవసారి మునగబోవు క్షణంలో మాఅన్న మిత్రుడు పక్కనున్న పొడవాటి సన్నని చెట్టుకొమ్మని ఆశకొల్పోయిన నా చేతివేళ్ళకందునంత వరకు నీటిపైకి వంచాడు. అక్కడున్న బాలురు ఒడ్దుజేర్చి ప్రాధమిక చికిత్సనిచ్చి నా ప్రాణాన్ని కాపాడారు. ఈ సంఘటన జరిగిన పన్నెండేళ్ల తరువాత నా పదునేడవ యేట 1893 సెప్టెంబర్ మాసంలో తల్లితో చికాగో నగరాన్ని సందర్శించాను. అపుడు ప్రసిద్ధ అంతర్జాతీయ మత సమ్మేళనం ఆరంభమైనది. మా అమ్మ, నేను ఆ సభకు వెళుతూ ప్రధాన రహదారిపై నడుస్తున్న సమయంలో, పూర్వపు శక్తివంతమైన కాంతిగోళాన్ని మరల జూసాను. మాకు కొన్నిఅడుగుల దూరంలో పూర్వం కనబడిన అదేమనిషి ప్రశాంగా నడుస్తూ కనిపించాడు. సమీప పెద్ద ఆడిటోరియంలోకి ప్రవేశించి అదృశ్యమయ్యాడు. 'అమ్మా! అతడే మునిగిపోయేటపుడు రక్షించిన మనిషి' అరుస్తూ తల్లితో అన్నాను. మా అమ్మ, నేను త్వరగా ఆ మండపంలోకి ప్రవేశించాము. ఆ ఆగంతకుడు అచటి ఉపన్యాస వేదికపై ఆసీనుడుడైనాడు. అతడు ఇండియా నుండి వచ్చిన స్వామి వివేకానందుడని మేము త్వరలో గ్రహించాము. అత్యద్భుత ప్రసంగానంతరము వారిని వెళ్లికలిసాను. ఎప్పటినుండో పరిచయమున్న స్నేహితునిలా దయాపూర్వకంగా నావంక నవ్వారు. పరిపక్వతలేని ఆ వయసులో ఎలాస్పందించాలో తెలియలేదు. కాని తనశిష్యునిగా నన్నుస్వీకరిస్తారేమోయనే ఊహ మదిలో మెదిలింది. ఆయన నా ఆలోచనలను చదివాడు, ' లేదు బిడ్డ, నేను నీ గురువును కాను. నీగురువు కొంతకాలం పిమ్మట వస్తాడు, నీకొక వెండిగిన్నె బహూకరిస్తాడు, నీవిపుడు భరించలేని ఆశీసులవెల్లువ నీపై కురిపిస్తాడు. " పెద్ద కన్నులతో నా అంతరంగంలోకి చూస్తూ వివేకానందుడన్నాడు. కొన్నిరోజులపిమ్మట చికాగోనగరంనుండి తిరిగివచ్చాను. ఆపై వివేకానందునెన్నడు చూడలేదు. " ఆపై రమారమి 32 సంవత్సరాలు గడిచాయి, కాని డికిన్సన్ కెలాంటి గురువు తటస్థపడలేదు. 1925 సంవత్సరంలో ఓరాత్రి మిగులవేదనతోను, వియోగంతోను నాగునికై దైవాన్ని తీవ్రంగా ప్రార్ధించాను. ఓ మధురసంగీత గానంతో వానికి మెలకువవచ్చింది. గగనతలంపై మనోజ్ఞ దేవతాగణం శ్రావ్య సంగీత వాయిద్యాల నాలపిస్తున్న దృశ్యం వానికనులకు గోచరించింది. క్రమంగా ఆమరపురాని దృశ్యం కనుమరుగయ్యింది. ఆ మరునాటి సాయంకాలం ప్రప్రదంగా డికిన్సన్ లాస్ ఏంజెల్స్ లో యోగానంద ప్రసంగానికాజరైనాడు. తనప్రార్ధన ఫలించి తనకొక గురువు లభించాడని మనసులో తలచాడు. పదకొండేళ్లు 1936 వరకు క్రియాయోగ శిక్షణ పొంది యోగానందని సేవించాడు. వింతగా అదే సంవత్సర క్రిష్టమస్ వేడుకలలో తాను కొద్దికాలం క్రిందట కలకత్తాలో కొన్న వెండిగిన్నెను యోగానంద డికిన్సన్ కు బహూకరించాడు. ఆ విధంగా ఆశ్చర్యంగా వివేకానందుని అసీసు బహుకాలం పిమ్మట ఫలించింది. బహుకాలం యోగాచార్యునిగా కొనసాగి జూన్ 30,1967 లో డికిన్సన్ పరమపదించాడా ధన్యజీవి! శ్రీ సాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! Plese do not miss this vidio!

Comments

  1. Destiny brings the Right Guru as per the temperament of the individual; till that moment the journey continues. Once such Sad-guru is obtained by good fortune, one should serve Him with total Faith and Patience.

    ReplyDelete
  2. Ref for the above post : "Autobiography of a Yogi" by Paramahansa Yogananda.

    ReplyDelete

Post a Comment