అవిధేయతా నీమూల్యమెంత?
శ్రీసాయినాథాయనమః. దైవసన్నిధి జేరుటకు సద్గురుశరణాగతి మిగుల ఆవశ్యకము. భక్తుని భగవంతుని కళ్యాణానికి పురోహితుడు గురువని శ్రీరామకృష్ణ పరమహంస వచించారు. భగవత్ప్రాప్తికి మార్గదర్శి సహాయము తప్పనిసరియని శ్రీసాయిబాబా నొక్కివక్కాణించారు. మరి అలాంటి సద్గురుని సాయమందుటకు భక్తులకు వారిపట్ల వినయవిధేయతలు, శ్రద్ధావిశ్వాసాలు తప్పనిసరి లక్షణాలుగా యుండవలెను. సాయిబాబా శ్రద్ధా,సబూరి యను రెండునాణెముల సమర్పించి తమ గురుని సేవించారు. వారిప్రతిభకు తమ గురుసేవయే కారణమని వినయంగా వివరించారు. అదేవిధంగా పెక్కుభక్తులు సాయిని పరిపూర్ణ భక్తివిశ్వాసాలతో సేవించి బహు అనుభవాలను, సాయి రక్షణను పొందారు. ఆయా భక్తుల వివరాలే శ్రీసాయిసచ్చరిత్ర పవిత్రగ్రంధ సారాంశము. ఇందులకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు తమ అజ్ఞానంచే సాయిబాబా పట్ల అవిధేయత ప్రదర్శించి పెక్కు కష్టములు కొనితెచ్చుకొన్నారు. అలాంటి కొందరి అనుభవములు నిచట పరిశీలించెదము. తాత్యా కోతే పాటిలు బాబాకు ప్రాణసమానుడు, అట్టివాడుకూడ ఓ పర్యాయము బాబా మాటను తృణీకరించి కోపర్గామ్ వెళ్లి కష్టాల పాలైనాడు. బొంబాయినుండి ఐరోపా దేశస్తుడొకడు యేదో ఉద్దేశంతో సాయిని దర్శించాడు. కాని బాబా యనుమత...