Posts

Showing posts from July, 2024

అందమైన బాబాబడి.

Image
శ్రీసాయినాథాయనమః! పాఠక భక్తులెల్లరకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు! శ్రీసాయిసత్చరిత్ర ముప్పదిరెండవ అధ్యాయంలో సాయిబాబ చదివినబడిగూర్చి వ్రాయబడినది. ప్రస్తుత వ్యాసంలో ఆయావివరములను స్మరించుకొందుము. బాబ తన ముగ్గురు మిత్రులతో కలసి ఓ అరణ్యంలో దేవునిగూర్చి చర్చిస్తు దైవాన్ని వెదక నారంభించారు. దైవ వశాత్తు బంజారా ఒకరు వారిని కలసి సాయంజేయ తలువ కేవలం సాయి మాత్రమే వాని ఆతీధ్యం స్వీకరించారు. ఆపై వారి గురువు ప్రత్యక్షమై కేవలం సాయిని మాత్రమే తమ బడిలో జేర్చుకొన్నారు. ఇందుకు కారణం వెదుక నారంభిస్తే కొన్నివిషయాలు బోధపడగలవు. సాయి మిత్రులు కేవలం పుస్తకజ్ఞానంతో స్వతంత్రంగా ఆలోచించి దైవాన్ని తెలుసుకో దలువ, బాబా మాత్రం పుస్తక జ్ఞానాన్ని నిరసించి మనకు విధించిన కర్మల పూర్తి జేస్తూ దేహాన్ని,మనసును,పంచప్రాణాలను గురుపాదముల బెట్టి మిగుల విశ్వాసంతో శరణువేడవలెనని తమవంతుగా అన్నారు. ఆ నల్వురు దారి కోల్పోయి మిగుల ఆకలితో యున్నప్పటికీ బంజారా ఆతిధ్యాన్ని కేవలం సాయి మాత్రమే స్వీకరించారు, మిత్రులు తిరస్కరించారు. ఇందులకు కారణం సాయి మిగుల ఆకలితో నుండటం. సాయి ఆకలి కేవలం శారీరకం మాత్రమే కాదు. దైవాన్ని తెలుసోకోవాలన్న తీవ్ర వియోగంత...