Posts

Showing posts from June, 2025

అధ్యాత్మరామాయణము : వాల్మీకి మహర్షి తో సమాగమము!

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా గుహుని నావలో గంగానదిని దాటి భరద్వాజ ఆశ్రమము చేరి ఆ మునివర్యుని ఆతీధ్య, ఆశీసులపిమ్మట వాల్మీకి మహర్షిని సందర్శించి ప్రణమిల్లెను . అంత వాల్మీకి త్రిలోక సుందరుడు ,మన్మధాకారుడు, జటాముకుట శోభితుడు , కమలనేత్రుడు , రామనాథుడు యగు రాముని సీతాలక్ష్మణులతో చూచినవెంటనే లేచి , విస్మయముతో ,రెప్పవేయక చూచుచు , హర్షపులకాంకితుడై ,పరమానందస్వరూపుడైన రాముని కౌగలించుకొని ,జగత్పూజనీయుడైన అతనిని భక్తిగా ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరించి ,మధురములగు కందమూల , ఫలాదులను భుజింపచేసి,వాత్సల్యముతో స్నేహముతో లాలించెను . అపుడు శ్రీరాముడు అత్యంత వినయముతో అంజలించి ,వాల్మీకి మహర్షితో " మేము మా తండ్రి ఆజ్ఞతో దండకారణ్యమునకు వచ్చితిమి . మీరు సర్వము తెలిసినవారే ! ఇక మేము కారణమేమని చెప్పుదుము? నేను సుఖముగా నివసింప ఉచితమగు స్థానమును మీరు తెలియచేయవలసినదని కోరుచున్నాను . మీరు నిర్దేశించిన స్థానమున నేను సీతతోడ కొంతకాలము గడిపెదను" అనెను . రాముడు ఇట్లు పలుకగా మునివరుడు చిరునగవుతో ఇట్లనెను . " రామా ! సమస్తలోకములకు నీవొక్కడవే నివాస స్థానము . ఈజీవులెల్లరు మీకు ని...