Posts

Showing posts from July, 2021

గురుపూర్ణిమ.

Image
శ్రీసాయినాథాయనమః నేడు పవిత్ర గురుపూర్ణిమ. గురుపూర్ణిమ పరిపూర్ణ సద్గురుతత్వానికి, జ్ఞానానికి సంకేతమని విజ్ఞులు చెబుతారు. విష్ణుభగవానుని అంశగా జన్మించిన వేదవ్యాసమహర్షి ఇదేసుదినమున ఆవిర్భవించుటచే ఈరోజు వ్యాసపూర్ణిమగా ప్రాచుర్యము పొందినది. గౌతమబుద్ధుడు పూర్ణిమరోజునే జన్మించాడు, పూర్ణిమరోజునే నిర్వాణము లేక ఆత్మసాక్షాత్కారం పొందాడు మరల పూర్ణిమరోజునే నిర్యాణం చెందాడు. పవిత్రసిక్కుమత స్థాపకుడు గురునానక్ పూర్ణిమదినముననే అవతరించాడు. ఈవిధంగా పూర్ణిమ వ్యక్తియొక్క ఆధ్యాత్మిక జీవనంలో ప్రముఖ సంకేతస్థానాన్ని సంతరించుకొంది. సమర్ధసద్గురు శ్రీసాయినాథులు స్వయంగా భక్తులకు చేసుకోమని చెప్పినది గురుపూర్ణిమ పండుగను మాత్రమే! ప్రస్తుతవ్యాసంలో శిరిడీలో జరుగుగురుపూర్ణిమ యెలా ఆరంభమైనదో తెలుపు వివరాలను పరిశీలించెదము. పూజ్య ఆచార్యభారద్వాజ మాస్టరుగారు రచించిన శ్రీసాయిలీలామృతమునుండి ప్రస్తుత విషయములను గ్రహించడమైనది. " ఓరోజు 1908వ సంవత్సరములో, పండరినుండి వచ్చిన కృష్ణాజీ నూల్కర్ చావడిలో వున్నాడు. బాబా శ్యామాతో " ఆముసలయ్య (నూల్కర్) ను ధునివద్ద స్తంభాన్ని పూజించుకొమ్మని చెప్పు " అని అతడు చెప్ప...

సాయిలీలా విశ్లేషణ - పదిజన్మల బాధేల ? పదిరోజులే చాలు.

Image
శ్రీసాయినాథాయనమః " Before you act you have freedom, but after you act, the effect of that action will follow you whether you want it to or not. That is the law of karma. You are a free agent, but when you perform certain act, you will reap the results of that act. " Paramahansa Yogananda, SRF Lessons. శ్రీసాయిబాబ అనంతకరుణాసాగరులు. వారిమనసు నవనీతం, భక్తుల బాధలకు కష్టాలకు కరిగిపోతుంది. వారిదానగుణమెన్నదగినది. భక్తులు తమకిచ్చే ప్రతి రూపాయకు తాను పదిరూపాయలిస్తానని, వారు తమవైపుకు ఒక్క అడుగువేస్తే తాను వారివైపుకు వంద అడుగులు వేస్తానని ప్రతిఙ్ఞజేసియున్నారు. ఆవిధంగా సాయిభక్తిమార్గంలో పయనించేవారి ఆయురారోగ్య ఐశ్వర్యములు మిగుల వృద్ధినొందుట పెక్కుభక్తుల అనుభవం. ఈ సందర్భంలో మనమొక ప్రత్యేక విషయం గమనిస్తాము. అదేమంటే భక్తుల సేవకు పెక్కురెట్లు ప్రతిఫలమిచ్చినరీతిగా భక్తులబాధలను పలురెట్లుగా తగ్గిస్తామనెడి బాబా అభయవాక్యము. ఈ సత్యాన్ని ధ్రువపరిచే ఓ భక్తుని అనుభవం శ్రీసాయిసచ్చరిత్ర 34వ అధ్యాయంలో చూస్తాము. ప్రస్తుతమా లీలను విపులీకరించుకొనిదెము. డాక్టరు పిళ్లే సాయిబాబాకు అత్యంత సన్నిహిత భక...