అహేతు కరుణాసింధు సద్గురు 2.
శ్రీసాయినాథాయనమః! శ్రీరామకృష్ణాయనమః! రామకృష్ణ పరమహంస లీలాక్రమము సాయిబాబమహిమల సమాంతరము. పరమహంస అసంపూర్ణ అవతార కార్యాన్ని సాయిబాబా కొనసాగించారని చెప్పబడినది. రామకృష్ణులు మహాసమాధిచెందిన క్షణంలోనె, సాయిబాబా తమ మూడుదినముల ప్రాణరహిత స్థితినుండి స్పృహలోకి వచ్చారు. పరమహంస భూమిపై కేవలం ఐదుపదుల కాలం జీవించినా, ముప్పది వత్సరముల వయసుకే తమ దైవత్వాన్ని లోకానికి చాటారు. అన్నిమతముల దైవం ఒక్కడనే సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి లోకానికి తెలియపరిచారు. అటుపిమ్మట లోక కళ్యాణార్ధమై తమలీలా స్రవంతి కొనసాగించారు. వారి జీవిత పఠనం, శ్రవణం భక్తకోటికి అమృతప్రాయం. భక్తుల మానసిక చీకటులకు వెలుగుదీపమై ప్రకాశించారు. ప్రస్తుత కాలంలోని సమాజ రుగ్మతలకు లోనుకాని జీవనవిధానాన్ని బోధించారు. ప్రశాంతజీవితానికుపరరించే పెక్కు సూత్రాల ప్రజలకందించారు. కాంతాకనకాల వలయంలో చిక్కవలదని హెచ్చరించారు. రోగాల నుండి పాపాలనుండి పెక్కురీతుల భక్తుల రక్షించారు.శ్రీ రామకృష్ణుల అహేతు కరుణకు నిదర్శనంగా ఓ భక్తురాలిని పునీతను జేసిన సంఘటను తెలిసికొనిదెము. ఈ ఘటన సోమవారం, జూన్ 4,1883 న దక్షిణేశ్వర్, కాళీ దేవాలయం, పరమహంస నివసించే గదిలో జరిగినది. శ...