అధ్యాత్మ రామాయణము : గుహుని శ్రీరామదర్శనము.

శ్రీసాయినాథాయనమః ! సీతాలక్ష్మణహనుమత్సమేత శ్రీరామచంద్రాయనమః !
అరణ్యవాససమయమున సీతాలక్ష్మణ సహిత శ్రీరాముడు సుమంత్రునిచే నడుపబడిన రథమవరోహించి సర్వసమృద్ధములగు ప్రదేశముల జూచుచు ,శృంగవేదపురము దాపుననేయున్న గంగాతీరము చేరెను . గంగనుదర్శించి నమస్కరించి ప్రసన్నమనస్కుడై అందు స్నానమాచరించి పిదప సమీప శింశుపావృక్షమునీడ కూర్చుండెను . ఆసమయమున గుహుడు పరిజనులద్వారా రామ శుభాగమన వార్తవిని సఖుడు , స్వామియగు రాముని దర్శించుటకై పరమానందముతో,భక్తితో ఫల మధుపుష్పాదులను చేకొని కదలివచ్చి సాష్టాంగ దండ ప్రణామము జేసెను . రాముడు వెనువెంటనే ఆతనిలేవనెత్తి ఆలింగనము జేసికొనెను. శ్రీరాముడు కుశలమడుగగా గుహుడు చేతులు జోడించి " లోకపావనా ! నేను ధన్యుడను . నా యీ నిషాద జన్మము సఫలమైనది . మీ శరీర సంస్పర్శమున నేను పరమానందమును పొందితిని . రఘువరా ! నిషాదుడనగు ఈదాసుని రాజ్యము నీదియే! నీవిచ్చటనేయుండి మమ్ము పాలించుము . నగరమునకు వచ్చి నన్ను పావనము జేయుము . దేవా ! నీకై సేకరించిన యీ ఫలమూలాదులను స్వీకరింపుము . సురోత్తమా ! నేను నీ దాసుడను . నాపై కృపచూపుము " అని ప్రార్థించెను. రాముడీమాటలకు అత్యంత ప్రీతిచెంది " మిత్రమా ! నేను ఈ పదునాలుగేండ్లు గ్రామమునుగాని ,గృహమునుగాని ప్రవేశింపను . అన్యులొసంగిన ఫలమూలాదులు భుజింపను . నీవన్న రీతి ఈరాజ్యమంతయు నాదే . నీవు నాకత్యంత ప్రియసఖుడవే " అని బదులు పలికెను . తదుపరి రఘునందనుడు మఱ్ఱిపాలు తెప్పించి కేశపాశముల సవరించుకొని ,లక్ష్మణునితో సహా జటాజూటము ధరించెను . సీతాసమేతుడై జలమును మాత్రము త్రాగెను . అంతట లక్ష్మణుడు కుశపత్రాదులతో శయ్య నేర్పరచెను . తొలుత అయోధ్యానగర ప్రాసాదమున చక్కగా నేర్పరచబడిన హంసతూలికా తల్పమునందువలె,సుఖముగా సీతాసహితుడై కుశ శయ్యపై పవళించెను . వారికి చేరువుగానే ధనుర్బాణ తూణీరములు ధరించి, లక్ష్మణుడు ధనుర్ధారియైన గుహునితోగూడి కావలి కాచెను .
నిదురించుచున్న శ్రీరాముని పరికించి గుహుడు కన్నులనీరు నిండగ, వినయపూర్వకముగా లక్ష్మణునితో " సోదరా ! చూచుచుంటివా ? దివ్యభవనమున సుందరతరమగు స్వర్ణ పర్యంకముపై శయనించెడి రాముడు సీతాసహితుడై కుశపత్రమయమగు శయ్యపై నిదురించినాడు . విధాత, రాముని దుఃఖమునకు కైకేయిని కారణము గావించెను . మంధర బుద్ధిని విశ్వసించి కైకేయి ఘోర పాపకృత్యమును ఆచరించినది. ఈమాటలు విని లక్ష్మణుడు ఇట్లనెను - " సోదరా ! నామాట వినుము . ఒకని సుఖమునకుగాని,దుఃఖమునకుగాని వేరెవ్వరును కారణము కాదు . మానవుని పూర్వకృత కర్మమే అతని సుఖమునకుగాని దుఃఖమునకుగాని కారణమగుచుండును . సుఖదుఃఖములనిచ్చువారు వేరెవ్వరులేరు. పరులెవ్వరో సుఖదుఃఖములకు కారణమని తలచుట తెలివితక్కువ . ' నేను చేయుచున్నాను' అనుకొనుట మిధ్యాభిమానము . ఏలయన జనులు తమతమ కర్మపాశములచే కట్టబడియున్నారు. మానవుడు స్వయముగా కర్మలు ఆచరించి తదనుగుణముగా సుహృత్తు , మిత్రుడు , శత్రువు , ఉదాసీనుడు , ద్వేషి , మధ్యస్తుడు, బంధువు మున్నగువారిని కల్పించుకొనుచున్నాడు . కావున మానవుడు ప్రారబ్ధానుసారము సుఖదుఃఖాదులలో ఏది ప్రాప్తించినను అనుభవించుచు సదా ప్రసన్నచిత్తుడై యుండవలెను . నాకు భోగములు వచ్చుట యందుగాని పోవుటయందుగాని అపేక్షలేదు భోగములు వచ్చిన రావచ్చును , పోయిన పోవచ్చును . భోగములకు మనము అధీనులము. ఏదేశమున ఏకాలమున ఎవడు ఏ శుభాశుభకర్మలు ఆచరించునో వానిని అతడు అనుభవింపవలసియుండును . దీనిని ఎవరు తప్పింపలేరు . కావున శుభాశుభ కర్మఫలము ప్రాప్తించగనే హర్షమునో శోకమునో పొందుట నిరర్థకము . విధాతగతిని దేవదానవులలో ఎవరును ఉల్లంఘింపజాలరు . మానవుడు సదా సుఖదుఃఖములచేత చుట్టబడి యుండును . మనుష్య శరీరము పాపపుణ్యఫలముగా ఉత్పన్నమగుటచే సుఖదుఃఖమయముగానే యుండును . సుఖము వెనుక దుఃఖము , దుఃఖమును అనుసరించి సుఖము , పగలు రేయివలె జీవులకు అపరిహార్యము . కావున విద్వాంసులు ' అంతయు మాయయే' యను భావము కలిగి ఇష్టానిష్ట ప్రాప్తియందు ధైర్యము వహించి హర్షశోకములను పొందరు. " గుహుడు లక్ష్మణుడు ఈవిధముగా సంభాషించుకొనుచుండగనే అరుణోదయమైనది .
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయిశ్రీసాయి జైజైసాయి ! కృపాళు శ్రీరామచంద్రుని రక్ష అనుక్షణము అందరికి లభించుగాక !
Translation Śrī Sāyināthāya Namaḥ! Śrī Sītā–Lakṣmaṇa–Hanumad-Sameta Śrī Rāmachandrāya Namaḥ! During their forest exile, Sri Rama, accompanied by Sita and Lakshmana, alighted from the chariot driven by Sumantra and, viewing the prosperous and beautiful regions on the way, reached the banks of the river Ganga near the town of Śṛṅgavera. Beholding the sacred Ganga, Rama bowed, felt immense peace of mind, bathed in her waters, and then sat down under the shade of a nearby śiṁśupā tree. At that time, Guha heard the auspicious news—brought by his attendants—of the arrival of his dear friend and Lord, Sri Rama. Filled with supreme joy and devotion, he brought fruits, honey, and flowers, hurried to the spot, and offered full prostration at Rama’s feet. Rama immediately lifted him up and embraced him warmly. When Rama asked after his welfare, Guha, folding his hands, said: “O purifier of the world! I am blessed indeed. My birth as a Nishada has become fruitful today. By the touch of your divine body I have attained supreme bliss. O Raghava! This kingdom of your servant, the Nishada, is truly yours. Stay here and rule over us. Please come to my town and sanctify me. Lord! Kindly accept these fruits and roots collected for you. O best of gods! I am your servant alone—shower your grace upon me.” Rama was very pleased with these words and replied: “My friend! For these fourteen years I shall not enter any town or dwelling. I shall not eat fruits or roots given by those other than forest-dwellers. As you said, indeed this entire kingdom is mine—but you are my dearest companion.” After this, Rama had marri-pālu (banyan milk) brought and arranged his matted hair with Lakshmana’s help. Along with Sita, he partook only of water. Then Lakshmana prepared a bed of kuśa grass. Rama, who formerly slept upon a swan-feathered bed in the palace of Ayodhya, now lay comfortably upon the kuśa bed along with Sita. Close by, armed with bow, arrows, and quiver, Lakshmana stood guard along with Guha, the great archer. As Rama slept, Guha’s eyes filled with tears. He humbly said to Lakshmana: “Brother! Do you see this? Rama, who once reclined on a magnificent golden couch in a divine palace, now lies with Sita on a simple bed of kuśa grass. Fate has made Kaikeyi the cause of Rama’s distress. Believing the wicked counsel of Manthara, she committed a terrible deed.” Hearing this, Lakshmana replied: “Brother, listen to me. No one is the cause of another’s happiness or sorrow. A person’s past actions alone are responsible for the joy or suffering he experiences. No one else bestows joy or sorrow. It is the ignorance of the unwise to think that others cause one’s happiness or misery. The thought ‘I am the doer’ itself is false pride. All beings are bound by the chains of their own karma. By his own actions a man creates for himself friends, enemies, neutrals, those who hate him, those who support him, and relatives. Therefore, according to the dictates of prārabdha, whatever joy or sorrow comes, one must experience it with equanimity. I neither desire the coming of pleasures nor sorrow their departure. Enjoyments may come or go—they are not under our control. In whichever time and place a man performs good or bad deeds, their results must be experienced by him; none can escape them. Hence rejoicing in prosperity or grieving in adversity is futile. The decree of destiny cannot be violated even by gods or demons. Human life is woven of the results of virtue and sin, and so is ever intertwined with joy and sorrow. Joy follows sorrow and sorrow follows joy, just as day follows night—inevitable for all living beings. Therefore the wise, realizing that everything is Maya, remain steady in both gain and loss, free from elation and despair.” While Guha and Lakshmana conversed thus, the reddish dawn arose. May the rays of Sri Sai’s compassion shine upon all! May all be blessed! Om Sai, Sri Sai, Jai Jai Sai! May the merciful protection of Sri Ramachandra be upon everyone at every moment!

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)