శ్రీసాయిసందేశామృతము 3 (Nectar of Sri Sai's message 3).
శ్రీసాయినాథాయనమః.నేడు శ్రీసత్యసాయిబాబ శతజయంతోత్సవము . బాబాప్రేమవర్షం అందరిపై కురియుగాక ! సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము 3.శ్రీసాయిలీలల వెనుక జ్ఞానబోధ,ధర్మబోధ,వివేకవైరాగ్యములు సూక్ష్మరూపంలో మిళితమై ఉంటాయి. బోధ శ్రవణ మననాదులచే హృదయంలో భక్తిప్రేమలు అప్రయత్నంగానే వికసిస్తాయి.బాబాలీలలు ఎలాంటి తర్కానికి అందక మిగుల ఆనందాశ్చర్యముల కలిగిస్తుంటాయి. కావున పదే పదే చెప్పెడివారు బాబ, "ఎవరు సదా నన్ను పూజింతురో,స్మరింతురో,చరిత్ర మననం చేయుదురో వారికి తృప్తి శాంతుల సమకూర్చెదను. సకల రోగముల నివారించెదను. మరణమునుండి బయటకు లాగెదను. పాపముక్తులజేసెదను". బలమైన అయస్కాంత క్షేత్రపరిధిలోనున్న లోహరజము ఆ క్షేత్రశక్తిని సంతరించుకొన్నట్లు; పరమానందానికి, తృప్తిశాంతులకు నిలయమైన సాయిసన్నిధిలో భక్తులు మిగుల ఆనందభరితులు కావడం సహజమేకదా! పునరపి మరణ పునరపి జనన వలయంనుండి భక్తులలాగి సద్గతి ప్రసాదిస్తారు సాయి. భక్తుల భావాల, శక్తియుక్తుల కనుగుణంగా వారికి పనులప్పచెప్పెడివారు బాబా. అ...