రక్షకుడు.
శ్రీసాయినాథాయనమః. Wishing all the fathers a vey happy Father's Day. సాయిబాబా కరుణాసాగరుడు, భక్తవత్సలుడు,ఆపద్బాంధవుడు,అనాదరక్షకుడు. ఆ మహామహితాత్ముని లీలల కొన్నింటినిచట స్మరించెదము. " లేదు,అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని. నేనిచటనే యున్నాను. పాముచేత కప్పనెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే యున్నానా ? " ఓ ఆగంతుకునితో బాబా అన్న మాటలివి. కర్మఫలంచే కప్పగాజన్మించి శత్రు పామునోటబడ్డ చెన్నబసప్ప పూర్వజన్మలో తన బద్ధ విరోధియైన వీరభద్రప్ప బారినుండి తప్పించుకొనుటకై బాబాను ఆశ్రయించి వారి ఆశీసుల పొందాడు. మాటనిలుపుకొనుటకై బాబా సమయానికివెళ్ళి కప్పనురక్షించాడు. జన్మజన్మల రక్షణ సాయిదేవునిది. శ్రీమతి సదాశివ్ తార్కాడ్ కళ్ళపోటుతో సాయిని దర్శించింది. ఆయన కొద్దిక్షణాలు ఆమె కళ్ళలోకి చూచారు. అప్పటికప్పుడే ఆమె కళ్ళ పోటు తగ్గిపోయింది. నీరు కారడం ఆగిపోయింది. కాని బాబాకనులవెంట నీరు కారసాగింది. ప్లేగువ్యాధిచే మిగుల బాధపడుచున్న తనకురుమారునికై సాయిని ఆశ్రయించినది శ్రీమతి ఖాపర్డే. క్షణాల్లో నాలుగు పెద్దబొబ్బలను తమదేహంపైకి తీసుకొని ఆమెబిడ్డను రక్షించారు సాయినాథులు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక భ...