Posts

Showing posts from July, 2022

ఈశోపనిషత్తు పరంగా శ్రీసాయిబాబ స్థుతి.

Image
శ్రీసాయినాథాయనమః. పాఠక భక్తులెల్లరకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు, సాయిబాబా దివ్యాశీసులు! సర్వజ్ఞత సర్వవ్యాపకత సర్వశక్తిమంతమునైన నైన ఆ పరబ్రహ్మ శక్తి సదా పరిపూర్ణమైనది. రూపరహితమైన బ్రహ్మమునుండి మానుషరూపం దాల్చి శిరిడీలో సాయిబాబాగా నడయాడిన పరాశక్తి పరిపూర్ణమైనది. హే సాయినాథా! పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో నలంకారమూగ నీవు ఉద్భవించినావు. మహాసమాధియనంతరము నిరంతరం కొనసాగుతున్న నీ నిర్గుణ నిరాకార శక్తి పరిపూర్ణమైనది. హే పరాత్పరా, సాయిదేవా శరణు శరణు. అశాశ్వితము సదా పరిణామశీలమైన జగత్తులో సంపూర్ణ త్యాగనిరతితో నీవు జీవించినావు. నీ త్యాగబుద్ధి అద్భుతము అమోఘము. దీన జనోద్ధరణమే నీ అవతార కార్య రహస్యము. నీవు నిష్కళంక కర్మయోగివి. భక్తులనుండి ఒక్కటిపొంది వారికి పదింతలగ , నూరింతలగ సాయముగూర్చు దానశీలి శరణు శరణు. నీదివ్యశక్తి,సృష్టి నడుపునట్టి ఆత్మస్థితి. సర్వజీవరాశులయందు చైతన్యరూపుడవై విరాజిల్లు ఓ సాయినాథా శరణు శరణు. ఉపనిషత్తులు ఆత్మఒక్కటిగా పేర్కొన్నవి. ఆత్మ కదలదు, కాని మనసుకన్నా వేగంగా చరించును. ఇంద్రియములకు పట్టుబడదు. చలనరహితముగా నిలబడినను పరుగులెత్...