Posts

Showing posts from August, 2025

అధ్యాత్మ రామాయణము : గుహుని శ్రీరామదర్శనము.

Image
శ్రీసాయినాథాయనమః ! సీతాలక్ష్మణహనుమత్సమేత శ్రీరామచంద్రాయనమః ! అరణ్యవాససమయమున సీతాలక్ష్మణ సహిత శ్రీరాముడు సుమంత్రునిచే నడుపబడిన రథమవరోహించి సర్వసమృద్ధములగు ప్రదేశముల జూచుచు ,శృంగవేదపురము దాపుననేయున్న గంగాతీరము చేరెను . గంగనుదర్శించి నమస్కరించి ప్రసన్నమనస్కుడై అందు స్నానమాచరించి పిదప సమీప శింశుపావృక్షమునీడ కూర్చుండెను . ఆసమయమున గుహుడు పరిజనులద్వారా రామ శుభాగమన వార్తవిని సఖుడు , స్వామియగు రాముని దర్శించుటకై పరమానందముతో,భక్తితో ఫల మధుపుష్పాదులను చేకొని కదలివచ్చి సాష్టాంగ దండ ప్రణామము జేసెను . రాముడు వెనువెంటనే ఆతనిలేవనెత్తి ఆలింగనము జేసికొనెను. శ్రీరాముడు కుశలమడుగగా గుహుడు చేతులు జోడించి " లోకపావనా ! నేను ధన్యుడను . నా యీ నిషాద జన్మము సఫలమైనది . మీ శరీర సంస్పర్శమున నేను పరమానందమును పొందితిని . రఘువరా ! నిషాదుడనగు ఈదాసుని రాజ్యము నీదియే! నీవిచ్చటనేయుండి మమ్ము పాలించుము . నగరమునకు వచ్చి నన్ను పావనము జేయుము . దేవా ! నీకై సేకరించిన యీ ఫలమూలాదులను స్వీకరింపుము . సురోత్తమా ! నేను నీ దాసుడను . నాపై కృపచూపుము " అని ప్రార్థించెను. రాముడీమాటలకు అత్యంత ప్రీతిచెంది " ...