శ్రీసాయిబాబ చిత్రవిచిత్ర సచ్చరిత్ర!
శ్రీసాయినాథాయనమః! "నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరము. అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే! భావయుక్తంగా నా చర్యలు,శక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని , నేను సంపూర్ణముగా రక్షిస్తాను. నా మాట నమ్ము విశ్వాసంతో నన్ను కీర్తించి , నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము శాంతి ప్రసాదిస్తాను." శ్రీసాయిబాబ. ముందుగా పాఠక మహాశయులందరికి నా హృదయపూర్వక నమఃసుమాంజలులు. శ్రీ సాయి సచ్చరిత్ర నా నిత్యపారాయణ గ్రంధము. పెక్కుసార్లు చదివిన పిమ్మట ఓ ఆలోచన కల్గింది. అదేమన నిత్య అధ్యాయ పారాయణము చేయుటకు సమయం లేనప్పుడు కనీసం ప్రతిఅధ్యాయంలోని ఓ లీలను లేక మహిమను స్మరించుకొంటూ సుమారు గంటలోపు పూర్తి లీలా చరిత్ర సారాన్ని సింహావలోకనం జేసిన బావుండునని! ఆ ఆలోచనే నన్నీ రచనకు ప్రేరణ. చిత్రం, వెయ్యిమాటలకు సమమంటారుగావున చదివే సమయంలో లీలను స్ఫురింపజేసే చిత్రాన్ని జతచేయడమైనది. కేవలం చదవడమేగాక రాగయుక్తంగా పాడుకోదలచు భక్తులకనుగుణంగా రచనజేయడమైనది. పాఠక భక్తులకీనా ప్రయత్నమేమాత్రం తృప్తికల్గించినా అది బాబాదీవెనగా భావిస్తాను. వినుడు వినుడు శ్రీసాయికథ,చింతలుబాపే దివ్య కథ! పంతును చెంతకు లాగ...