సద్గురుకృప-ఆత్మానుభూతి
శ్రీసాయినాథాయనమః ఆత్మానుభవము లేక ఆత్మసాక్షాత్కారము పొందిన మహాత్ముడే సద్గురువు. అట్టి యనుభూతిని పరిపక్వత నొందిన తన శిష్యులకు సులువుగా అందింపగలడు సద్గురువు. అదియే శిష్యునకు లభించే అత్యుత్తమ గురుకృప. శ్రీసాయిబాబ, శ్రీరామకృష్ణ పరమహంస మరియు శ్రీయుక్తేశ్వరులు గడచిన ఒకటి రెండు శతాబ్దాలకాలంలో పవిత్ర భారతావని ప్రభవించారు.ఆయా మహనీయులు తమ ధర్మాచరణ, బోధామృతములచే సమాజంలోని సామాన్యులనుద్ధరించి వారిని మానవతా విలువలతో కూడిన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుటకు చక్కటి మార్గాల నేర్పరచారు. యోగ్యులైన శిష్యులకు తమశక్తి సామర్ధ్యాదుల సయితం వెచ్చించి, వారిని తమయంతటి వారలగా తీర్చిదిద్దారు. అపార సద్గురు గురుకృపకది నిదర్శనము. అనుపమాన సద్గురు గురుకృపామృతమునాస్వాదించిన కొందరి శిష్యాగ్ర గణ్యుల యనుభవములనిచట స్మరించుకొనెదము. వారి ఆయా అనుభవములు సాధారమనుజలమైన మనలకు సత్యదృష్టి, నిత్యానిత్య వివేకముల ప్రసాదింపగలవు. సత్యాసత్యా విచక్షణచే మానసిక దౌర్బల్యం తొలగి దుఃఖనివృత్తి కాగలదు. సమర్ధసద్గురు సాయినాథులు తమభక్తులకందించిన భావాతీత యనుభవములు కొన్నింటిని శ్రీసాయిసచ్చరిత్రములో వర్ణింపబడినవి. శ్రీసాయిసచ్చరిత రచయిత హేమాడ్ ప...