శిరిడీ కీడ్చబడిన పిచ్చుక లాలా లక్ష్మీచంద్.

శ్రీసాయినాథాయనమః.
"నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి,పిచ్చుక కాళ్లకు దారము కట్టి యీడ్చినటుల అతనిని శిరిడీకి లాగెదను." సాయిబాబా. ఇందులకు లాలా లక్ష్మీచందు అనుభవాలే చక్కని తార్కాణము. ఈవివరాలన్నీ శ్రీసాయిసత్చరిత్రలోని 28వ అధ్యాయమున వివరింపబడినవి. లక్ష్మీచందు బొంబాయి నగర ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. 1910వ సంవత్సరములో క్రిస్మస్ పండుగకు ముందుగా ఓ స్వప్నదర్శనం పొందాడు. గడ్డంతోయున్న ముసలివాని చుట్టూ భక్తులు గుమిగూడియున్నారు. కొన్నాళ్ళపిమ్మట తనమిత్రుని ఇంట జరుగు దాసగణుమహారాజు కీర్తన కార్యక్రమానికి వెళ్లి బాబా ఫోటోచూసాడు. కలలో తాను జూసిన ముసలివాని పోలికలు పటములోని వానికి సరిపోవుటచేతను, దాసగణు తుకారాము కీర్తనాపారవస్యంతోను శిరిడీపోవుటకు మిగుల తపిస్తున్నాడు. బాబా సర్వహృదయ వాసిగదా, లక్ష్మీచందు మనసెరిగి వాని ప్రయాణానికి తగు ఏర్పాట్లు సమకూర్చాడు. అదేరాత్రి మిత్రుడు శంకరరావు వాని తలుపుతట్టి శిరిడీకి వచ్చెదవాయని యడిగాడు. పినతండ్రి కొడుకు 15 రూపాయలు సమకూర్చుటచే వారిప్రయాణం వేగిరమయ్యింది. రైలు ప్రయాణంలో మిత్రునితో భజనజేసినప్పటికీ బాబానుగూర్చి తోటిప్రయాణీకులతో ప్రశ్నించాడు. బాబాకొరకు జామకాయలు కొనదలచి మరువ నెత్తిపై జామపండ్లతో ఓ ముసలమ్మ వాని బండి వెంట పరుగెత్తుకొని వచ్చినది. బాబా సాయం తక్షణమేకదా! మిగుల ఆశ్చ్యర్యపడి జామపండ్లు కొని బాబాను దర్శించి పూజించి మిగుల పరవసించాడు లక్ష్మీచందు. భక్తుల ఆలోచనలన్నీ బాబాకు కరతలామలకములే ! లక్ష్మీచందుకు కలిగిన అనుభవపరంపరను పూసగుచ్చినట్లు జెప్పి వాని మిగుల అబ్బురపరిచాడు బాబా. మధ్యాహ్న భోజనసమయాన ఒక భక్తుడు తనకిష్టమైన సాంజా ప్రసాదాన్నిచ్చాడు. మరల సాంజా ప్రసాదమాసింప బాబా ఆ కోరికగూడ దీర్చాడు. జోగ్ యనేభక్తుడు మూడవరోజున సాంజాను ప్రసాదంగా దెచ్చాడు. చావడి యుత్సవసమయాన దగ్గుచే మిగులబాధపడ పరుల దోషదృష్టిగా భావించాడు లక్ష్మీచందు. మరునాడు లాలా మజీదుకుపోగా ఎవరిదో దోషదృష్టి తనపైబడి బాధపడ్డానని వేరొకభక్తునితో అన్నారుబాబా. బాబా సర్వజ్ఞతను మరోసారి సవిజూశాడతడు. ఆపై సదా బాబాకు నిజమైన భక్తుడుగా మారాడు ధన్యజీవి లాలా లక్ష్మీచంద్. శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
Below is the letter Lala Lakshmichand wrote to his friend from Delhi dated 16-11-1920. "On the night of the 7th, His Holiness gave me Darshan at Shirdi. While going to the office on the 8th I thought I must receive some good news from Shirdi sooner or later. At 11 a.m. the very day I received a half-anna cover from Shirdi which contained some prasad of His Holiness. .... His Holiness though has left us from the visible world yet we are confident that He is still with us and helping us in every way He can as usual. My grand children who were sick are now hale and hearty by the grace of His Holiness." Ref: Sree Saisaccharitra, Saiamrithadhara.com.

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)