శ్రీరామచరిత మానసము (తులసీరామాయణము) : రామనామ మహిమ .

శ్రీసాయినాథాయనమః ! నేడు " విశ్వావసు " నూతన తెలుగు ఉగాది (యుగాది/కొత్తయుగారంభము) పండుగ .
రామనామము తలువకుండ శ్రీరాముని రూపమునూహింపలేము. కేవలము నామస్మరణచే హృదయమున సుందరరూపము దర్శింపగలము. సగుణ నిర్గుణ రూపాలకు సాక్షిభూతము నామము . అంతరంగికంగాగాని బాహ్యంగాగాని వెలుగు కావాలంటే రామనామ మణిని సదా వెలిగించు . సదానామజపముచే వివేకి బ్రహ్మ మాయనుండి ముక్తుడగును . నామరూపాలకతీతమైన అనుపమము , అనిర్వచనీయము మరియు అనామమునైన బ్రహ్మానుభూతి పొందును . అతిరహస్యపు భగవంతుని నిజరూపము కాంషించు ముముక్షువు నామజపంచే దైవాన్ని తెలియగలడు . సిద్ధులనాశించు సాధకుడు వాటిని పొందగలడు . బహుకష్టములనుండి ఆర్తుడు ముక్తుడగును . భగవంతునతిభక్తితో ధ్యానించు జ్ఞాని, పరమాత్మకత్యంతప్రియుడు . ఈవిధముగా నాలుగువిధములైన సాధకులకు నామమే ఆధారము . కలియుగంలో నామస్మరణమే అత్యంత విశేష ఫలదాయిని , ఇందేమాత్రపు సందేహములేదు . ప్రియభక్తుడు నిరంతరం రామనామామృతాన్ని ఆస్వాదిస్తుంటాడు . సాకార , నిరాకార రూప ఆరాధనలకంటే నామస్మరణం బహు శక్తివంతమైనది . అంతేకాదు , సాకార మరియు నిరాకార దైవాన్ని తెలియడం సులువుకాదు . కాని నామభజనచే ఈ రెంటి రూపాల అవగాహన సులభసాధ్యము . కావున నిరాకార బ్రహ్మముకంటెను , సాకారరూప శ్రీరామునికంటెను రామనామమే ఘనమని చెప్పడమైనది . రత్నపు లక్షణాలనెరిగినవానికి దాని విలువ తెలుస్తుంది , అలాగే నామమహిమ నెరిగినవాడు నామశక్తి తెలియగలడు . శ్రీరామచంద్రుడు భక్తుల శ్రేయస్సునకై మానవజన్మనెత్తి బహుకష్టముల ననుభవించాడు. కాని భక్తులు కేవలం ప్రేమతో రామనామాన్ని స్మరిస్తూ పరమానందభరితులౌతారు . శ్రీరామచంద్రుడు కేవలం తపస్వి అహల్యనుద్ధరించాడు,కాని రామనామం కోట్లకొలది దుష్ట జనుల నుద్ధరించినది . శ్రీరాముడు కేవలము తాటకి , సుబాహు మరియు రాక్షసగణముల పరిమార్చగా వాని నామము సూర్యుడు రాత్రిని పారద్రోలినవిధంగా భక్తుల దోషముల , దుఃఖముల , దురాశల దూరంచేస్తుంది . శ్రీరామచంద్ర ప్రభు కేవలం దండకారణ్యాన్ని మాత్రమే పావనంజేస్తే,వాని నామం అసంఖ్య ప్రజల జీవనముల పునీతం జేసింది . శ్రీరామచంద్రప్రభు రాక్షససమూహాన్ని పరిమార్చగా వానినామం కలికాలపు సమస్త పాపాలను కూకటివేళ్లతో పెకలించివేసినది . శ్రీరాముడు కేవలం శబరి , జటాయువులాంటి ఉత్తమసేవకులకు మోక్షం కల్గిస్తే రామనామం అగణిత దుష్టులనుద్ధరించినది . శ్రీరాముడు కేవలం సుగ్రీవ విభీషుణులకాశ్రయమిస్తే వాని పావననామం పెక్కు పేదలకాశ్రయదాయిని . శ్రీరామచంద్రులు కోతి కొండముచ్చుల సాయంతో కొద్దిపాటి శ్రమతో వారధి నిర్మించగా వారి నామం సంసార సాగరాన్నే పూర్తిగా శుష్కిమ్పజేస్తోంది. శ్రీరామచంద్రుడు యుద్ధమున రావణాసురుని సకుటుంబముగా సంహరించి సీతామాతతో అయోధ్యకేగి రాజ్యమేల, దేవతలు మునులు రామునిగుణగణముల బహువిధముల స్తుతించారు . కాని శ్రీరామభక్తుడు కేవలం నామజపముచేతను ఎలాంటి శ్రమలేక మోహాది ప్రబలసేనల జయించి ప్రేమమగ్న హృదయంతో ఆత్మానందాన్ననుభవిస్తాడు. ఈవిధంగా శ్రీరామనామజపము సగుణ నిర్గుణోపాసనలకంటే మిగుల ఘనమైనది . రామనామము వరములిచ్చువారలకు సైతం వరదాయిని . మహాశివుడు హృదయపూర్వకంగా ఈసత్యమెరిగినందునే కోటిరామచరిత్రలనుండి కేవలము రామనామమును మాత్రమే గ్రహించాడు . నామప్రసాదముచే శంభుడు అవినాశి , అమంగళ వేషధారియైనను మంగళకారి . శుక సనకాది మునులు యోగిగణములు నామధ్యానంచే బ్రహ్మానందాన్ననుభవిస్తున్నారు . నారదుడు నామశక్తి నెరిగినవాడు . హరి సమస్తజనులకు ప్రియుడు . నారద మహర్షి హరిహరాదులకు ప్రియమైనవాడు. కేవలం నామజపముచేతనే ప్రహ్లాదుడు భక్తశిఖామణియైనాడు . ధ్రువుడు హరినామస్మరణచే దుఃఖవిముక్తుడై అచల అనుపమ స్థానాన్ని పొందాడు . పవిత్రనామస్మరణ చేస్తూ హనుమంతుడు రాముని వశవర్తుని గావించాడు . నీచుడైన అజామిళుడు , గజేంద్రుడు , వేశ్య లు సయితము శ్రీహరినామస్మరణచే ముక్తిపొందారు . నేను (తులసీదాసు ) రామనామ ఘనతనేమని కొనియాడగలను , స్వయం శ్రీరామచంద్రుడు తమ నామగుణముల కీర్తింపజాలడు. కలియుగంలో రామనామం కల్పతరువు , కళ్యాణకారి . కేవలం నామస్మరణచే హీనుడైన తులసీదాసు పవిత్రమైన తులసీసమానుడయ్యాడు. కేవలం కలియుగంలోనే కాక నాలుగు యుగాలలో , మూడుకాలాలలో మూడులోకాలలో సర్వజీవులు దుఃఖరహితులయ్యారు . సర్వపుణ్యముల ఫలము శ్రీరామనామ ప్రేమయందే నిబిడమైనదని వేదపురాణముల , సాధుసంతుల సమైక్య భావము . మునుపు సత్యయుగంలో ధ్యానము , త్రేతాయుగంలో యజ్ఞము , ద్వాపరయుగంలో పూజాదులచే భగవంతుడు ప్రసన్నుడు . కానిప్రస్తుత మలినభూరితమైన కలియుగంలో కేవలం నామస్మరణమే కల్పవృక్షము . పరలోకంలో పరంధామాన్ని ఇహంలో తల్లిదండ్రుల్లా పోషణ రక్షణల నందిస్తుంది. కలికాలంలో కర్మ భక్తి జ్ఞానములు శూన్యములు కేవలము రామనామమే ఆధారము . కాలనేమి రాక్షసుని హతమార్చిన బుద్ధిమంతుడు సమర్ధుడగు హనుమంతునివలె కలికపటముల హరించునది కేవలము హరినామమే ! రామనామము శ్రీనృసింహ భగవానుడు , కలియుగము హిరణ్యకశిపుడు , జపించు జనులు ప్రహ్లాదసములు . దేవత వైరులైన దైత్యుల బోలు కలికలుషముల హరించి, జపముజేయు భక్తుల రక్షించును . ప్రేమచేగాని , వైరముచేగాని , ఆలస్యభావంచేగాని జపించినవారలకు దశదిశల శుభములు కలుగును . అలాంటి పరమకల్యాణకారణ రామనామము స్మరించి శ్రీరఘునాథులకు శిరసువంచి శ్రీరామచంద్రుల గుణగణముల వర్ణించెదను (సంత్ తులసీదాసు.ఆగస్టు 11,1511- జులై 30,1623.రామాయణ రచన: రామనవమి 1574 న ప్రారంభమై రెండు సంవత్సరాల , ఏడుమాసముల ఇరువదియారు దినముల పిమ్మట 1576 మార్గశిర మాసపు శ్రీసీతారామకల్యాణ శుభదినమున పరిసమాప్తమైనది .రచనాస్థలములు :అయోధ్య , వారణాసి , చిత్రకూటము . ) .
Devotional Translation Śrī Sāyināthāya Namaḥ! Today is “Viśvāvasu” – the sacred Telugu Ugadi, the dawn of a new divine era. Without the Name of Rama, we cannot truly behold the form of Sri Rama. By the sweetness of His Name alone, the beautiful form of the Lord blossoms in the heart. The Name is the witness to both the manifest and the unmanifest, the saguna and nirguna forms. If we seek inner and outer light, we must keep the jewel of the Rama-Name ever shining. By constant remembrance of His Name, the seeker becomes free from Brahma’s Maya. He attains the inexpressible, incomparable, nameless Brahman-experience— that which is beyond all name and form. The earnest seeker who yearns to behold the true, secret form of the Lord realizes God through the simple path of Name-japa. The aspirant who strives for perfection attains all siddhis through the Name. The sufferer is lifted out of his sorrows. And the wise one, absorbed in devotion, becomes most dear to the Supreme. Thus, for the four kinds of devotees, the Name alone is the support. In Kali Yuga, there is absolutely no doubt— the Name is the most powerful, most fruitful path. The loving devotee constantly tastes the nectar of Rama’s Name. Name-remembrance is far stronger than worship of the Lord with form or without form. For the saguna and nirguna forms are beyond the grasp of many, yet through the Name both become easily known. Hence, it is said: Even beyond the formless Brahman, even beyond the divine form of Rama Himself, the Rama-Name is supreme. Only one who knows the value of a gem understands its worth; so too, only one who knows the glory of the Name understands its power. Sri Ramachandra, for the sake of His devotees, took human birth and endured countless hardships. But the devotee, with simple love, need only chant His Name to be filled with supreme bliss. Sri Rama liberated only Ahilya with His touch, but His Name has liberated millions of sinful souls. Rama slew Tataka, Subahu, and the hosts of demons, but His Name destroys the darkness of sorrow, sin, and desire as the sun destroys the night. Rama sanctified only the Dandaka forest, but His Name has purified the lives of countless beings. Rama destroyed one clan of demons, but His Name uproots the sins of this entire Kali age. Rama granted liberation to noble servants like Sabari and Jatayu, but His Name has uplifted innumerable fallen ones. Rama sheltered Sugriva and Vibhishana, but His holy Name is the refuge of the poor and helpless. Rama built a bridge across the ocean with the help of monkeys, but His Name dries up the entire ocean of worldly existence. Rama slew Ravana in battle and returned to Ayodhya, while gods and sages sang His glories. But the Rama-devotee, through simple Name-japa, conquers the mighty armies of delusion and experiences the bliss of the Self without effort. Thus, Rama-Name is loftier than both saguna and nirguna worship. The Name grants boons even to those who grant boons. Lord Shiva, knowing this deepest truth, from the countless stories of Rama, chose only the Name as his treasure. Through the grace of the Name, Shiva— though outwardly fierce and ash-smeared— became the auspicious One. Suka, Sanaka and the great yogis taste the bliss of Brahman through Name-meditation. Narada knows the power of the divine Name. Hari is dear to all beings, and Narada is dear to Hari and Hara. Through Name-japa alone, Prahlada became the crown of devotees. Dhruva attained his unshakable, eternal seat through Nama-smaraṇa. Hanuman, chanting the pure Name, made Rama His very breath. Even the fallen—Ajamila, Gajendra, and sinful women— achieved liberation through the Name of Hari. And I, Tulasidas, how can I ever praise the greatness of Rama-Name? Even Sri Rama Himself cannot fully extol His own Name’s glory. In this Kali Yuga, Rama-Name is the wish-fulfilling tree, the bestower of auspiciousness. By Name-remembrance alone, the lowly Tulasidas became as pure as the sacred Tulasi itself. Not only in Kali Yuga, but in all four yugas, all three times, all three worlds, beings have found freedom from sorrow through the love of Rama’s divine Name. The Vedas, the Puranas, saints and sages agree: The essence of all merit shines in the love of Sri Rama’s Name. In Satya Yuga, meditation; in Treta Yuga, sacrifice; in Dvapara Yuga, worship— these pleased the Lord. But in this dark Kali age, Name-smaraṇa alone is the wish-fulfilling tree. It grants the highest heaven hereafter and protects like loving parents in this world. When karma, devotion and knowledge weaken in this age, Rama-Name alone stands as our refuge. As Hanuman crushed the demon Kalanemi, so the Name alone destroys the deceits of Kali. Rama-Name is Sri Narasimha; Kali Yuga is Hiranyakashipu; and those who chant are like Prahlada. The Name destroys the demonic impurities of this age and protects all who chant— whether with love, fear, or even laziness. From every direction, blessings arise. Meditating on such a supremely auspicious Rama-Name, I bow my head to Sri Raghunatha and sing the divine glories of Sri Ramachandra. —Saint Tulasidas (11 August 1511 – 30 July 1623) His Ramayana was begun on Rama Navami 1574 and completed on the sacred day of Sita-Rama Kalyana in Margashira 1576 in Ayodhya, Varanasi, and Chitrakuta.

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)