Posts

Showing posts from July, 2023

శ్రీసాయిబాబ సూత్రాలు, లీలలు.

Image
శ్రీసాయినాథాయనమః. 1)"శిరిడీ ప్రవేశమే సర్వదుఃఖపరిహారము ". శ్రీ బీ.వీ నరసింహస్వామి తన ఇద్దరు పుత్రుల మరణంతో మిగుల దుఃఖితుడై 1936 లో బాబాసమాధి దర్శించి పరమశాంతిని పొందాడు. 2)"ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖసంపదలనొందగలరు". ఓ డాక్టర్ మేనల్లుడు రాచకురుపునుండి ముక్తుడైనాడు. బోడస్,అంబాడేకర్,సాఠే,చోల్కర్ మున్నగు భక్తులు బాబా కృపచే మిగుల సంపదల పొందారు. 3)"ఈభౌతిక దేహానంతరము నేనప్రమత్తుడనే ".దైవం ఉనికిని శంకించే శ్రీ ఎక్కిరాల భరద్వాజ బాబా సమాధివద్ద పరిపూర్ణ శాంతిని,తృప్తిని, తగిన సమాధానాన్ని పొందాడు. 4)"నా భక్తులకు రక్షణ నా సమాధినుండే వెలువడును ". నాగేష్ అనే భక్తుడు సమాధి ప్రక్క గదిలో నిద్రించేవాడు. అప్పుడతనికి,తోటివారికి సమాధినుండి రకరకాల సంగీతం వినిపిస్తుండేది. అంతటితో వారాగదిలో నిద్రించడం మానేసారు. 5)"నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును ". బాబా మహాసమాధి అనంతరం కాకాసాహెబ్ దీక్షిత్ మిగుల వ్యాకుల హృదయుడైనాడు. ఆనందరావు పాఖాడే, శ్యామాల సందేశం ద్వారా బాబా దీక్షితును శాంతపరచాడు. 6)"నా సమాధిన...