Posts

Showing posts from August, 2022

అప్పడమువెనుక దాగిన వేదాంతభావము.

Image
శ్రీసాయినాథాయనమః. శ్రీరమణ దేవాయనమః. పాఠక భక్త మహాశయులెల్లరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు! " నన్ను వెదుకుటకు నీవు దూరముగాని మరెచ్చటికిగాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్నిజీవులలోను , చైతన్యము లేదా యంతరాత్మయని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము." శ్రీ సాయిబాబా. " ఓ అర్జునా! నేను సకలభూతములయొక్క హృదయ కమలమందుండు ప్రత్యగాత్మ(Self)ను, సమస్తభూతములయొక్క ఆది మధ్యాంతములును నేనే". భగవద్గీత 10:20. క్లుప్తంగా శ్రీకృష్ణపరమాత్మ సందేశమునీవిధంగా గ్రహింపగలము,' ప్రతిమనిషి, తన దేహానికి , మనసుకు, బుద్ధికి మరియు అహంకారానికి అతీతంగా లోలోపరి పొరలలో దాగిన సత్ చిత్ ఆనంద రూప భగవంతుని ఉనికిని సాధనద్వారా గ్రహించి ఆపై ఆత్మానుభవము లేక ఆత్మసాక్షాత్కారము పొందుటయే మానవజన్మ పరమార్ధము'. తమభక్తులెల్లరు ఈ అనుభవాన్ని పొందుటకు, భగవాన్ శ్రీరమణమహర్షి ఓ చక్కని సాధనామార్గాన్ని క్రిందివిధంగా అప్పడరూపంలో సూచిస్తున్నారు. ప్రస్తుత అప్పుడపు కథ భగవాన్ శ్రీ రమణ మహర్షికి వారి దివ్యజనని అలగమ్మాళ్ కు మధ్యజరిగిన జ్ఞానసందేశమ...

గోధుమలు విసరుట, వేదాంతభావము. (The significance of Saibaba grinding wheat.)

Image
శ్రీసాయినాథాయనమః. నేడు శ్రావణిపూర్ణమి, 1912 ఈ పవిత్ర తిధినాడు సాయిబాబా ఆశీసులతో గురుస్థానమువద్ద బాబాపాదుకలు ప్రతిష్టింపబడ్డాయి. శ్రీసాయిసచ్చరిత్ర పావన గ్రంధంలో శ్రీసాయిబాబా తాము ద్వారకామాయిలో నివసించిన షుమారు 60 సంవత్సరముల కాలం తిరుగలిలో గోధుమలు విసిరినారని గ్రంధకర్త శ్రీహేమాడపంతు పేర్కొన్నాడు. ఇపుడు తిరుగలి, గోధుమలు, విసరుట, గోధుమపిండి వీని వెనుకనున్న వేదాంతభావమును పరిశీలించెదము. రచయిత ఈవిషయమై వేదాంతభావమును కొంతవివరించినా మరింత లోతుగా ఈ విషయమై తెలిసికొనుటకు జేసిన ప్రయత్నమే ఈ ప్రస్తుత వ్యాసరచన ముఖ్యోద్దేశము. పాఠక భక్తులు తమతమ ఆలోచనలకనుగుణంగా ఈవిషయాన్ని గ్రహించగలరు. బాబా విసరినది ముడి గోధుమలు, వాటిలో జీవమున్నది, అనుకూలపరిస్థితులలో తిరిగి మొలకెత్తి మరిన్నిగోధుమల నుత్పత్తికి కారణభూతము కాగలవు. కాని గోధుమలనొకసారి విసరి పిండిజేసిన వానిలో జీవము నశించి మొలకెత్తు పటిమ కోల్పోబడుతుంది. ఈ విషయంవెనుక దాగిన తత్వమేమిటి? ముడి గోధుమలు వ్యక్తుల అహంకారమునకు, పుణ్యపాప కర్మలకు, ఆయా కర్మఫలములకు విషయవాసనలకు, లోదాగిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది శత్రువులకు సంకేతము. గోధుమలు మొలకెత్తే విధంగా మన...