సాయిబాబా- నిత్యసత్యుడు, అనంతశక్తిస్వరూపుడు.
శ్రీసాయినాథాయనమః! పాఠకభక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు! శ్రీసాయిబాబా శివ, శక్తి తత్వముల తనలో పరిపూర్ణముగ నింపుకొన్న మహాశక్తిస్వరూపుడు! నేడు బాబా మహాసమాధిచెందిన పుణ్యతిధి, 103 సంవత్సరములపూర్యము బాబా తమభౌతికరూపము చాలించారు. కాని సాయిబాబా నిత్యసత్యులు, ఈవిషయమై ముందుగా శ్రీసాయిసచ్చరిత్రము ఉపోద్ఘాతమున చెప్పబడిన కొన్ని అక్షరసత్యవాక్యముల స్మరించెదము. శ్రీ బీ.వీ . నరసింహస్వామిగారు తమ 'భక్తులయనుభవములు' పుస్తకము మొదటిపేజీలో ఓ హైకోర్టు జడ్జిగారి యనుభవమిలా వ్రాసారు. " నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను. 1918వ సంవత్సరములో వారుసమాధిచెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనటులే భావించుచున్నాను. నాకుమాత్రము వారు సమాధిచెందినట్లు లేరు. నాదృష్టిలో వారు అన్నిపరిమితులకు అతీతులు. వారు మామధ్య యున్నప్పుడు వారిమానవశరీరము మాకనులముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడది మాదృష్టిని విశేషముగా నాకర్షించెడిది. కాని ఎక్కువభాగము మా ఎరుకలో నిలబడినదిమాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము-అశాశ్వతముల అద్భుతసమ్మేళన రూపమైన యొక మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు.అశాశ్వతమైన తమమానవ...