Posts

Showing posts from June, 2021

సాయిలీలా విశ్లేషణ - భీమాజీపాటిల్ క్షయరోగ నివారణ.

Image
శ్రీసాయినాథాయనమః! " నా కథలు వినినచో సకలరోగములు నివారింపబడును." శ్రీ సాయిబాబా. భీమాజీ పాటీలు క్షయరోగముక్తుడైన వివరములు శ్రీసాయిసచ్చరిత్రము 13వ అధ్యాయమునుండి గ్రహించడమైనది. ఈ సాయిలీలా మహిమను క్లుప్తంగా నిచట విశ్లేషించుకొనెదము. భీమాజీ పాటీలు మహారాష్ట్ర పూనా జిల్లాలోని నారాయణగామ్ నివాసి. అతడు ఊపిరితిత్తుల వ్యాధిబాధితుడై క్రమంగా క్షయవ్యాధి గ్రస్తుడైనాడు. మందులెన్నివాడినప్పటికీ ఉపశమనము పొందక భగవంతుని తీవ్రంగా ప్రార్ధిస్తాడు. ఆ దీనప్రార్ధన ఫలితమేమోగాని ఆతనికి బాబాకి అత్యంతసన్నిహితభక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ కు ఈ విషయమై లేఖవ్రాయు సంకల్పం కలుగగా వివరములతో ఉత్తరంరాస్తాడు. సాయి సాయం స్నేహితులు, శ్రేయోభిలాషుల ద్వారా లభించునటుల సాయిబాబాను శరణువేడమని భీమాజీకి నానానుండి లేఖ వస్తుంది. ఆపై భీమాజీ కుటుంబీకులు వానిని శిరిడీకి దెచ్చి ద్వారకామాయిలోని బాబాముందు కూర్చుండబెట్టారు. అదేసమయంలో నానా, శ్యామా మున్నగు భక్తులుకూడ అచటనేయుండుట కాకతాళీయం గావచ్చు. పాటిలును చూడగానే బాబా వానిజబ్బు పూర్వజన్మ కర్మఫలంబని, తానేమి జోక్యముఁజేసుకోనని జెప్పారు. బాబా సర్వాంతర్యామి మనుజుల జన్మలు, కర్మలు సర్వము వా...