శిరిడీ కీడ్చబడిన పిచ్చుక లాలా లక్ష్మీచంద్.
శ్రీసాయినాథాయనమః. "నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి,పిచ్చుక కాళ్లకు దారము కట్టి యీడ్చినటుల అతనిని శిరిడీకి లాగెదను." సాయిబాబా. ఇందులకు లాలా లక్ష్మీచందు అనుభవాలే చక్కని తార్కాణము. ఈవివరాలన్నీ శ్రీసాయిసత్చరిత్రలోని 28వ అధ్యాయమున వివరింపబడినవి. లక్ష్మీచందు బొంబాయి నగర ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. 1910వ సంవత్సరములో క్రిస్మస్ పండుగకు ముందుగా ఓ స్వప్నదర్శనం పొందాడు. గడ్డంతోయున్న ముసలివాని చుట్టూ భక్తులు గుమిగూడియున్నారు. కొన్నాళ్ళపిమ్మట తనమిత్రుని ఇంట జరుగు దాసగణుమహారాజు కీర్తన కార్యక్రమానికి వెళ్లి బాబా ఫోటోచూసాడు. కలలో తాను జూసిన ముసలివాని పోలికలు పటములోని వానికి సరిపోవుటచేతను, దాసగణు తుకారాము కీర్తనాపారవస్యంతోను శిరిడీపోవుటకు మిగుల తపిస్తున్నాడు. బాబా సర్వహృదయ వాసిగదా, లక్ష్మీచందు మనసెరిగి వాని ప్రయాణానికి తగు ఏర్పాట్లు సమకూర్చాడు. అదేరాత్రి మిత్రుడు శంకరరావు వాని తలుపుతట్టి శిరిడీకి వచ్చెదవాయని యడిగాడు. పినతండ్రి కొడుకు 15 రూపాయలు సమకూర్చుటచే వారిప్రయాణం వేగిరమయ్యింది. రైలు ప్రయాణంలో మిత్రునితో భజనజేసినప్పటికీ బాబానుగూర్చి తోటిప్రయాణీకులతో ప్రశ్న...