సద్గురువు- భక్తుల బాధానివారణ !
శ్రీసాయినాథాయనమః పాఠక సాయిభక్తులెల్లరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు! సాయిబాబా శ్రీరామచంద్రుడు కరుణాసముద్రుడు, సర్వులకు వారి రక్షణ సదా లభించుగాక! శ్రీసాయిబాబా సమర్ధసద్గురువులు! భక్తులు తమ మనస్సు వాకు మరియు చర్యలచే తెలిసో తెలియకో చేసిన చెడుకర్మల ఫలితాలనుండి వారిని రక్షించి తమ మార్గంలో నడిపిస్తారు. ఇదే సాయిబాబా యొక్క ముఖ్యఅవతార కార్యంగా శ్రీ సాయి సచ్చరిత్ర లోని అసంఖ్యాక భక్తుల అనుభవాలు ధ్రువపరుస్తున్నాయి. సద్గురువులు తమ శిష్యుల కర్మఫలాలనెలా తొలగించెదరో లేక తగ్గించెదరో తెలిసికొనుట చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. " ఓ యోగి ఆత్మకథ! " గ్రంధంలో శ్రీ పరమహంస యోగానంద, సద్గురువులు తమశిష్యుల దుష్కర్మ ప్రభావములనెలా పోగొట్టెదరో చాలావిఫులంగా వివరించారు. ఆ వివరాలనిచట స్మరించుకొందాము. శ్రీ యోగానంద కాలేజ్ లో చదివే రోజుల్లో తమ గురువు మరియు కొందరు స్నేహితులతో కాశ్మీరు పర్యిటిస్తారు. కాలేజీ తెరియుటచే ముందుగనే బెంగాలు తిరిగి వచ్చేస్తారు. శ్రీ యుక్తేశ్వర్ మరికొంతమంది శిష్యులు తమ పర్యటన కొనసాగిస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే ఓ అశుభవార్త వింటారు యోగానంద. శ్రీయుక్తేశ్వర్ తీవ్రంగా జబ్బుపడ్డారని, ప్రాణ...