శ్రీసాయిసందేశామృతము 3 (Nectar of Sri Sai's message 3).

శ్రీసాయినాథాయనమః.నేడు శ్రీసత్యసాయిబాబ శతజయంతోత్సవము . బాబాప్రేమవర్షం అందరిపై కురియుగాక ! సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము 3.శ్రీసాయిలీలల వెనుక జ్ఞానబోధ,ధర్మబోధ,వివేకవైరాగ్యములు సూక్ష్మరూపంలో మిళితమై ఉంటాయి. బోధ శ్రవణ మననాదులచే హృదయంలో భక్తిప్రేమలు అప్రయత్నంగానే వికసిస్తాయి.బాబాలీలలు ఎలాంటి తర్కానికి అందక మిగుల ఆనందాశ్చర్యముల కలిగిస్తుంటాయి. కావున పదే పదే చెప్పెడివారు బాబ, "ఎవరు సదా నన్ను పూజింతురో,స్మరింతురో,చరిత్ర మననం చేయుదురో వారికి తృప్తి శాంతుల సమకూర్చెదను. సకల రోగముల నివారించెదను. మరణమునుండి బయటకు లాగెదను. పాపముక్తులజేసెదను". బలమైన అయస్కాంత క్షేత్రపరిధిలోనున్న లోహరజము ఆ క్షేత్రశక్తిని సంతరించుకొన్నట్లు; పరమానందానికి, తృప్తిశాంతులకు నిలయమైన సాయిసన్నిధిలో భక్తులు మిగుల ఆనందభరితులు కావడం సహజమేకదా! పునరపి మరణ పునరపి జనన వలయంనుండి భక్తులలాగి సద్గతి ప్రసాదిస్తారు సాయి. భక్తుల భావాల, శక్తియుక్తుల కనుగుణంగా వారికి పనులప్పచెప్పెడివారు బాబా. అహంకారము తొలగి వేణువుగా మారిన అన్నాసాహెబ్ హృదయంలో ప్రవేశించి తమ చరితను తామే రచించారు. బాబా తమ ఘనత శక్తిసామర్ద్యములగూర్చి ఎన్నడూ మాట్లాడేవారుకాదు. ఎల్లప్పుడూ దైవమెయజమాని తాము కేవలం వారి బానిసననెడివారు. కాని ప్రస్తుత అధ్యాయంలో తమ నిజ స్వరూపం గూర్చి భక్తులవిశ్వాసం బలపడటం కోసం వివరించారు " మీరెక్కడున్ననూ,ఏమి చేయుచున్ననూ నాకు తెలియును. అందరి హృదయముల నివసించువాడను,పాలించువాడను.ప్రపంచ చరాచరజీవకోటి నావరించియున్నాను. ఈజగత్తును నడిపించువాడిని సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను,త్రిగుణముల సామరస్యమును, ఇంద్రియచాలకుడను ,సృష్టి స్థితికారకుడను. ఎవరైతే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారికేహానిగాని బాధగాని కలుగదు. చరాచర జీవకోటియంతయు నా శరీరమే, నా రూపమే. నన్నుమరచిన వారిని మాయ శిక్షించును".బాబా చెప్పిన ఈ మహిమాన్విత వివరణ కేవలం దైవానికే వర్తిస్తుంది. ఆవిధంగా తామే దైవమని చెప్పక చెప్పారని గ్రహింపవచ్చును. ఇది సాయి, నిగూఢ సందేశంగా భావింపగలము. భక్తులపట్ల బాబా ప్రేమ నిర్హేతుకమైనది,తల్లిప్రేమను పెక్కుమార్లు మించునది. పదవీ విరమణ జేసిన రచయితకు బాబా దయచే మరికొంతకాలంపాటు వేరే ఉద్యోగం లభించింది. బాబాకు దైవ ప్రార్ధనలంటే మిగుల ఇష్టం. గ్రామవాసులు ఫిర్యాదు జేసినప్పటికీ బిగ్గరగ అరుస్తూ ఖురాను చదివే రోహిల్లాను సమర్ధించారు. సాయిబాబా సర్వవ్యాపకతను,సర్వజ్ఞతను,సమర్ధతను గ్రహించి వారిని భగవత్స్వరూపంగా పూజించి సేవించుట, సర్వజీవులలో సాయిని దర్శించి అందరిపట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించుట ప్రస్తుత అధ్యాయ సందేశంగా స్వీకరింపగలము. శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
" I am the Self, O Arjuna,seated in the hearts of all beings;I am the beginning,the middle and also the end of all beings". The Holy Gita 10:20 ( " ఓ అర్జునా! నేను సకల భూతములయొక్క హృదయకమలమందుండు ప్రత్యగాత్మను,సమస్తభూతములయొక్క,సృష్టి స్థితి లయములును లేక ఆదిమధ్యాంతములును నేనే!").
Śrī Sāyināthāya Namaha Today is the Centenary Jayanti Utsavam of Śrī Sathya Sai Baba. Śrī Sai Sandesha-amṛtam – Chapter 3 Behind every divine leela of Sri Sai lies a subtle essence of wisdom, dharma, discrimination, and detachment. When these teachings are heard, reflected upon, and contemplated, devotion and pure love naturally blossom within the heart. Baba’s leelas stand beyond the reach of ordinary logic; they awaken in the devotee a sweet sense of wonder and inner joy. Thus Baba repeatedly declared: “Whoever constantly worships Me, remembers Me, and contemplates My life and teachings—I grant them peace and fulfilment. I remove their diseases, rescue them from danger and death, and free them from sins.” Just as a piece of iron becomes magnetized when placed in a strong magnetic field, devotees who remain in Sai’s divine presence—the seat of bliss, peace, and contentment—naturally become filled with joy. From the endless cycle of birth and death, Sai draws His devotees out and grants them liberation and auspicious destiny. According to each devotee’s faith, strength, and inner maturity, Baba entrusted them with tasks and responsibilities. When ego dissolves, the heart becomes like a flute—empty, open, and receptive. Into such a heart Baba entered, and through such hearts—like that of Annasaheb Dabholkar—He wrote His own divine story. Baba never spoke of His own greatness or power; He always declared Himself merely an instrument of the Almighty, a servant of the Supreme. Yet, in this chapter, to strengthen the faith of His devotees, Baba revealed His true cosmic nature: “Wherever you may be, whatever you may be doing, I know. I reside in all hearts and sustain all beings. This entire universe, moving and unmoving, is under My care. I am the director behind this cosmic play. I am the Divine Mother, the harmony of the three gunas, the controller of the senses, the power behind creation and preservation. Whoever turns their vision toward Me shall never face harm. All beings are My very body, My very form. Those who forget Me are corrected by Maya.” Such a profound declaration belongs only to the Divine. Thus, without openly proclaiming it, Baba revealed that He Himself is the Supreme Reality. This is the subtle, hidden message of this chapter. Baba’s love for devotees is unconditional—exceeding even a mother’s love. By His grace, the author, who had retired from service, was granted another job and livelihood. Baba loved prayer and devotion immensely. Even when villagers complained about the Rohilla who loudly recited the Qur’an, Baba defended him—affirming that sincere prayer, in any form, is dear to the Divine. Understanding Baba’s omnipresence, omniscience, and omnipotence, worshipping Him as God incarnate, serving Him wholeheartedly, and seeing Sai in all beings—this is the message this chapter offers us. May the divine rays of Sri Sai’s infinite compassion shine upon everyone! May all beings be blessed! Om Sai, Sri Sai, Jai Jai Sai!
" Love all,Serve all. Help ever,Hurt never."
" Every day should be a day of thanksgiving for the gifts of life; sunshine,water, and the luscious fruits and greens that are indirect gifts of the Great Giver. God makes us work so that we may deserve to receive His gifts. The All-Sufficient One does not need our thanks, however heartfelt, but we are grateful to Him our attention is concentrated, for our highest benefit, upon the Great Source of all supply." Paramahansa Yogananda," Self-Realization Magazine"

Comments