అనుకరణ అనర్ధం.
శ్రీసాయినాథాయనమః! అనుకరణ గురించి మాట్లాడుకొనేముందుగా శ్రీ మహాభాగవతములోని ఓ మధుర సన్నివేశాన్ని స్మరించుకొందాము. ఆది మహావిష్ణు శంఖ చక్ర గదా పద్మాలను సదా ధరిస్తాడనేది సర్వులకు తెలిసినవిషయమే. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మదాల్చినపుడు పౌండ్రక వాసుదేవుడను ఓ రాజుండేవాడు. అతడు మూర్ఖుడు, మహా అహంకారి. శ్రీకృష్ణుని పేరుప్రఖ్యాతులు విని తానుగూడ శ్రీకృష్ణునిలా ప్రజలచే పూజింపబడాలని శంఖ చక్ర గదాది ఆయుధములను చేయించుకొని ధరించడము మొదలుపెట్టి ప్రజలు తనను శ్రీకృష్ణునిలా పూజింప నిర్బంధించేవాడు. ప్రజలకీవిషయం చాలవింతగా దోచి వానినంతగా పూజించేవారు కాదు. అందులకాతడో ఉపయామాలోచించి శ్రీకృష్ణుడులేకున్న ప్రజలు తననే కొలుస్తారని శ్రీకృష్ణునిపై దండెత్తి చివరకు మరణిస్తాడు. అర్హతలేని అనుకరణ యెంతటి ప్రమాదకారొగదా! మహాత్ముల, సద్గురువుల జీవితవిధానముల పరిశీలించి, వారిబోధనలను అర్ధం జేసికొని, వారుసూచించిన మార్గంలో పయనించడమెంతో శ్రేయస్కరము కదా! అట్లుగాక కొంతమంది నకిలీగురువులనిగూడ చూస్తుంటాము. వారు సద్గురువుల, మహనీయుల వేషభాషలనెంతో నేర్పుగా అనుసరిస్తుంటారు కాని వారి అంతరంగం అందుకు భిన్నంగా వుంటుంది. ధనార్జన కీర్తిప్రతి...