Posts

Showing posts from March, 2023

అంతర్యామి (స్వానుభవము)!

Image
శ్రీసాయినాథాయనమః. శ్రీసాయిబాబ సర్వాంతర్యామి,సర్వహృదయవాసి. భక్తుల ఆశలు,ఆలోచనలు వారికి కరతలామలకములు. వారి రక్షణ అశీసులు తక్షణమే! శ్రీసాయిసచ్చరిత్రలోని భక్తుల పెక్కు యనుభవవములు, విశ్వవ్యాపకంగా నిరంతరం కొనసాగెడి వారి లీలలు, మహిమలే యిందులకు సాక్ష్యములుగా తలుపవచ్చును. ఈసందర్భమున శిరిడీలో జరిగిన ఓ చిన్నస్వానుభవాన్ని, పాఠకులతో పంచుకోవడం ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆ రోజు సోమవారము ఫిబ్రవరి 20,2023. వేకువజామునే మేల్కొని కలసి వచ్చిన సోదరుడు నేను కాకడ ఆరతికై పావన సమాధి మందిరానికెళ్ళాము. కాకడ ఆరతి సమయాన కలిగే ఆనందం, మనసు పొందే ప్రశాంతత మాటలకందని మధురానుభూతి. ఎన్నిసార్లు వీక్షించినా ఆ యనుభూతి కొత్తగానే తోస్తుంది. అచటనే కొనసాగాలని మనసు కోరుకొంటుంది. ఆరోజు ఆరతి అనంతరం మెల్లగా మందిరం వెలుపలికొచ్చాము. అలా బయటకొచ్చే సమయాన మనసులో ఓ చిన్న ఆలోచనొచ్చింది. కాకడ ఆరతి యనంతరం వెన్న చక్కెర కలిపిన బాబా నైవేద్యం భక్తులకు పంచుతారు. వేరే లైన్లో వుండటం వలన మాకా ప్రసాదం అందలేదు. అయ్యో, ప్రసాదం పొందలేకపోయామనే చిరుపాటి నిరుత్సాహం మనసులో మెదిలింది. కాని అప్పటికే బయటకొచ్చాము గాబట్టి ప్రసాదం లభించే అవకాశం లేదు. ...