Posts

Showing posts from September, 2022

ఉత్తమ గురుసేవ.

Image
శ్రీసాయినాథాయనమః! భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లవేళలా అనన్యభక్తితో తననే సేవించాలని మరియు ఆలా సేవించు వారల యోగక్షేమములను తాను వహిస్తానని అర్జునికి బోధించాడు, ప్రస్తుత వ్యాసంలో శ్రీసాయిబాబా తమ గురువునెలా సేవించారో వివరించుకొనెదము. ప్రప్రధమంగా బాబా భక్తులు, తమనెలా సేవించాలో యెచ్చటను ప్రత్యేకించి వివరించలేదు. కాని బాబావారి చర్యలు, సామాన్యసంభాషణలు మరియు వారి పావనచరితములు మౌనముగా ప్రబోధము జేయుచు తమభక్తుల ఉన్నతమార్గముల నడిపించుచున్నవి. అలా సాయి, చెప్పకచెప్పిన అమూల్య సందేశాలనిచట స్మరించుకొనెదము. ప్రస్తుత విషయమునకు శ్రీసాయిసచ్చరిత్రము మూలము. సచ్చిష్యునకు అణకువ, అభిమానరాహిత్యము, ఇంద్రియనిగ్రహము, ఏకాగ్రచిత్తము, గురువుపై పరిపూర్ణవిశ్వాసము, గురువాక్యపాలన, సదాగురుస్మరనయే దప్ప ఇతర ఆలోచనల రానీయకుండుట మరియు తుదకు సర్వస్యశరణాగతి అనగా తమకు తామే గురునకు సంపూర్ణ ఆత్మార్పణము జేయుట. ఈ విశేష ఉత్తమ శిష్యలక్షణములు బాబాయందెలా ప్రతిబింబించాయో తెలిసికొనుట సాయిని సేవించు భక్తులకు మార్గదర్శకములు కాగలవనే ఆలోచనే ఈ ప్రస్తుత రచనకు ప్రేరణయని పాఠక భక్తులు గ్రహింపగలరని ఆశిస్తున్నాను. జౌహర్ ఆలీ ఒక కపటగుర...