Posts

Showing posts from January, 2022

కల్పతరు.

Image
శ్రీసాయినాథాయనమః!నేడు శ్రీస్వామివివేకానంద జయంతి! Happy Youth Day. " భగవంతుడు సర్వ జీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తననుండి జీవులందరికీ దేహాలు, పోషణ యిచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వ శాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టినీ తన అధీనంలో ఉంచుకోవడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. భూమిమీద తన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినపుడు తననాశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు,చింతామణి అవుతాడు." శ్రీసాయి లీలామృతము. శ్రీసాయిసచ్చరిత్ర గ్రంధంలో సాయిబాబాను ఆశ్రితుల కోర్కెలదీర్చెడి కల్పతరువుగా రచయిత హేమాద్రిపంతు వర్ణించాడు. వివిధ కోర్కెలతో బాబాను చూడవచ్చినవారలగూర్చి, అలా వచ్చుట సబబా యన్న ఓ భక్తునితో బాబా, " మొదట అందరు అలానేవస్తారు, ఓ స్థాయిచిక్కినపిమ్మట నా మార్గంలో నడుస్తారు." యని అన్నారు. బాబా వివిధ భక్తుల బాధలను అవసరాలను దీర్చెడివారు. అన్నవస్త్రాల గూర్చెడివారు, రోగనివారణ జేసెడివారు, సంతాన సౌభాగ్యములు ప్రసాదించెడివారు. సత్వగుణముల పెంపొందించి చక్కటి నడవడి నేర్పెడివారు. అజ్ఞ...