Posts

Showing posts from October, 2022

సద్గురువు-ఓవర్ డ్రాఫ్ట్.

Image
శ్రీసాయినాథాయనమః. పాఠక భక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు, సాయిబాబా ఆశీసులు! సద్గురువు అలౌకిక బ్రహ్మజ్ఞానానికి, దైవత్వానికి ప్రతీక; ఓవర్ డ్రాఫ్ట్ లౌకిక డబ్బువ్యవహారాలకు సంబంధించిన అంశము. ఈ రెండూ ఉత్తర దక్షిణ ధృవాలలా, నీరూ నిప్పులా పరస్పరం వ్యతిరేక విషయాలు. మరీ రెంటికి సమన్వయమెలా కుదురుతుంది యనే సందేహం సాధారణంగా కలుగుతుంది. ఈ క్రిందటి వివరణ పరిశీలించిన పిమ్మట అసలు విషయం బోధపడగలదు. సద్గురువు సాక్షాత్తు దైవ స్వరూపుడు, భక్తులపట్ల వాని అవ్యాజ కరుణయే ఇచట పేర్కొనబడిన ఓవర్ డ్రాఫ్టు. ఈ విషయమై పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిలా వచించారు, "సిరిసంపదలు తాను ఆర్జించిన పుణ్యం ధర్మం వల్లనే సంక్రమిస్తాయి. అది బ్యాంకు బ్యాలన్స్ లాంటిది. తానేమీ ఇవ్వకుండా, దానధర్మాలు చేయకుండా అవినీకు ప్రసాదించమని బాబాను కోరడం చిత్రాతిచిత్రం. ఈశ్వర సహాయం ఎప్పుడు? మనము ఇతరులకు సహాయ పడ్డప్పుడు మాత్రమే! సిరిసంపదలు కేవలం సుఖాలకు వెచ్చిస్తే అవి వ్యర్ధమే. అయినా అట్టి గత పుణ్యం లేకపోయినా, బాబాను ఆశ్రయించాము కనుక తిండికీ,గుడ్డకు ఓవర్ డ్రాఫ్ట్ శాంక్షన్ చేయించి, కరుణించటము ఆ ప్రేమమూర్తి అపార కరుణకు నిదర్శనము. ...