Posts

Showing posts from December, 2022

మహామానవతామూర్తి శ్రీసాయిబాబా !

Image
శ్రీసాయినాథాయనమః. ముందుమాట. 1990-98 ప్రాంతంలో ఉద్యోగపరంగా ప్రయాణనిమిత్తమై తరచు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళేవాణ్ణి. అచటనున్న అన్నిరకాల స్టాల్ల్స్ లో శిరిడీసాయి బుక్ స్టాల్ నన్నెంతో ఆకర్షించేది. స్టాల్ అనడంకంటే ఓ చిన్న బాబాగుడి అంటే బాగుంటుందేమో! షాప్ వెలుపల ఓ పెద్ద బాబా ఫోటో, లోపల అనేక బాబా చిత్రపటాలు, అగరువత్తుల పరిమళాలు, చిన్న చిన్నదీపాల వెలుగు వరుసలు. అచటనున్న కాసేపు స్టేషన్ అనే భావమేమాత్రం కలిగేదికాదు. షాప్ యజమాని సుమారు 55 యేండ్లు పైబడిన పెద్దాయన. పొడుగాటి గెడ్డం, వ్యాపార దృష్టిలేని వ్యవహారశైలి, హృదయమంతా సాయిని నింపిన భక్తిభావం. ఆయన్ను చూడగానే చాల గౌరవభావం కలిగేది. తరచుగా కలియుటచే, చొరవతో ఓ పర్యాయం బాబాపట్ల అలాంటి భక్తిశ్రద్ధ లెలా కలిగాయని కుతూహలంతో ప్రశ్నించాను. క్లుప్తంగా తన యనుభవమిలా చెప్పాడు. తాను కేరళనుండి వచ్చానని , మొదట్లో కమ్యూనిస్టు పార్టీ భావజాలం నింపుకున్న పరామనాస్తికుడనని, కాని బాబాగురించి విన్నాక, చదివాక మరియు స్వానుభవంతో బాబాను తన యాలోచనలకు అతిదగ్గరైన మానవతావాదిగా గ్రహించానని క్రమంగా సాయిబాబా జీవితం, తనపై పెను ప్రభావం చూపిందని, సాయిలోని అత్త్...