శ్రీరామచరిత మానసము (తులసీరామాయణము) : రామనామ మహిమ .
శ్రీసాయినాథాయనమః ! నేడు " విశ్వావసు " నూతన తెలుగు ఉగాది (యుగాది/కొత్తయుగారంభము) పండుగ . రామనామము తలువకుండ శ్రీరాముని రూపమునూహింపలేము. కేవలము నామస్మరణచే హృదయమున సుందరరూపము దర్శింపగలము. సగుణ నిర్గుణ రూపాలకు సాక్షిభూతము నామము . అంతరంగికంగాగాని బాహ్యంగాగాని వెలుగు కావాలంటే రామనామ మణిని సదా వెలిగించు . సదానామజపముచే వివేకి బ్రహ్మ మాయనుండి ముక్తుడగును . నామరూపాలకతీతమైన అనుపమము , అనిర్వచనీయము మరియు అనామమునైన బ్రహ్మానుభూతి పొందును . అతిరహస్యపు భగవంతుని నిజరూపము కాంషించు ముముక్షువు నామజపంచే దైవాన్ని తెలియగలడు . సిద్ధులనాశించు సాధకుడు వాటిని పొందగలడు . బహుకష్టములనుండి ఆర్తుడు ముక్తుడగును . భగవంతునతిభక్తితో ధ్యానించు జ్ఞాని, పరమాత్మకత్యంతప్రియుడు . ఈవిధముగా నాలుగువిధములైన సాధకులకు నామమే ఆధారము . కలియుగంలో నామస్మరణమే అత్యంత విశేష ఫలదాయిని , ఇందేమాత్రపు సందేహములేదు . ప్రియభక్తుడు నిరంతరం రామనామామృతాన్ని ఆస్వాదిస్తుంటాడు . సాకార , నిరాకార రూప ఆరాధనలకంటే నామస్మరణం బహు శక్తివంతమైనది . అంతేకాదు , సాకార మరియు నిరాకార దైవాన్ని తెలియడం సులువుకాదు . కాని నామభజనచే ఈ రెంటి ర...