శ్రీసాయిసందేశామృతము 5. (Nectar of Sri Sai's Message 5). Merry Christmas to all the readers!
శ్రీసాయినాథాయనమః. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము శ్రీసాయిసందేశామృతము అధ్యాయము 5. జగత్కళ్యాణకారకులు శ్రీసద్గురుసాయినాథులు! ఒక్కరోజు జరిగే వివాహమహోత్సవానికి వచ్చి లోకకళ్యాణార్ధమై శిరిడీలో శాస్వితంగా, కాలానికతీతంగా వెలుగొందుచున్నారు. నవవిధభక్తులకు సంకేతమన్నటుల చాందుభాయి పాటీలు తొమ్మిదిమైళ్ళు నడచినపిమ్మట మామిడిచెట్టు నీడలో నొక వింతఫకీరును దర్శించాడు. పాటీలు తప్పిపోయిన తన గుఱ్ఱముకై మిగుల చింతితుడు. ఫకీరు, ఒక్కమాటతోనే తప్పిన గుఱ్ఱపుజాడ తెలిపి వాని మనసుకు శాంతిని సమకూర్చాడు. నిలకడలేని అశ్వం చంచలమైన మనసుకు సంకేతం. సద్గురు సన్నిధిలో శాంతిపొందెడి మనసులాగా, దారితప్పిన గుఱ్ఱాన్ని తిరిగి పొందాడు పాటీలు.శాంతించిన మనసుకు గురుకృపయనెడి చిలుము లభించింది. ఆచిలుము వెలిగించే క్రియలో నీరు నిప్పుల సృష్టి జూసిన పాటీలు మిగుల చకితుడై ఫకీరుశక్తికి వసుడైనాడు. పంచభూతాలు సైతం సద్గురు ఆజ్ఞను పాటించవలసినదే! పెండ్లివారితో వచ్చి ఖండోబాగుడివద్ద బండిదిగుచున్న ఫకీరును, అప్రయత్నంగా "సాయి"పిలుపుతో పూ...