కల్లలుకాని కలలు ! పాఠక భక్తుల నూతనసంవత్సరపు కలలు శ్రీసాయిబాబా కృపచే సాఫల్యమగుగాక !
శ్రీసాయినాథాయనమః ! కలలు కల్లలంటారుగదా , మరిదీన్నిగూర్చి మాట్లాడుకోవడమెందుకనే ప్రశ్న పాఠకులకు రాకమానదు. లోకంలోని ఈ నానుడి నిజమైనా బాబా విషయంలో ఇందులకు విరుద్ధంగా తోస్తుంది. ఎందరో భక్తులకు బాబా కలల రూపంలో సందేశమిచ్చినట్లు శ్రీ సాయిసచ్చరిత్రలో చూడగలము. మనిషి చైతన్యం నాలుగు స్ధితులలో వ్యాపించినట్లు చెప్పబడుతుంది . అవి వరుసగా మెలకువ , స్వప్న , స్వప్నరహిత దీర్ఘ నిదుర మరియు ఈ మూడు స్థితులదాటిన నోటితో వివరింపలేని భావాతీత నాల్గవ స్థితి. ఈ భావాతీత స్థితి కేవలం అనుభవ గ్రాహ్యమేగాని ఎలాంటి వివరణకందని నిధి . భక్తులకు ఈ నాల్గు దశలలోను బాబానుండి సందేశాలు లభిస్తుండేవి,ప్రస్తుతకాలంలోను కొనసాగుతున్నవి. ఏకకాలంలో అన్నిస్థితులనున్న వివిధ వ్యక్తులకు,భక్తులకు సందేశమివ్వగల సర్వ సమర్థులు సాయిబాబ. సాగరం, ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాలనున్న విభిన్నమైన నాలుగు నగరాల తాకగలదుగదా, అదేవిధంగా సర్వవ్యాపి సాయి అన్నిస్థితులనున్నవారికి తమబోధన సుత్రాన్నందింపగలరు . ప్రస్తుత వ్యాసంలో కలలరూపంలో బాబా సమకూర్చిన అమృతానుభవాలను స్మరించుకొనెదము . ఈ వివరములు శ్రీ సాయి సచ్చరిత్రమునుండి గ్రహించడమైనది. రామభక్తుడైన ఓ డాక్...