Posts

Showing posts from September, 2025

విష్ణుమాయ.

Image
శ్రీసాయినాథాయనమః! లేనిది ఉన్నటుల,ఉన్నది లేనటులగ ఇంద్రియములకు గోచరమగునది మాయయని విజ్ఞులు వివరిస్తుంటారు. మానుష నామరూపాలు తాత్కాలికములు, అందులకు మూలమైన చైతన్యము నిరంతరంగా వెలుగుతుంటుంది. కనులకు కనబడు మనుషులు వస్తువులు నిత్యమని, వారిని నడిపించే శక్తికెలాంటి అవసరము లేదని తలచుట మాయగ వారు బోధిస్తుంటారు. శ్రీసాయిసచ్చరిత్ర లోని 13వ అధ్యాయములో విష్ణుమాయను గూర్చి వ్యాఖ్యానించారు సాయిబాబా. తనకు ఇల్లూవాకిలి భార్యాబిడ్డలు ఇతర బాదరబందీ లేనప్పటికీ తాను ఎక్కడికీ కదలక పాత మజీదున యున్నప్పటికీ హరిమాయ తన్నావరించి బాధిస్తుందని. బ్రహ్మ ఇంద్రాది దేవతలను,నారదాది మహామునులు సయితం విష్ణుమాయ విడవలేదుగదా! ఇందులకు నివారణోపాయంగా మాయాముక్తి మార్గాన్ని దయతో బోధించారు బాబా. అదేమన నిరంతరం భజనజేసి హరిని ప్రసన్నుని జేసుకుంటే ఆ మాయపొర తొలగుతుందని.యోగులు తమ ప్రతిరూపమని శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పియున్నారు. అదేసందర్భంలో మాయనుండి బయటపడుటకు ఓ నిగూఢసత్యాన్ని భక్తులకు తెలిపారు బాబా, ఎల్లప్పుడు సాయి సాయి యని స్మరించిన సప్తసముద్రముల మాయను దాటించెదనని. అనగా సాయినామస్మరణ, హరినామస్మరణ సమతుల్యమని చెప్పకనే చెప్పారు. అంటే ...