అంతర్యామి (స్వానుభవము)!

శ్రీసాయినాథాయనమః.
శ్రీసాయిబాబ సర్వాంతర్యామి,సర్వహృదయవాసి. భక్తుల ఆశలు,ఆలోచనలు వారికి కరతలామలకములు. వారి రక్షణ అశీసులు తక్షణమే! శ్రీసాయిసచ్చరిత్రలోని భక్తుల పెక్కు యనుభవవములు, విశ్వవ్యాపకంగా నిరంతరం కొనసాగెడి వారి లీలలు, మహిమలే యిందులకు సాక్ష్యములుగా తలుపవచ్చును. ఈసందర్భమున శిరిడీలో జరిగిన ఓ చిన్నస్వానుభవాన్ని, పాఠకులతో పంచుకోవడం ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆ రోజు సోమవారము ఫిబ్రవరి 20,2023. వేకువజామునే మేల్కొని కలసి వచ్చిన సోదరుడు నేను కాకడ ఆరతికై పావన సమాధి మందిరానికెళ్ళాము. కాకడ ఆరతి సమయాన కలిగే ఆనందం, మనసు పొందే ప్రశాంతత మాటలకందని మధురానుభూతి. ఎన్నిసార్లు వీక్షించినా ఆ యనుభూతి కొత్తగానే తోస్తుంది. అచటనే కొనసాగాలని మనసు కోరుకొంటుంది. ఆరోజు ఆరతి అనంతరం మెల్లగా మందిరం వెలుపలికొచ్చాము. అలా బయటకొచ్చే సమయాన మనసులో ఓ చిన్న ఆలోచనొచ్చింది. కాకడ ఆరతి యనంతరం వెన్న చక్కెర కలిపిన బాబా నైవేద్యం భక్తులకు పంచుతారు. వేరే లైన్లో వుండటం వలన మాకా ప్రసాదం అందలేదు. అయ్యో, ప్రసాదం పొందలేకపోయామనే చిరుపాటి నిరుత్సాహం మనసులో మెదిలింది. కాని అప్పటికే బయటకొచ్చాము గాబట్టి ప్రసాదం లభించే అవకాశం లేదు. అలా వెలుపలికొచ్చి పవిత్ర గురుస్థానానికి ప్రదక్షిణ జేసి సమీప బాబా మ్యూజియం లో ప్రవేశించాము. బాబావాడిన అప్పటి వస్తువులన్నిటిని చిన్నచిన్న గదులలో చక్కగా భద్రపరిచారు. వేరేభక్తులుకూడా వీక్షిస్తున్నారు. రెండుమూడు నిమిషాలలా చూస్తూ నడచినపిమ్మట, సుమారు నలుబదేండ్లు పైబడిన ఓ పొట్టిపాటి వ్యక్తి వచ్చాడు. తలపై ఉన్ని టోపీ, మ్యూజియంలో పనిజేసే ఉద్యోగిలా గున్నాడు. నవ్వుతూ సమీపించి తన అరచేతిలోని వెన్న చక్కెర ప్రసాదాన్ని వేరొక చేతి వేలితో తీసి నావద్దకొచ్చి ప్రసాదమంటూ నా అరచేతిలో పెట్టాడు. ఆరతి దర్శించుకొని వస్తున్నానన్నాడు. నాకొకపక్క ఆశ్చర్యం,మరోపక్క ఆనందం. క్షణాల్లోజరిగినఈ ఉత్సాహాన్ని మనసులోనే దాచుకొని వాని వివరాలడిగాను. తనపేరు ముంగీయో అలాంటి పేరేదో చెప్పాడు. మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. చిరు దక్షిణ సమర్పిస్తే సంతోషంగా స్వీకరించాడు. అరచేతిలోని ప్రసాదాన్ని సమీపానున్న తమ్మునితో పంచుకొని అంతర్యామి సాయిదేవునికి అనంతకోటి నమస్కారములు మనసులోనే అర్పించుకొన్నాను. ఈ యనుభవ వ్యాఖ్యానం పాఠక భక్తుల యోచనకే వదలివేయడమైనది. సద్గురుసాయినాథు లిలాంటి లీలానుభూతిని పవిత్ర గురుస్థానం వద్ద నవంబర్ 2011ఉదయం కాకడ ఆరతి అనంతరం కలిగించారు. వివరాలకు saileelatelugu.blogspot.com, dated August 24,2018 చూడగలరు. శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
" నేను అందరి హృదయాల పాలించువాడను.అందరి హృదయాలలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే! " సాయిబాబా, శ్రీసాయిసచ్చరిత్రము.
🌼 The Day of the Leela – February 20, 2023 It was a Monday. We rose in the early hours of dawn. Together with my brother, I walked to the holy Samadhi Mandir to attend the blessed Kakad Aarti. The joy that Kakad Aarti brings… the deep peace it pours into the heart… words cannot contain that sweetness. No matter how many times one sees it, the experience always feels new, fresh like the first fragrance of a flower. The mind longs to remain there forever. After Aarti ended, we slowly stepped outside. And as we were walking out, a small thought arose in my mind: “After Kakad Aarti, Baba’s butter-and-sugar prasad is distributed. Because we stood in another line, we did not receive it today.” A faint disappointment touched my heart— that we could not receive that sacred prasad. But since we had already stepped outside, there was no chance to get it now. We continued walking, circumambulated the holy Gurusthan, and then entered the Baba Museum nearby. Every object Baba had used was carefully preserved in the little rooms there. Many devotees were moving around, observing quietly. After two or three minutes, as we kept walking, a short, stout elderly man— perhaps in his forties—approached us. He wore a woollen cap and looked like an employee of the museum. With a gentle smile, he came near and lifted the butter-sugar mixture that lay on his palm, and with the finger of his other hand he placed a portion of it into my hand saying, “Prasad! I just attended the Aarti.” For a moment I was stunned— half wonder, half joy. This happened in just a few seconds, as if arranged by Baba Himself. I softly asked him who he was. He said his name—something like “Mungeeyo.” My heart filled with gratitude. When I offered a small dakshina, he accepted it happily. I shared a little of the prasad with my younger brother beside me, and in silent awe I offered countless namas to the Antaryami Sai— the Sai who lives in every heart and moves all things according to His will. I leave the interpretation of this experience to the loving hearts of the devotees who read it. A similar leela, a similar divine touch from Sai, had blessed me earlier as well— at the sacred Gurusthan, after Kakad Aarti, on a morning in November 2011. For more details, see: saileelatelugu.blogspot.com — dated August 24, 2018. May Sri Sai’s rays of compassion fall upon one and all. May all be blessed always! Om Sai, Sri Sai, Jai Jai Sai! Quotation from Sri Sai Satcharitra “I am the ruler of all hearts. I dwell within every being. I protect the countless moving and unmoving creatures of this world. I am the One who conducts the play of this universe— I am the Master of its strings.” — Sri Sai Baba, Sri Sai Satcharitra

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)